సంగారెడ్డి: సదాశివపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బంగ్లా భారతి మాట్లాడుతూ.. మెడికల్ ప్లాంటేషన్ గొప్పదనం వివరించారు. కాలేజీ ఆధ్వర్యంలో వన మహోత్సవం ఏడు రోజుల పాటు ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల నేతృత్వంలో జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Author: Shivaganesh
-
తొగుటలో రైతులకు కంది పంట కిట్ల పంపిణీ
సిద్దిపేట: తొగుట రైతు వేదికలో మంగళవారం రైతులకు కంది పంట రాయితీ మినీ కిట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆత్మ కమిటీ ఛైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డి, సహాయ వ్యవసాయ సంచాలకులు మల్లయ్య పాల్గొని మినీ కిట్లు అందజేశారు. ఈసందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కంది పంట పెంచడంతో ధరలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. కార్యక్రమంలో రైతులు, తదితరులు పాల్గొన్నారు.
-
జిల్లాలో భారీ వర్షాలు..
భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో మూడురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఐఎండీ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. మంగళవారం జిల్లాలో పలు చోట్ల వర్షాలు పడే సూచనలున్నాయని చెప్పింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏమైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే అధికారులను సంప్రదించాలని జిల్లా యంత్రాంగం సూచించింది.
-
ఇందిరమ్మ ఇంటికి ఎమ్మెల్యే భూమి పూజ
భద్రాద్రి కొత్తగూడెం: ఇల్లెందు మండలం పోలారం తండాలో దివ్యాంగులైన ఇస్లావత్ రాజేశ్వరి దంపతుల ఇందిరమ్మ ఇంటి భూమి పూజ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొని భూమి పూజ చేశారు. ఈసందర్భంగా రాజేశ్వరి దంపతులు మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇల్లు కేటాయించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
-
తాత్కాలిక సాయం అందజేసిన కలెక్టర్
సంగారెడ్డి: పటాన్‌చెరు ప్రభుత్వాస్పత్రిలో మంగళవారం పాశమైలారం ఘటనలో మృతి చెందిన 11 మంది కుటుంబసభ్యులకు కలెక్టర్ ప్రావీణ్య రూ.లక్ష చెక్కును అందజేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశానుసారం మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు తాత్కాలికంగా రూ.లక్ష అందజేస్తున్నట్లు తెలిపారు. గుర్తించిన 11 మృతదేహాలను అంబులెన్స్‌ల ద్వారా స్వగ్రామాలకు తరలించారు.
-
‘సోలార్ వినియోగంపై దృష్టి సారించాలి’
భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని మంగళవారం ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన ఇంజినీరింగ్ సెక్షన్‌లో రికార్డులను పరిశీలించి, పలు అంశాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సోలార్ విద్యుత్తు వినియోగంపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. సోలార్ విద్యుత్ వినియోగంతో మున్సిపల్ కార్పొరేషన్ విద్యుత్తు సంస్థకు చెల్లించే బిల్లు నుంచి భారం తగ్గుతుందన్నారు.
-
‘దంతాల శుభ్రతతో రోగాలను నివారించవచ్చు’
సిద్దిపేట: జిల్లా కేంద్రంలోని గౌతమ్ మోడల్ స్కూల్‌లో మంగళవారం వైద్యుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ డెంటల్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ అరవింద్ పాల్గొని విద్యార్థులు, తల్లిదండ్రులకు దంత పరీక్షలు చేసి, నోటి పరిశుభ్రత ఆవశ్యకతను వివరించారు. దంతాలను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా అనేక రోగాలను నివారించవచ్చని అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
-
ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాట్లను పరిశీలించిన వీసీ
సిద్దిపేట: హుస్నాబాద్ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రారంభం కానున్న శాతవాహన యూనివర్సిటీ క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాట్లను మంగళవారం యూనివర్సిటీ వీసీ ఉమేష్ కుమార్ పరిశీలించారు. ఈసందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ విద్యా సంవత్సరంలోనే 4 కోర్సులకు 60 సీట్ల చొప్పున మొత్తం 240 సీట్లతో తాత్కాలికంగా కళాశాల ప్రారంభం అవుతుందని తెలిపారు. విద్యార్థులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
-
సీపీఆర్‌పై విద్యార్థులకు అవగాహన
సంగారెడ్డి: నారాయణఖేడ్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా డాక్టర్ హరీశ్ తోట పాల్గొని సీపీఆర్‌పై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రమాదాల బారిన పడిన వారిని అత్యవసర సమయాల్లో ఎలా కాపాడాలో విద్యార్థులకు వివరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఉమా మహేశ్, తదితరులు పాల్గొన్నారు.
-
విద్యుదాఘాతంతో ఒకరి మృతి
మెదక్: విద్యుదాఘాతంతో ఒకరు మృతి చెందిన ఘటన మంగళవారం నార్సింగి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వంజరి నర్సింలు (32) అనే వ్యక్తి నార్సింగి శివారులోని జాతీయ రహదారి 44 సమీపంలోని వ్యవసాయ పొలం వద్ద విద్యుత్తు మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.