వరంగల్: జిల్లా చదరంగం సంఘం ఆధ్వర్యంలో చదరంగం పోటీలు నిర్వహిస్తున్నట్లు సంఘం ప్రతినిధి కన్నా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 24న ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయి ర్యాంకింగ్ చదరంగం పోటీలు హన్మకొండలోని తిరుమల తిరుపతి దేవస్థానం వేడుకల మందిరంలో నిర్వహించనున్నట్లు పేర్కన్నారు. పూర్తి వివరాలకు ఫోన్ నంబరు 90595 22986లో సంప్రదించాలని సూచించారు.
Author: Shivaganesh
-
విద్యుత్ స్తంభాలపై టీవీ కేబుల్స్ తొలగింపు..
సంగారెడ్డి: విద్యుత్ స్తంభాలపై ఉన్న నెట్, టీవీ కేబుల్స్‌ను వెంటనే తొలగించాలని టీజీఎస్‌పీడీసీఎల్ ఉన్నతాధికారులు ఆదేశించారు. దీనిపై జోగిపేట ఏఈ శ్రీనివాస్ మాట్లాడుతూ.. జోగిపేట డివిజన్ ఫరిదిలో నెట్, టీవీ కేబుల్స్‌ను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నెట్ ఆపరేటర్లు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఆదేశాలను పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
-
రైతులకు అవగాహన కార్యక్రమం..
మెదక్: నర్సాపూర్ రైతు వేదికలో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని వ్యవసాయ అధికారులు, రైతులతో కలిసి నిర్వహించారు. సమావేశంలో అగ్రికల్చర్ ఆఫీసర్ దీపిక, ఏఈఓ మోహన్, హార్టికల్చర్ ఆఫీసర్ విష్ణువర్ధన్ రెడ్డి, రైతు రక్షణ సమితి సలహాదారు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ.. రైతు సమస్యలపై చర్చించి, వారికి అవగాహన కల్పించినట్లు తెలిపారు.
-
పంటపొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే
ఆదిలాబాద్: బింపూర్ మండలంలోని భారీ వర్షాలతో నష్టపోయిన పంటపొలాలను మంగళవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ పరిశీలించారు. మండలంలోని కరంజి టి, గోముత్రి, అర్లిటి, వడూర్, గ్రామాల్లో ఆయన పర్యటించి రైతులతో మాట్లాడి వారికి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందే వరకు అండగా ఉంటామని ధైర్యంగా చెప్పారు. నష్టపోయిన రైతు ఎకరాకు రూ. 25 వేలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
-
‘మీసేవలపై దాడులను ఖండించాలి’
మహబూబాబాద్: రాష్ట్రంలో మీసేవల ఉద్యోగ సిబ్బందులపై జరుగుతున్న దాడులను వెంటనే ఖండించాలని మీసేవ సంఘం జిల్లా అధ్యక్షుడు దేశ బోయిన అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. జిల్లాకేంద్రంలోని ఉన్న మీసేవ సెంటర్‌లో జిల్లా కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించి నిరసన తెలిపారు. హైదరాబాద్‌లో జరిగిన దాడిని ఖండించారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు రాము, శ్రీనివాసచారి, జానీ, అనిల్, నాగేంద్ర, అరుణ్, తదితరులు పాల్గొన్నారు.
-
‘స్లాట్ బుకింగ్ చేసుకోవాలి’
జనగామ: ఈనెల 22 నుంచి 29 వరకు జరిగే సదరం క్యాంపు కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి వసంత తెలిపారు. లెప్రసీ, యాసిడ్ బాధితులు, వినికిడిలోపం, కంటి చూపు కోల్పోయినవారు, తలసేమియా, నరాల బలహీనత వంటి రుగ్మతలతో బాధపడుతున్న దివ్యాంగులకు కొత్తవారికి 160, రెన్యువల్ కోసం 60 స్లాట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. స్లాట్ బుకింగ్ చేసుకున్న వారు క్యాంపునకు హాజరు కావాలన్నారు.
-
‘అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి’
నిర్మల్: భారీ వర్షాలకు సోమవారం కురన్నపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడ కూలిపోయింది. ఈసందర్భంగా పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. ప్రహరీ గోడ కూలిపోవడంతో పాఠశాల ఆవరణలోకి మూగజీవాలు, కుక్కలు, పందులు వస్తున్నాయని అన్నారు. పాఠశాలలో 200 మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారని, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.
-
‘ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి’
మెదక్: నర్సాపూర్ పట్టణంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంజనేయులు గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దన్నారు. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయని, ఎవరు కూడా వాగులు దాటే ప్రయత్నం చేయద్దని సూచించారు. ఇబ్బందులు ఉంటే వెంటనే అధికారులకు సమాచారం అందించాలన్నారు.
-
యూరియా వినియోగంపై సూచనలు..
మెదక్: నర్సాపూర్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు ఆర్.సంధ్యారాణి రైతులకు యూరియా వినియోగంపై పలు సూచనలు చేశారు. ఒక పంట కాలానికి ఎకరానికి రెండు బస్తాల యూరియా మాత్రమే అవసరమని, అంతకంటే ఎక్కువ వాడితే పురుగులు, వ్యాధులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. యూరియా వాడిన తర్వాత నానో యూరియా వాడితే పంట ఆరోగ్యంగా పెరిగి పెట్టుబడి తగ్గి, దిగుబడి పెరుగుతుందని వివరించారు.
-
‘సజీవ సాక్ష్యం ఫోటో’
మహబూబాబాద్: జిల్లా కేంద్రంలో మానుకోట ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రాఫర్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సంఘం జిల్లా అధ్యక్షుడు తోట సుభాష్ పాల్గొని సంఘ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్ ,వర్తమాన తరాలకు సజీవ సాక్ష్యం ఫోటో అని కొనియాడారు.కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు, ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు.