Author: Shivaganesh

  • ‘కనిపించే దేవుళ్లు వైద్యులు’

    భద్రాద్రి కొత్తగూడెం: మణుగూరు మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా లైన్స్ క్లబ్, వాసవి క్లబ్ సభ్యులు వైద్యులను శాలువాతో సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కనిపించే దేవుళ్లు వైద్యులు అని కొనియాడారు. కార్యక్రమంలో డాక్టర్లు నిశాంత్ రావు, సునీల్, పావని, వాసవి, లయన్స్ క్లబ్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

  • మాంటిస్సోరి పాఠశాల పుస్తకాల గది సీజ్

    సిద్దిపేట: నిబంధనలకు విరుద్ధంగా పాఠ్య, నోటు పుస్తకాలు, యూనిఫామ్ విక్రయిస్తున్న హుస్నాబాద్‌లోని మాంటిస్సోరి పాఠశాల పుస్తకాల గదిని విద్యాశాఖాధికారులు సీజ్ చేశారు. మంగళవారం ఏబీవీపీ హుస్నాబాద్ సంఘం నాయకుల ఫిర్యాదుతో విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని సంఘం నగర కార్యదర్శి చరణ్  డిమాండ్ చేశారు. తనిఖీలో ఏబీవీపీ కార్యకర్తలు, ఎంఆర్‌సీ సిబ్బంది పాల్గొన్నారు.

  • వసంతకు జాతీయ గజల్ పురస్కారం

    సిద్దిపేట: హుస్నాబాద్‌కు చెందిన ప్రముఖ రచయిత్రి ఇంజపురి వసంతకు మంగళవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జాతీయ గజల్ పురస్కారం ప్రదానం చేశారు.  విశ్వ పుత్రిక గజల్ ఫౌండేషన్ నాల్గవ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమెకు జాతీయ గజల్ పురస్కారం ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఫౌండేషన్ ఛైర్మన్ విజయలక్ష్మి పండిట్, కార్యదర్శి కళారత్న బిక్కి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

  • ‘ప్రభుత్వం అన్ని విభాగాల్లో ఫెయిల్ అయ్యింది’

    ఖమ్మం: ముదిగొండ‌ మండల కేంద్రం, న్యూలక్ష్మీపురం, గంధసిరి, పెద్దమండమ గ్రామాల్లో మంగళవారం మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావులతో కలిసి జడ్పీ మాజీ ఛైర్మన్ లింగాల కమల్‌రాజు పర్యటించారు. అనంతరం పలువురు బీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు. ఈసందర్భంగా కమల్‌రాజు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విభాగాల్లో ఫెయిల్ అయ్యిందని విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

  • ‘లక్ష్యాల సాధన కోసం పని చేస్తాం’

    భద్రాద్రి కొత్తగూడెం: ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంగళవారం కొత్తగూడెం పట్టణంలోని బస్టాండ్ సెంటర్‌లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుగు రాజేష్ నాయక్ పాల్గొని జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. మారోజు వీరన్న, ఠానూనాయక్‌ల‌ ఆశయాలు, లక్ష్యాల సాధన కోసం పని చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు పాల్గొన్నారు.

     

  • ‘ఈనెల 13 వరకు దరఖాస్తు చేసుకోవాలి’

    సంగారెడ్డి: జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారం కోసం దరఖాస్తులను నమోదు చేసుకోవాలని మంగళవారం జిల్లా విద్యాశాఖాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఆన్‌లైన్ ద్వారా http://nationalawardstoteachers.education.gov.in అనే వెబ్ సైట్‌లో ఈనెల 13 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అప్లికేషన్ ప్రింట్, సంబంధిత పత్రాలను జతపరచి జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సమర్పించాలన్నారు.

  • ‘నాలుగు లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలి’

    భద్రాద్రి కొత్తగూడెం: మణుగూరు మండలంలో ఈనెల 9న జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని టీయూసీఐ జిల్లా అధ్యక్షులు ఆర్.మధుసూదన్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన మండల కేంద్రంలో సమ్మె పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఓబీ కార్మికులు, పాల్గొన్నారు.

  • ‘భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలి’

    సంగారెడ్డి: మాదారం గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం పటాన్‌చెరు నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ పార్టీ ముఖ్య నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 4న ఎల్బీ స్టేడియంలో జరగనున్న భారీ బహిరంగ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరుకానున్న నేపథ్యంలో, సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

  • ‘అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సంతోషంగా ఉండాలి’

    సంగారెడ్డి: జిన్నారం మండలం వావిలాల గ్రామంలో మంగళవారం రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవాన్ని గ్రామస్థులు వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ హాజరై అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..  అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.

  • ‘కార్మికుల భద్రతపై ప్రభుత్వం చొరవ తీసుకోవాలి’

    సంగారెడ్డి: పాశమైలారం సిగాచి పరిశ్రమ ఘటనలో‌ గాయపడిన క్షతగాత్రులను మంగళవారం పటాన్‌చెరు ధ్రువ ఆస్పత్రిలో ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు‌. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పరిశ్రమలో జరిగిన ప్రమాదం దురదృష్టకరమన్నారు. కార్మికుల భద్రతపై ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. క్షతగాత్రుల కుటుంబ సభ్యులను ఓదార్చి దైర్యం‌ చెప్పారు.