సిద్దిపేట: కోహెడ మండలం నాగసముద్రాల మోడల్ స్కూల్, కాలేజీ విద్యార్థులకు బుధవారం పోలీసు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో హుస్నాబాద్ ఏసీపీ ఎస్.సదానందం పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థి దశ చాలా కీలకమని సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నతంగా ఎదగాలని అన్నారు. సైబర్ నేరాలు, అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని అన్నారు. కార్యక్రమంలో కోహెడ ఎస్ఐ అభిలాష్, తదితరులు పాల్గొన్నారు.
Author: Shivaganesh
-
‘ఆయన సేవలు పోలీస్ శాఖకు మంచి పేరు తెచ్చాయి’
కామారెడ్డి: జిల్లా పోలీసు కార్యాలయంలో ఏఆర్ డీఎస్పీ యాకూబ్ రెడ్డికి బుధవారం ఆత్మీయ వీడ్కోలు పలికారు. హైదరాబాద్ కమిషనరేట్‌కు బదిలీపై వెళ్తున్న ఆయనకు అదనపు ఎస్పీ కె. నరసింహ రెడ్డి సన్మానించారు. ఈసందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ.. యాకూబ్‌రెడ్డి విధి నిర్వాహణలో చూపిన శ్రద్ధ, నిబద్ధత, అంకితభావం పోలీస్ శాఖకు మంచి పేరు తెచ్చాయని అన్నారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
-
మేడిగడ్డకు పెరిగిన వరద ప్రవాహం
జయశంకర్ భూపాలపల్లి: మహదేవపూర్ మండలం అంబట్‌పల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ(లక్ష్మీ) బరాజ్‌కు వరద ప్రవాహం పెరుగుతోందని బుధవారం అధికారులు తెలిపారు. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా మంగళవారం ఇన్‌ఫ్లో 12,500 క్యూసెక్కులు రాగా, బుధవారం ఇన్ ఫ్లో 19,200 క్యూసెక్కులకు పెరిగిందన్నారు. దీంతో మొత్తం 85 గేట్లను ఎత్తి అంతే మొత్తంలో వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.
-
‘ప్రజల నుంచి సీతక్కను దూరం చేయలేరు’
మహబూబాబాద్: కొత్తగూడ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద బుధవారం పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. ఈనెల 1న మంత్రి సీతక్కపై నమస్తే తెలంగాణ పత్రికలో ప్రచురించిన వార్తను ఖండించారు. నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్న సీతక్కను వారి నుంచి ఎవరు దూరం చేయలేరని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
-
‘మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి’
కామారెడ్డి: నస్రుల్లాబాద్ గ్రామపంచాయతీ పరిధిలో బుధవారం వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎంపీడీవో సూర్యకాంత్ పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వన మహోత్సవంలో భాగంగా నాటిన మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్లు, పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
-
యూరియా టోకెన్లకు పోలీసుల పహారా!
కామారెడ్డి: పోలీసుల పహారా మధ్య వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు యూరియా టోకెన్లు అందజేసిన ఘటన ఆర్మూర్ పట్టణంలో వెలుగుచూసింది. వ్యవసాయ సొసైటీ కార్యాలయంలో మంగళవారం రైతులు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. దీంతో బుధవారం వ్యవసాయ శాఖ అధికారులు సొసైటీ కార్యాలయం ముందు పోలీసుల బందోబస్తు మధ్య రైతులకు యూరియా టోకెన్లు అందజేశారు.
-
‘గుడుంబాను నిర్మూలించాలి’
మహబూబాబాద్: గుడుంబా స్థావరాలపై బుధవారం మహిళలు దాడి చేసి, సామగ్రిని ధ్వంసం చేసిన ఘటన గంగారం మండలం దుబ్బగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని మామిడిగూడెంలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన పొలబోయిన సుధాకర్ అనే వ్యక్తి గుడంబాకు బానిసై ఇటీవల మృతి చెందారు. ఈక్రమంలో గ్రామ మహిళలు అందరూ బుధవారం గుడంబా స్థావరాలపై దాడి చేసి ధ్వసం చేశారు. గుడుంబాను నిర్మూలించాలని అధికారులను కోరారు.
-
ప్రెస్ క్లబ్ సభ్యులకు ప్రమాద బీమా
కామారెడ్డి: బాన్సువాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడుగా రెండోసారి ఎన్నికైన సుధాకర్ గౌడ్ బుధవారం 71 మంది సభ్యులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోస్ట్ ఆఫీస్ ద్వారా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ సౌజన్యంతో ఒక్కొక్కరికి రూ. 559 ప్రీమియంతో రూ. 10 లక్షల వరకు ప్రమాద బీమా చేయించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గంటా చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.
-
బోనాల అనంతరం వీరన్న కళ్యాణం..
వరంగల్: కరీమాబాద్‌లోని శ్రీబీరన్న స్వామి దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు కోరే కృష్ణ మాట్లాడుతూ.. ఈనెల 6న తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని కరీమాబాదులో కురుమ కులస్తులు బోనాల పండుగ నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం వీరన్న కళ్యాణం ఉంటుందన్నారు. సమావేశంలో ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
-
రేపటి నుంచి కాలేజీలు బంద్
సిద్దిపేట: ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.వి.శ్రీకాంత్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 2, 3, 4 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ప్రొఫెషనల్ కాలేజీల బంద్‌కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గ్యార గణేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.