ఆదిలాబాద్: ఓ ఆవు మేడ ఎక్కిన ఘటన జిల్లా కేంద్రంలో వెలుగుచూసింది. జిల్లా కేంద్రంలోని టీచర్స్ కాలనీలో ఓఆవు ఓ బహుళ అంతస్తు భవనంలోని 5వ అంతస్తు పైకి ఎక్కింది. ఈక్రమంలో దిగటానికి ఇబ్బంది పడటాన్ని గమనించిన కాలనీవాసులు వెంటనే ప్రణీత్ గోమాత సేవ ఫౌండేషన్‌కు సమాచారం అందించారు. ఫౌండేషన్ సభ్యులు చేరుకొని ఆవును సురక్షితంగా కిందికి దించారు.
Author: Shivaganesh
-
‘అణగారిన కులాల అభివృద్ధికి కృషి చేశారు’
ఆదిలాబాద్: జిల్లా కాంగ్రెస్ ఎస్సీ విభాగం అధ్యక్షుడు లింగంపల్లి చంద్రయ్య ఆధ్వర్యంలో ఆదివారం జగ్జీవన్‌రామ్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన చిత్రపటానికి చంద్రయ్య నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశ ఉప ప్రధానమంత్రిగా అనేక సంస్కరణలు తీసుకొచ్చి, అణగారిన కులాల అభివృద్ధికి జగ్జీవన్‌రామ్ ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు .
-
ట్రాక్టర్ కిందపడి మహిళా కూలీ మృతి
సూర్యాపేట: ట్రాక్టర్ నుంచి జారిపడి మహిళా కూలీ మృతి చెందిన ఘటన మఠంపల్లి మండలంలో వెలుగుచూసింది. హుజూర్‌నగర్ మండలం గోపాలపురం గ్రామానికి చెందిన నవనీత(27) మఠంపల్లి మండలం రఘునాథపాలెం గ్రామంలో స్లాబ్ కూలీకి వెళ్లింది. పని పూర్తి అయిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో ట్రాక్టర్‌పై కూర్చున్న ఆమె ప్రమాదవశాత్తు ట్రాక్టర్ నుంచి జారిపడి అక్కడికక్కడే మృతి చెందింది.
-
తాత్కాలిక బోధనకు దరఖాస్తుల ఆహ్వానం
హన్మకొండ: ఒకేషనల్ కళాశాలలో తాత్కాలిక బోధన కోసం అర్హత, అనుభవం కలిగిన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కోఆర్డినేటర్ దాసరి ఉమామహేశ్వరి తెలిపారు. ఆసక్తి కలిగిన వారు రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల జూనియర్ కళాశాలలో ఈనెల 8న నిర్వహించనున్న ఇంటర్వ్యూ, డెమోలకు హాజరుకావాలని తెలిపారు. పూర్తి వివరాలకు http:tgswreis.telangana.gov.in వెబ్ సైట్‌ను సందర్శించాలన్నారు.
-
తొలి ఏకాదశి పూజల్లో ఎమ్మెల్యే దంపతులు
హన్మకొండ: జిల్లా కేంద్రంలోని చారిత్రక వేయిస్తంభాల దేవాలయంలో ఆదివారం తొలి ఏకాదశి పూజలు వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి – నాయిని నీలిమరెడ్డి దంపతులు పాల్గొని జ్యోతిప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభంచారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సంపదతో, శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
-
మందమర్రిలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి
మంచిర్యాల: మందమర్రిలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆదివారం డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతిని పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు సప్పిడి నరేష్ పాల్గొని ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భారత రాజకీయ చరిత్ర ప్రముఖులలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఒకరని కొనియడారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
-
ఆర్టీసీ ప్రత్యేక టూర్
సంగారెడ్డి: పుణ్యక్షేత్రాలను దర్శించుకునే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీలను తీసుకొచ్చినట్లు శనివారం జహీరాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ స్వామి తెలిపారు. జహీరాబాద్ నుంచి యాదగిరిగుట్ట ఆలయానికి ఈనెల 6న ఎక్స్‌ప్రెస్ బస్సు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
-
వ్యవసాయ అధికారిణికి వినతి
మంచిర్యాల: నెన్నెల వ్యవసాయ అధికారిణి సుప్రజను శనివారం బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పంజాల సాగర్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెన్నెల మండల రైతులకు సరిపడా యూరియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలో కనీసం యూరియా బస్తా దొరకడం లేదని, ఉన్నా లింకులు పెట్టి ఇస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.
-
ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన కలెక్టర్
ములుగు: వెంకటాపురం మండల పరిధిలోని మలాపురం, రాచపల్లి గ్రామాల్లో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లను శుక్రవారం కలెక్టర్ దివాకర పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్లను త్వరతిగతిన పూర్తి చేయాలని అన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలంసంలో రికార్డు రూమ్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో రాజేంద్ర ప్రసాద్, తహసీల్దార్ వేణుగోపాల్, తదితరులు పాల్గొన్నారు.
-
జూద స్థావరంపై పోలీసుల దాడి
నల్గొండ: జూదశిబిరంపై పోలీసులు దాడి చేసి ఐదుగురిని అరెస్ట్ చేసిన ఘటన శుక్రవారం కొండమల్లేపల్లి మండలంలో వెలుగుచూసింది. ఈసందర్భంగా ఎస్సై రమేష్ నాయక్ మాట్లాడుతూ.. కేశ్యతండా నుంచి రాముని గుండ్లతండాకు వెళ్లే దారిలో ఓ గుట్టచాటున కొంతమంది జూదం నిర్వహిస్తుండగా ఐదుగురుని అరెస్ట్ చేశామన్నారు. మరో నలుగురు పరారయ్యారని పేర్కొన్నారు. వారిని తొందరలోనే పట్టుకుంటామని తెలిపారు.