Author: Shivaganesh

  • ‘కార్మికుడి కుటుంబానికి న్యాయం చేయాలి’

    సంగారెడ్డి: జహీరాబాద్ పరిధిలోని ముంగి ఇంజినీరింగ్ పరిశ్రమలో పని చేస్తున్న ఓ కార్మికుడి చెయ్యికి తీవ్రంగా గాయాలయ్యాయి. విషయం తెలుసుకొని మంగళవారం సీఐటీయూ జహీరాబాద్ పారిశ్రామిక క్లస్టర్ కన్వీనర్ ఎస్.మహిపాల్ ఆస్పత్రికి వెళ్లి బాధితుడిని పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కార్మికుడి కుటుంబానికి న్యాయం చేయాలని, వైద్య ఖర్చులు పూర్తిగా యాజమాన్యమే భరించాలన్నారు. బాధిత కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవాలని డిమాండ్ చేశారు.

  • స్వగ్రామాలకు తరలించిన మృతదేహాలు

    సంగారెడ్డి: పాశమైలారం ఘటనలో మృతి చెందిన వారిలో 12 మృతదేహాలను బంధువుల సహాయంతో గుర్తించి మంగళవారం అంబులెన్స్‌లో వారి స్వగ్రామాలకు తరలించారు. తరలించిన మృతదేహాల వివరాలను అధికారులు వెల్లడించారు. ఒడిశాకు చెందిన జగన్ మోహన్, మనోజ్ కుమార్, దురై,  శ్రీరమ్య – నూజివీడు, నాగేశ్వర్‌రావు- మంచిర్యాల, రుక్సానా కుతుం, రాంసింగ్ – ఇస్నాపూర్, నిఖిల్ కుమార్ రెడ్డి- కడపకు తరలించారు.

  • ‘ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి’

    ఖమ్మం: నెలకొండపల్లి మండలం ఆరెగూడెం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వినియోగం కారణంగా జరిగే అనర్థాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఎమ్మార్వో వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడారు. ప్రజలు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని సూచించారు. మట్టి వస్తువులను వినియోగించాలని, ప్లాస్టిక్ నిషేధించేలా విద్యార్థులు విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

  • ‘సమ్మెను జయపద్రం చేయాలి’

    సిద్దిపేట: దౌల్తాబాద్ మండల కేంద్రంలో మంగళవారం సీఐటీయూ జిల్లా కోశాధికారి జి.భాస్కర్ సమ్మె కరపత్రాలను విడుదల చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..  కార్మికులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని ఈనెల 9న దేశవ్యాప్త సమ్మె నిర్వహించనున్నట్లు తెలిపారు. మండలంలోని అన్ని రంగాల కార్మికులు పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం నాయకులు పాల్గొన్నారు.

     

  • పట్టింపు లేక పనికి రావడం లేదు..

    భద్రాద్రి కొత్తగూడెం: అశ్వారావుపేట మండలం పాతరెడ్డిగూడెంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్లు నిర్వహణ లేక మూలనపడ్డాయని స్థానికులు వాపోయారు. మంగళవారం పలువురు స్థానికులు మాట్లాడుతూ.. సురక్షితమైన తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్‌పై అధికారుల పట్టింపు లేక పనికి రావడం లేదన్నారు. మరమ్మతులు చేపించి వినియోగంలోకి తీసుకురావలన్నారు.

  • ‘నిరంతరం వైద్య సేవలు అందిస్తాం’

    సిద్దిపేట: డాక్టర్స్ డే సందర్భంగా మంగళవారం హుస్నాబాద్ డాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానికంగా ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో వివిధ విభాగాల వైద్యులు పాల్గొని రోగులకు పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు అందజేశారు. ఈసందర్భంగా అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ అక్కు శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రజలకు నిరంతరం వైద్య సేవలు అందిస్తామని, ప్రతి సంవత్సరం ఇలాంటి శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు.

  • ‘అభివృద్ధి కోసం కృషి చేస్తా’

    మెదక్: రామాయంపేటలో మంగళవారం ఎమ్మెల్యే రోహిత్ రావు పర్యటించారు. ఈసందర్భంగా ఆయన మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. అర్హులందరికి ప్రభుత్వ ఫలాలు అందుతాయన్నారు. కార్యక్రమంలో స్థానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

     

  • ‘డ్రగ్స్‌కు బానిస కావద్దు’

    సిద్దిపేట: పాలమాకుల జిల్లా పరిషత్ హైస్కూల్‌లో మంగళవారం షీ టీం బృందం ఆధ్వర్యంలో విద్యార్థులకు మహిళా భద్రతా చట్టాలు, షీటీం విధులు, వంటి అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రాజగోపాలపేట ఎస్సై ఆసిఫ్ పాల్గొని మాట్లాడుతూ.. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, డ్రగ్స్‌కు బానిస కావొద్దని సూచించారు. చదువుపై దృష్టి సారించి ఉజ్వల భవిష్యత్తును ఏర్పరచుకోవాలని అన్నారు.

  • ‘ప్రమాదంపై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలి’

    భద్రాద్రి కొత్తగూడెం: ఇల్లెందు ఐఎఫ్‌టీయూ కార్యాలయంలో మంగళవారం సంఘం నాయకులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. అనంతరం సంఘం జిల్లా అధ్యక్షుడు కొక్కు సారంగపాణి మాట్లాడుతూ.. పాశం మైలారంలోని సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంపై సమగ్ర న్యాయవిచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంబంధిత ఫ్యాక్టరీ యాజమాన్యంపై కేసులు నమోదు చేయాలని, మరణించిన వారికి రూ.కోటి చొప్పున నష్ట పరిహారం చెల్లించాలన్నారు.

  • ‘కనిపించే ప్రత్యక్ష దేవుళ్లు వైద్యులు’

    సంగారెడ్డి: పటాన్‌చెరు మండలం ఇంద్రేశం పరిధిలోని నెక్స్ జెన్ బ్రూక్ ఇంటర్నేషనల్ స్కూల్లో మంగళవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈసందర్భంగా పాఠశాల వైస్ ఛైర్మన్ నందారం భరత్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రపంచ వైద్యుల దినోత్సవం పురస్కరించుకొని మయూరి హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. కనిపించే ప్రత్యక్ష దేవుళ్లు వైద్యులు అని కొనియాడారు.