Author: Shivaganesh

  • రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలి మృతి

    మహబూబాబాద్: రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి చెందిన ఘటన కురవిలో ఆదివారం చోటుచేసుకొంది. రాజోలు గ్రామానికి చెందిన వీరోజు లక్ష్మి(75) శనివారం రాత్రి కురవికి వచ్చారు. నిద్ర చేసిన అనంతరం ఆదివారం ఆటోలో రాజోలుకు వెళ్తుండగా కురవి శివారు లింగ్యాతండా సమీపంలో ప్రమాదవశాత్తు ఆటో బోల్తాపడింది. ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు.

  • నేడు మెట్‌పల్లి నుంచి నిర్మల్‌కు బస్సు ప్రారంభం

    నిజామాబాద్: జగిత్యాల జిల్లా మెట్‌పల్లి నుంచి ఇబ్రహీంపట్నం – సావెల్ మీదుగా నిర్మల్ వరకు మెట్‌పల్లి డిపోకు చెందిన నూతన పల్లె వెలుగు బస్సు సోమవారం ప్రారంభం కానుంది. ఈ బస్సు మెట్‌పల్లి నుంచి నిర్మల్ వరకు ప్రతి రోజు మూడు ట్రిప్పులుగా తిరుగుతుందని మెట్‌పల్లి డిపో మేనేజర్ దేవరాజ్ తెలిపారు. పరిసరమార్గ ప్రయాణికులు ఈ బస్సు సర్వీస్‌ను స్వదివినియోగం చేసుకోవాలని ప్రయాణికులకు సూచించారు.

  • ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన రాజేశ్వర్

    నిజామాబాద్: ఎర్గట్ల పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా పడాల రాజేశ్వర్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ఆయనకు పోలీస్ సిబ్బంది స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. మండలంలో నేరాలను అదుపులో ఉంచటానికి కృషి చేస్తామని అన్నారు. ఎవరైన చట్టాన్ని అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

  • కనుల పండువగా బీరన్న బోనాలు

    వరంగల్: తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం బీరన్న బోనాల కనుల పండువగా జరిగాయి. కరీమాబాద్, ఉర్సులోని కురుమ కుల మహిళలు భక్తితో బొనమెత్తుకొని ఊరేగింపుగా బీరన్న గుడికి వెళ్లి స్వామి వారికి నైవేద్యం సమర్పించి, మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారిని మంత్రి కొండా సురేఖ, మేయర్ సుధారాణి, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, భక్తులు దర్శించుకున్నారు.

  • ‘ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలి’

    వరంగల్: వరంగల్ నగరంలో వివిధ రంగ కార్మికులతో ఆదివారం సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కాసు మాధవి సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ..  రాష్ట్రంలో పని గంటల పరిమితిని 8 గంటల నుంచి 10 గంటలకు పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని అన్నారు. సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కరపత్రాలను అందించారు.  సమావేశంలో పలువురు కార్మికులు, సంఘం నాయకులు పాల్గొన్నారు.

  • థియేటర్ ముందు ప్రేక్షకుల ఆందోళన

    వరంగల్: జిల్లా కేంద్రంలోని రామ్ లక్ష్మణ్ థియేటర్ వద్ద సినిమాకు వచ్చిన ప్రేక్షకులు ఆదివారం ఆందోళన చేశారు. మధ్యాహ్నం 2.45 గంటలకు జురాసిక్ వరల్డ్ 3D సినిమా నడుస్తున్న క్రమంలో, త్రీడీ బొమ్మ కనిపించకపోవడంపై ప్రేక్షకులు అసహనానికి గురయ్యారు. దీంతో టికెట్ కౌంటర్ వద్దకు వెళ్లి ఆందోళన చేశారు. ఈక్రమంలో థియేటర్ యాజమాన్యం షో నిలిపివేసి టికెట్ డబ్బులు ఇచ్చి పంపించారు.

  • మామునూరులో కుక్కలకు టీకాలు

    హన్మకొండ: మామునూరులో ఆదివారం పీవీ నరసింహారావు తెలంగాణ పశు వైద్య విద్యాలయం ఆధ్వర్యంలో ప్రపంచ జునోసిస్ దినోత్సవం నిర్వహించారు. ఈసందర్భంగా డాక్టర్లు ఇఫ్రికార్ అహ్మద్, అంబిక, బాలకృష్ణ ఆధ్వర్యంలో కుక్కలకు టీకాలు వేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. జునోసిస్ అనగా జంతువుల నుంచి మనుషులకు సక్రమించే అంటూ వ్యాధి అని,  దానిపై అవగాహన కల్పించినట్లు తెలిపారు.

  • ‘సమ్మెను విజయవంతం చేయాలి’

    హన్మకొండ: జిల్లా కేంద్రంలోని పబ్లిక్ గార్డెన్లో ఆదివారం ఆటో డ్రైవర్ల సమావేశం నిర్వహించారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈనెల 9వ తేదీన నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆటో కార్మికులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి, వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.

  • పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని

    హన్మకొండ: జిల్లా కేంద్రంలోని జేఎన్ఎస్ స్టేడియంలో ఆదివారం రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొని పోటీలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. క్రీడలతో మానసిక ఉల్లాసం లభిస్తుందని అన్నారు. క్రీడల్లో రాణించి భవిష్యత్లో ఉన్నత స్థానంలో ఉండాలని ఆకాంక్షించారు.

  • రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్రగాయాలు

    ములుగు: రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్రగాయాలైన ఘటన ఆదివారం గోవిందరావుపేట మండలం పసర గ్రామ సమీపంలో వెలుగుచూసింది. గాంధీనగర్ గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు బైక్‌పై పసర వైపు వెళ్తూ, ఆగి ఉన్న మరొక బైక్‌ను ఢీకొట్టారు. ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని అంబులెన్స్‌లో ములుగు ఏరియా హాస్పిటల్‌కి తరలించారు.