సూర్యాపేట: తెలంగాణలోని ప్రతి మండల కేంద్రంలో బీసీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం హుజూర్‌నగర్ నియోజకవర్గ అధ్యక్షుడు ధూళిపాల శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మండలం కేంద్రంలో మాట్లాడుతూ.. జనాభాలో 56% ఉన్న బీసీలకు సరైన న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి బీసీ విద్యార్థికి గురుకులంలో సీటు కల్పించాలని కోరారు.
Author: Shivaganesh
-
గోవర్ధన్ కుటుంబానికి ఆర్థిక సాయం
నల్గొండ: రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం కొండమల్లేపల్లిలో ఫోటోగ్రాఫర్ ఆదాసు గోవర్ధన్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈసందర్భంగా అసోసియేషన్ సభ్యులు వారి కుటుంబానికి రూ.1.65 లక్షలు ఆర్థిక సాయంగా అందజేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ కోశాధికారి భీమిడి మాధవరెడ్డి, క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ జగదీష్ గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంధం రూపేంద్ర కుమార్, తదితరులు పాల్గొన్నారు.
-
ములుగులో పోలీసు యాక్ట్ అమలు: ఎస్పీ
ములుగు: జిల్లాలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు శుక్రవారం ఎస్పీ శబరిష్ తెలిపారు. శాంతిభద్రతల దృష్ట్యా ఈరోజు నుంచి 31 తేదీ వరకు సిటీ పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందన్నారు. ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించవద్దని హెచ్చరించారు. బంద్‌ల పేరుతో బలవంతంగా సంస్థలు, కార్యాలయాలను మూసివేయాలని ఒత్తిడి, బెదిరింపులకు గురిచేస్తే చట్టరీత్యా చర్యలు తప్పవన్నారు.
-
పాలేరు రిజర్వాయర్‌కు సాగర్ జలాలు
నల్గొండ: నాగార్జున సాగర్ నుంచి తాగునీటి అవసరాల నిమిత్తం ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్‌కు సాగర్ ఎడమ కాల్వ ద్వారా ఒక టీఎంసీని కేటాయించినట్లు శుక్రవారం ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. అందులో భాగంగా 1000 క్యూసెక్కుల నీటి విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ప్రతిరోజు 1000 క్యూసెక్కుల చొప్పున మూడు రోజుల పాటు మూడు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
-
‘నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి కొమురయ్య’
జనగామ: దేవరుప్పుల మండలం కడవెండి గ్రామంలో శుక్రవారం సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజాంకు వ్యతిరేకంగా పోరాడి అమరుడైన వ్యక్తి దొడ్డి కొమురయ్య అని కొనియాడారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
-
‘పరిశుభ్ర పట్టణానికి ప్రతిఒక్కరూ సహకరించాలి’
యాదాద్రి భువనగిరి: వంద రోజుల కార్యాచరణ ప్రణాళికా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మోత్కూరు పురపాలక సంఘ పరిధిలోని 6వ వార్డులో మున్సిపల్ కమిషనర్ కె.సతీష్ కుమార్ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తడి,పొడి చెత్తలను వేరువేరుగా పారిశుద్ధ్య సిబ్బందికి అందజేయాలన్నారు. పరిశుభ్ర పట్టణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్, పారిశుద్ధ్య సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.
-
సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేసిన ఎమ్మెల్యే
హన్మకొండ: ఐనవోలు మండలం వనమాలకనపర్తి చెందిన సింగారపు మొండయ్య కుమార్తె ప్రియాంజలి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు. శుక్రవారం వారికి సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.2.25 లక్షల ఎల్ఓసీ చెక్కును వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు అందజేశారు. పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి గొప్ప వరం అని అన్నారు.
-
మోత్కూర్‌లో దొడ్డి కొమురయ్యకు ఘన నివాళి
యాదాద్రి భువనగిరి: మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో శుక్రవారం సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని ఆయన విగ్రహానికి పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి యానాల దామోదర్‌రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నైజాంకు వ్యతిరేకంగా పోరాడి అమరుడైన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
-
‘బహుజన బిడ్డ దొడ్డి కొమురయ్య’
హన్మకొండ: బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య వర్ధంతిని నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ పాల్గొని ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించి మాట్లాడారు. నిజాం నిరంకుశ పాలనకు, దొరల పెత్తందారీ విధానానికి వ్యతిరేకంగా పోరాడి అమరుడైన బహుజన బిడ్డ దొడ్డి కొమురయ్య అని కొనియడారు.
-
వేయింగ్ మిషన్స్ అందజేత
ఖమ్మం: జిల్లా కేంద్రంలోని పలు అంగన్‌వాడీ కేంద్రాలకు కార్పొరేటర్ కన్నం వైష్ణవి గురువారం సొంత ఖర్చులతో డిజిటల్ వేయింగ్ మిషన్స్‌ను ఉచితంగా అందజేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిన్నారులు, బాలింతలు, గర్భిణీల సౌకర్యం కోసం డిజిటల్ వేయింగ్ మిషన్స్‌ను అందజేసినట్లు పేర్కొన్నారు. తల్లిదండ్రులు చిన్నారులను అంగన్‌వాడీ కేంద్రాలకు పంపించాలన్నారు. కార్యక్రమంలో పలువురు మహిళలు, తదితరులు పాల్గొన్నారు.