Author: Shivaganesh

  • మందుపాతర పేలి వృద్ధుడికి తీవ్రగాయాలు

    ములుగు: మందుపాతర పేలి వృద్ధుడికి గాయాలైన ఘటన శుక్రవారం వెంకటాపురం మండలం ముక్కునూరుగుట్టపై చోటుచేసుకుంది. కంకబొంగుల కోసం గుట్టపైకి వెళ్లిన సోయం కామయ్య అనే వృద్ధుడు ప్రమాదవశాత్తు మందుపాతరపై కాలు వేశాడు. అది పేలి తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామస్థుల సహాయంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు.

     

  • తిరుమలగిరిలో కృతజ్ఞత కార్యక్రమం

    సూర్యాపేట: చేనేత ఆధారిత వృత్తిదారులకు రూ.లక్ష లోపు చేనేత ఋణ మాఫీ చేస్తూ పరిపాలన అనుమతులు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రులకు శుక్రవారం తిరుమలగిరిలో కృతజ్ఞత కార్యక్రమం నిర్వహించారు. చేనేత కార్మికుల కోసం రూ.33కోట్లను ఇప్పించినందుకు పద్మశాలి, చేనేత సమాజం తరఫున ధన్యవాదములు తెలియజేశారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

  • ‘రోశయ్య సేవలు చిరస్మరణీయమం’

    యాదాద్రి భువనగిరి: గుండాల ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం మాజీ ముఖ్యమంత్రి రోశయ్య జయంతి వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీవో దేవేందర్ రావు పాల్గొని ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా ఆయన సేవలు చిరస్మరణీయమని అన్నారు.  కార్యక్రమంలో ఎంపీడీవో సూపర్డెంట్ మల్లయ్య, పంచాయతీ కార్యదర్శి మనోహర్, సిబ్బంది పాల్గొన్నారు.

     

  • ‘పెండింగ్ బిల్లులను విడుదల చేయాలి’

    యాదాద్రి భువనగిరి: గుండాల మండల కేంద్రంలో శుక్రవారం టీఎస్ యూటీఎఫ్ గుండాల మండల కమిటీ ఆధ్వర్యంలో 2025- 26 ఏడాది సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటాచారి పాల్గొని మాట్లాడుతూ.. పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేసి పీఆర్సీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు యాదయ్య, వెంకటేష్, వెంకటరామిరెడ్డి, లింగయ్య, తదితరులు పాల్గొన్నారు.

     

  • ‘రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి’

    సూర్యాపేట: కోదాడ మండల పరిధిలోని రైతులందరు కచ్చితంగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని మిర్యాల క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి మట్టపల్లి మహేష్ సూచించారు. శుక్రవారం కూచిపూడి తండాలోని గ్రామ పంచాయతిలో ఆయన తండా రైతులకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రిజిస్ట్రేషన్‌లో నమోదు చేసుకోవడం వలన కేంద్ర ప్రభుత్వ పథకాలు పొందవచ్చని అన్నారు.

  • జవహర్ బాల్ మంచ్ రాష్ట్ర కో ఆర్డినేటర్‌గా ప్రమోద్ 

    వరంగల్: పర్వతగిరి మండలం కొంకపాక గ్రామానికి చెందిన బొక్కల ప్రమోద్ జవహర్ బాల్ మంచ్ రాష్ట్ర కోఆర్డినేటర్‌గా శుక్రవారం నియమితులయ్యారు. ఈసందర్భంగా ఆయనకు జాతీయ ఛైర్మన్ డాక్టర్ జి.వి.హరిజీ, తెలంగాణ జాతీయ సమన్వయకర్త ఇన్‌ఛార్జ్ డాక్టర్ శామ్యూల్ జార్జ్, తెలంగాణ రాష్ట్ర చైర్మన్ రుషికేశ్ రెడ్డి నియామక పత్రాన్ని అందజేశారు. తనపై నమ్మకంతో ఈ పదవి ఇచ్చినందుకు ప్రమోద్ కృతజ్ఞతలు తెలిపారు.

  • రేపు విద్యుత్తు సరఫరాలో అంతరాయం

    సిద్దిపేట: దౌల్తాబాద్ మండల పరిధిలో శనివారం విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని శుక్రవారం ఏ.ఈ పి.శ్రీనివాసరావు తెలిపారు. ముబారస్పూర్ సబ్ స్టేషన్ మెయింటనెన్స్‌లో భాగంగా ఉదయం 08 గంటల నుంచి 10 గంటల వరకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలుగుతుందన్నారు. వినియోదారులు, రైతులు విద్యుత్తు సిబ్బందికి సహకరించాలని కోరారు.

  • హుస్నాబాద్‌లో రోశయ్య జయంతి వేడుకలు

    సిద్దిపేట: హుస్నాబాద్ ఆర్యవైశ్య భవన్‌లో శుక్రవారం ఉమ్మడి ఆంద్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జయంతి వేడుకను నిర్వహించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రోశయ్య సేవలను కొనియడారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర, జిల్లా, పట్టణ సంఘం నాయకులు పాల్గొన్నారు.

  • ‘పల్లె ప్రగతియాత్ర చేపట్టనున్నాం’

    మహబూబాబాద్: హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్ సభలో ప్రభుత్వవిప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయని అన్నారు. పల్లె ప్రగతియాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్ అగ్రనాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

     

  • చోరీ కేసులో ఏడాది జైలు శిక్ష..

    సూర్యాపేట: గొలుసు అపహరించిన కేసులో ముద్దాయికి ఏడాది జైలు శిక్షను విధిస్తూ శుక్రవారం తుంగతుర్తి జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి ఎండి గౌస్ పాషా తీర్పునిచ్చారు.  తుంగతుర్తి మండలం గానుగబండకి చెందిన పోలెపాక రమేష్ 2021 ఏప్రిల్23న బాపన్‌బాయ్‌ తండాకు చెందిన లకావత్ తార మెడలోని బంగారు గొలుసును చోరీ చేశాడు. కేసు విచారణలో భాగంగా నేడు న్యాయమూర్తి పైవిధంగా తీర్పు వెలువరించారు.