ఖమ్మం: జిల్లా కేంద్రంలోని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ కార్యాలయంలో గురువారం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల మధ్య నదీజలాల విషయంలో ఉద్రిక్తతలు సృష్టించడం ద్వారా ప్రజల్లో చిచ్చుపెట్టాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. బనకచర్ల-పోలవరం అనుసంధాన ప్రాజెక్టును కారణంగా చూపిస్తూ తప్పుడు వివాదాలు పెంచి, ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారన్నారు.
Author: Shivaganesh
-
బాధ్యతగా విధులు నిర్వహించాలి: కమిషనర్
వరంగల్: జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్ లో గురువారం 106 -వరంగల్ (తూర్పు) నియోజకవర్గ పరిధిలోని బూత్ స్థాయి ఆఫీసర్లకు జాతీయ శిక్షణ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బల్దియా కమిషనర్, నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి చాహత్ బాజ్ పాయ్ పాల్గొని మాట్లాడుతూ.. బూత్ లెవెల్ అధికారులు బాధ్యతగా విధులు నిర్వహించాలని అన్నారు. విధులు సమర్థవంతంగా నిర్వహించుటకు పలు సూచనలు చేశారు.
-
‘50% పూర్తయిన రేషన్ కార్డ్స్ వెరిఫికేషన్’
హన్మకొండ: బల్దియా కాన్ఫరెన్స్ హాల్లో రేషన్ కార్డ్ వెరిఫికేషన్ అధికారులతో గురువారం బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రేషన్ కార్డ్స్ వెరిఫికేషన్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు. వెరిఫికేషన్ ప్రక్రియ పురోగతిని సమీక్షించారు. ఇప్పటికే 50% వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిందని, మిగతా దరఖాస్తుల వెరిఫికేషన్ ప్రక్రియను ఈ నెల 10 లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
-
‘అన్నిదానాల కన్నా అన్నదానం గొప్పది’
హన్మకొండ: ఈనెల 10న వరంగల్‌లో సాయి సేవాదళ్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని మహా అన్నదానం నిర్వహించనున్నారు. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను గురువారం ట్రాఫిక్ అదనపు డీసీపీ ప్రభాకర్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్నిదానాల కన్నా అన్నదానం గొప్పదని తెలిపారు. కార్యక్రమంలో ఆరుట్ల శ్రీనివాస్, ఉమామహేశ్వర స్వామి, తదితరులు పాల్గొన్నారు.
-
కరపత్రాన్ని ఆవిష్కరించిన వీసీ
హన్మకొండ: వడ్డేపల్లి పింగళి మహిళా డిగ్రీ కాలేజీలో సెప్టెంబర్ 17,18 తేదీల్లో వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ బి.చంద్రమౌళి తెలిపారు. గురువారం సదస్సుకు సంబంధించిన కరపత్రాన్ని కే.యూ వీసీ ప్రొఫెసర్ ప్రతాప్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం వీసీ మాట్లాడుతూ.. ఈ సదస్సు కృత్రిమ మేధాశక్తి వాణిజ్యం, మానవ వనరులపై చూపే ప్రభావంపై దృష్టి సారించనుందన్నారు. కార్యక్రమంలో పలువురు ప్రొఫెసర్లు పాల్గొన్నారు.
-
మధిరలో సీపీఎం నాయకుల ధర్నా
ఖమ్మం: మధిర ఎండీఓ కార్యాలయం, ఆర్ అండ్ బి కార్యాలయం ఎదుట గురువారం సీపీఎం పార్టీ నాయకులు ధర్నా చేశారు. ఈసందర్భంగా పార్టీ డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు మాట్లాడుతూ.. అధికార పార్టీ నాయకులకు ఒక చట్టం సాధారణ ప్రజలకు మరో చట్టమా అని అధికారుల తీరుపై మండిపడ్డారు. తొండల గోపారం గ్రామంలో అన్యాక్రాంతమైన స్థలాలపై వెంటనే విచారణ జరిపించాలన్నారు.
-
‘రాజకీయ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి’
ఖమ్మం: సీపీఐ(ఎం) కారేపల్లి మండల కార్యకర్తలకు ఈనెల 5, 6 తేదీల్లో రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు పార్టీ మండల కార్యదర్శి కె.నరేంద్ర గురువారం తెలిపారు. కార్యకర్తలకు సైద్ధాంతిక అవగాహన, ప్రపంచ, దేశ రాజకీయ పరిస్ధితులు తెలిపేందుకు గాంధీనగర్‌లో రెండు రోజుల పాటు వివిధ అంశాలపై రాజకీయ తరగతులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యకర్తలు ఈతరగతులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
-
‘కనీస విద్యా ప్రమాణాలు అందేలా కృషి చేయాలి’
పెద్దపల్లి: పాలకుర్తి మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలు, పుట్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం కలెక్టర్ కోయ శ్రీహర్ష సందర్శించారు. ముందుగా ఆయన పాఠశాలలను సందర్శించి, మౌలిక సదుపాయాలను పరిశీలించి మాట్లాడారు. ప్రతీ విద్యార్థికి కనీస విద్యా ప్రమాణాలు అందేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆదేశించారు. అనంతరం పీహెచ్‌సీని సందర్శించి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు.
-
‘ప్రజలను రక్షించేందుకు ముందుండాలి’
కరీంనగర్: జిల్లా బీసీ స్టడీ సర్కిల్లో గురువారం ఆపదమిత్ర శిక్షణను ప్రారంభించారు. జిల్లాలోని 120 మంది డిగ్రీ విద్యార్థులు, ఎన్‌సీసీ వాలంటీర్లకు 12 రోజులపాటు శిక్షణను ఇవ్వనున్నారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు, దుర్ఘటన సమయంలో ప్రజలను రక్షించేందుకు ఆపద మిత్ర వాలంటీర్లు ముందుండాలని సూచించారు. సమావేశంలో పలువురు జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
-
ఘనంగా బోనాల పండుగ
పెద్దపల్లి: మంథని పట్టణంలోని మర్రివాడ వాసులు గురువారం ఆషాడ మాసం సందర్భంగా ఘనంగా బోనాల పండుగను నిర్వహించారు. ఊరేగింపుగా గ్రామస్థులు కుటుంబ సభ్యులతో బయల్దేరి గ్రామ దేవతలను దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రజలందరిని సంతోషంగా చూడాలని ప్రార్థించినట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.