Author: Shivaganesh

  • ‘అప్లై చేసుకున్న ప్రతి విద్యార్థికి సీటు ఇవ్వాలి’

    హన్మకొండ: గురుకులాల కార్యదర్శి డీఎస్ వెంకన్నను బుధవారం గిరిజన విద్యార్థి సంఘాల నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా వారు ఆయనకు వినతి పత్రం అందజేసి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాల్లో అప్లై చేసుకున్న ప్రతి విద్యార్థికి సీటు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. ప్రతివిద్యార్థికి నాణ్యమైన విద్యను అందించేలా చర్యలు చేపట్టాలని అన్నారు. కార్యక్రమంలో పలువురు విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు.

     

  • బాధ్యతలు స్వీకరించిన పవన్ కుమార్

    నిజామాబాద్: జిల్లా యువజన క్రీడల శాఖ అధికారిగా బుధవారం పవన్ కుమార్ అదనపు బాధ్యతలు స్వీకరించారు. గతంలో డీవైఏస్ఓగా ఉన్న ముత్తన్న ఇటీవల రిటైర్డ్ అయ్యారు. ఆయన స్థానంలో సీనియర్ ఫిజికల్ డైరెక్టర్‌గా ఉన్న పవన్‌కుమార్‌ను డీవైఎస్ఓ ఎఫ్ఎసీగా కలెక్టర్ నియమించారు. ఆయన జక్రాన్పల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో ఫిజికల్ డైరెక్టర్గా పని చేస్తున్నారు. ఈసందర్భంగా ఆయనను పలువురు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

     

  • ‘విద్యార్థులు పోరాటాలు చేస్తున్నా స్పందించడం లేదు’

    నిజామాబాద్: జిల్లా కేంద్రంలో బుధవారం పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి రాజేశ్వర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా రూ.7,500 కోట్లు పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్‌మెంట్, స్కాలర్షిప్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. మూడేళ్లుగా విద్యార్థులు పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. సమావేశంలో సంఘం నాయకులు పాల్గొన్నారు.

  • ప్రభుత్వ పాఠశాలలకు పుస్తకాలు పంపిణీ

    కామారెడ్డి: బాన్సువాడ మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థులకు బుధవారం ఎంఈఓ పి.నాగేశ్వరరావు అభ్యసన పుస్తకాలను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతు.. విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో మండలంలోని అన్ని ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

     

  • స్పందించి.. సమస్యను పరిష్కరించిన మంత్రి

    సిద్దిపేట: అక్కన్నపేట మండలం గౌరవెల్లి గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా రోడ్డుపై గుంతలు ఏర్పడ్డాయి. సమస్యను యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దాము, మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి తక్షణమే స్పందించి, ధరణి కాంట్రాక్టర్‌తో మాట్లాడి గుంతలను పూడ్చివేయించారు. బుధవారం స్థానిక ప్రజలు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

     

  • ఛోటాన్యూస్ ఎఫెక్ట్.. ఇసుక సీజ్

    మహబూబాబాద్: బయ్యారం మండలం, కొయ్యగూడెం గ్రామంలోని అక్రమ ఇసుక డంపులపై ఛోటా న్యూస్ కథనానికి ఎమ్మార్వో నాగరాజు స్పందించారు. బుధవారం ఎమ్మార్వో, ఆర్ఐతో తనిఖీ చేయించి, గ్రామంలో మూడు ప్రదేశాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 105 క్యూబిక్ మీటర్ల ఇసుకను సీజ్ చేయించారు. అక్రమ ఇసుక నిల్వదారులపై చర్యలు తీసుకుంటామని ఎమ్మార్వో హెచ్చరించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

  • ‘ఉద్యోగాలకు 40 ఎంపికయ్యారు’

    నిజామాబాద్: జిల్లా కేంద్రంలోని కేర్​ డిగ్రీ కళాశాలలో బుధవారం మ్యాజిక్​ బస్​ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాంగణ నియామకాలకు మంచి స్పందన వచ్చిందని కళాశాల డైరెక్టర్​ నరాల సుధాకర్​ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. కాలేజీలో నిర్వహించిన ఇంటర్వ్యూలకు సుమారు 300కు పైగా నిరుద్యోగులు హాజరయ్యారని వారిలో 40మందిని ఉద్యోగాలకు ఎంపిక అయినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

     

  • స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఘోరం.. ఒకరి మృతి

    జనగామ: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడిన ఘటన స్టేషన్‌ఘన్‌పూర్‌‌లో బుధవారం చోటుచేసుకుంది. స్టేషన్‌ఘనపూర్‌‌ జాతీయ రహదారిపై  రెండు బైకులు ఢీకొన్నాయి. ప్రమాదంలో కిందపడిన ఇద్దరు వ్యక్తులపై నుంచి ఆర్టీసీ బస్సు వెళ్లింది. ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

     

  • తిరుపతిలో పద్మావతి భజన మండలి సభ్యులు

    సిద్దిపేట: తిరుమలలోని అఖండ హరినామ స్మరణ మందిరంలో బుధవారం హుస్నాబాద్‌లోని పద్మావతి భజన మండలి సభ్యులు స్వామివారి భజనలు, కీర్తనలు నిర్వహించారు. ఈసందర్భంగా భజన మండలి సభ్యులు మాట్లాడుతూ.. తిరుమలలో హరినామ స్మరణ చేయడం తమ అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. తమ కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో భజన మండలి సభ్యులు పాల్గొన్నారు.

  • సెట్విన్ కార్పొరేషన్ భవనాన్ని సందర్శించిన మంత్రి

    సంగారెడ్డి: హైదరాబాద్‌లోని ఛార్మినార్ మోతీ గల్లీ సెట్విన్ ఇన్‌స్టిట్యూట్ శిక్షణ కేంద్రాన్ని, పురాణీ హవేలీలోని ప్రధాన కార్యాలయాన్ని బుధవారం మంత్రి శ్రీహరి, సెట్విన్ కార్పొరేషన్ ఛైర్మన్ ఎన్. గిరిధర్ రెడ్డితో కలిసి సందర్శించారు. ఈసందర్భంగా వారు కేంద్రం నిర్వాహకులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సెట్విన్ ఎండి వేణుగోపాల్ రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.