Author: Shivaganesh

  • పంటలను పరిశీలించిన వ్యవసాయ అధికారి

    ఆదిలాబాద్: తాంసీ మండలంలో కురిసిన భారీ వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను మంగళవారం మండల వ్యవసాయ అధికారి రవీందర్ పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరదలకు నష్టపోయిన పంటలను ప్రాథమిక సర్వే నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని తెలిపారు. సర్వే కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారితో పాటు మాజీ సర్పంచ్ రత్న ప్రకాష్‌, తదితరులు పాల్గొన్నారు.

     

  • రైతులకు యూరియా తిప్పలు..

    జనగామ: స్టేషన్ ఘన్‌పూర్‌ పీఏసీఎస్ ఆధ్వర్యంలో మంగళవారం రైతులకు బయోమెట్రిక్, ఓటీపీ ద్వారా యూరియా బస్తాలను అధికారులు అందజేశారు. ఈసందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ..  ఎంత భూమి ఉన్నా కేవలం రెండు బస్తాలు మాత్రమే ఇస్తున్నారని, తమకు ఏం చేయాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా కొనుగోలుకు ఆధార్, వేలిముద్రలు ఎందుకు అని రైతులు ప్రశ్నించారు.

  • ‘రైతుల అవసరాలకు అనుగుణంగా యూరియా తెప్పిస్తాం’

    మహబూబాబాద్: జిల్లాలో రైతుల అవసరాలకు అనుగుణంగా యూరియాను అందుబాటులోకి తెప్పించడానికి ప్రతిపాదనలు పంపించామని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు. ఈసందర్భంగా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని, ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలు, ఆగ్రోస్ దుకాణాలు, ప్రైవేటు షాపుల ద్వారా విక్రయాలు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

  • గమనిక అటుగా ఎవరూ రావద్దు..

    మహబూబాబాద్: బయ్యారం చెరువు మంగళవారం ప్రమాదకర స్థితిలో మత్తడి పోసింది. ఈసందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ.. మత్తడి ప్రదేశానికి పర్యాటకులు ఎవరూ రావద్దని సూచించారు. భారీ వర్షాల కారణంగా పాత ఇర్సులాపురం గ్రామానికి చెందిన తాటి సత్యవతి అనే మహిళ తన ఇంటిని కోల్పోయింది. ప్రభుత్వం స్పందించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కన్నీటిపర్యంతం అయ్యారు.

  • సింగరేణిలో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి..

    జయశంకర్ భూపాలపల్లి: సింగరేణి ఏరియాలో కురుస్తున్న భారీవర్షాల కారణంగా ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులోని 2, 3వ గనుల్లో మంగళవారం బొగ్గుఉత్పత్తి, మట్టి వెలికితీత పనులు నిలిచిపోయాయి. అధికారులు మాట్లాడుతూ.. సుమారు 4 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడంతో సంస్థకు రోజుకు రూ. 2 కోట్ల మేర నష్టం వాటిల్లిందని తెలిపారు. వరద నీరు చేరడం, పని స్థలాలు బురదమయం కావడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి.

  • కలెక్టర్‌కు రైతుల ఫిర్యాదు..

    వరంగల్: రాయపర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సత్య శారద, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ మంగళవారం పరిశీలించారు. ఈసందర్భంగా పలువురు రైతులు పీఏసీఎస్ కేంద్రాల వద్ద తమకు సరిపడా యూరియా లభించడం లేదని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఫర్టిలైజర్ షాపులలో యూరియాతో పాటు ఇతర ఎరువులను లింకు పెట్టి అమ్ముతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

  • నులిపురుగు నివారణ దినోత్సవం..

    మెదక్: కౌడిపల్లి మండలంలోని మహాత్మ జ్యోతిబాఫులే ప్రభుత్వ పాఠశాలలో నులిపురుగు నివారణ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి హాజరయ్యారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు వ్యక్తిగత శుభ్రతను పాటించాలని, తప్పకుండా ప్రతిఒక్కరూ నులిపురుగుల నివారణ మందులు వేసుకోవాలన్నారు. అనంతరం వారికి ఆల్ఫెండ జోల్ మాత్రలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

  • కాగజ్ మద్దూర్‌లో అత్యధిక వర్షపాతం..

    మెదక్: జిల్లా వ్యాప్తంగా ఉదయం 8:00 వరకు కురిసిన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అత్యధికంగా కాగజ్ మద్దూర్ 62.8 మి.మీ, దామరంచ 59.3 మి.మీ, మిన్పూర్ 46 మి.మీ, నర్సాపూర్ 503.3 మి.మీ, నాసాయిపేట 50 మి.మీ, వెల్దుర్తి 46 మి.మీ, సోంపేట 43.5 మి.మీ, నర్లాపూర్ 43.3 మి.మీ, కొల్చారం 41 మి.మీ, చెప్పులుదూతి 40.8 మి.మీ.. తదితర ప్రాంతాల్లో కురిసింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

  • వరదల్లో చిక్కుకున్న నలుగురు సురక్షితం..

    ములుగు: వరదల్లో చిక్కుకున్న నలుగురు వ్యక్తులను కాపాడిన ఘటన తాడ్వాయి మండలం కాల్వపల్లిలో వెలుగుచూసింది. పశువుల కాపరి దుబారీ రామయ్య, చేపలు పట్టడానికి వెళ్లిన పి.సాయికిరణ్, రాజబాబు, రాములు వరదల్లో చిక్కుకున్నారు. బాధిత కుటుంబ సభ్యుల సమాచారంతో ఎన్డీఆర్ఎఫ్ బృందం అర్ధరాత్రి గాలింపు చర్యలు చేపట్టింది. మంగళవారం ఉదయం సురక్షితంగా వారిని ఒడ్డుకు చేర్చారు.

  • యూరియా కోసం రైతుల ధర్నా..

    మహబూబాబాద్: నర్సింహులపేట మండల కేంద్రంలో మంగళవారం రైతులు యూరియా బస్తాల కోసం ధర్నా చేశారు. ఈసందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ..  తెల్లవారుజాము నుంచే యూరియా కోసం ఎదురు చూస్తున్న లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు సరిపడా యూరియా సరఫరా చేయకడం లేదని వాపోయారు. వ్యవసాయ అధికారులు సర్దిచెప్పడంతో రైతులు ధర్నాను విరమించారు.