Author: Shivaganesh

  • నిండు బిందెలతో పాదయాత్ర..

    సంగారెడ్డి:  నారాయణఖేడ్ మండలం అనంతసాగర్ గ్రామ ప్రజలు మంగళవారం పాదయాత్ర నిర్వహించారు. ప్రతి ఏడాదిలాగే 11 గ్రామాల ప్రజలు 11 నిండు బిందెలతో పాదయాత్ర చేశారు. ప్రతి గ్రామంలోని హనుమాన్ ఆలయానికి వెళ్లి స్వామి విగ్రహాలకి అభిషేకం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. వర్షాలు సమృద్ధిగా కురవాలని, మంచి పంటలు పండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.

  • వర్షం అంతరాయం… నిలిచిన బొగ్గు ఉత్పత్తి

    ఖమ్మం: రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి సత్తుపల్లిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. జేవీఆర్ ఓసీలో 30 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి, లక్ష 20 వేలక్యూటిక్ మీటర్ల మట్టి తొలిగించే పనులకు, కిష్టారం ఓసీలో 8 వేలటన్నుల బొగ్గు ఉత్పత్తికి, 65 వేలక్యూబిక్ మీటర్ల మట్టి తొలిగింపు పనులు నిలిచినట్లు వెల్లడించారు. గనుల్లో నిలిచిన నీటిని బోర్ల సాయంతో బయటికి పంపుతున్నట్లు పేర్కొన్నారు.

  • ‘మాజీ సీఎం ప్రకటన హాస్యాస్పదం’

    పశ్చిమగోదావరి: జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాండ్రు సందీప్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. వైసిపి పాలనలో విద్యారంగం నాశనమైందని అన్నారు. ఈసెట్ కౌన్సిలింగ్ పై మాజీ సీఎం జగన్ ఎక్స్ ప్రకటన హాస్యాస్పదమని తెలిపారు. ఈ సెట్ కౌన్సిలింగ్ ఎప్పుడు నిర్వహించారో జగన్మోహన్ రెడ్డికి తెలియదా అని ప్రశ్నించారు.

  • బాధిత కుటుంబాలకు నిత్యావసరాలు అందజేత

    పశ్చిమగోదావరి: ఉండి మండలం మహదేవ పట్టణానికి చెందిన కుడిపూడి పద్మావతి, లంక అమ్మాజీలు షార్ట్ సర్క్యూట్ కారణంగా సర్వం కోల్పోయారు. విషయం తెలుసుకొని సోమవారం వారికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ బ్రాంచ్ భీమవరం ఆధ్వర్యంలో దుప్పట్లు, ఇతర నిత్యావసర సామగ్రి అందించారు. కార్యక్రమంలో సర్పంచ్ వనిమ సుబ్బలక్ష్మి శ్రీనివాస్, నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌ఛార్జి నాగరాజు పాల్గొన్నారు.

  • భారీ వర్షం.. తప్పని ట్రాఫిక్ తిప్పలు

    మెదక్: నరసాపురం మండలం వ్యాప్తంగా సోమవారం ఎదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. సంగారెడ్డి ప్రధాన రహదారిపై వర్షం కారణంగా భారీ వృక్షం రోడ్డుకు అడ్డంగా పడింది. దీంతో వాహనాలు ఎక్కడకక్కడ నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. అకాల వర్షంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు.

  • ‘అక్రమాలకు తావు లేదు’

    మంచిర్యాల: కోటపల్లి మండలం పారుపల్లిచింత వద్ద టీజీఎండీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇసుక క్వారీ చెక్ పోస్ట్‌ను సోమవారం పోలీస్, మైనింగ్, రెవెన్యూ శాఖ అధికారులు పరిశీలించారు. ఈసందర్భంగా పలువురు ఏసీపీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఇసుక రవాణాలో ఎలాంటి అక్రమాలకు తావులేదని స్పష్టం చేశారు. 24 గంటలు సీసీ కెమెరా పర్యవేక్షణలో పోలీసు, రెవెన్యూ, మైనింగ్ అధికారులు విధులు నిర్వహిస్తున్నారని వెల్లడించారు.

  • ప్రత్యేక పూజలు చేసిన ప్రీతినిగం దంపతులు

    మెదక్: నర్సాపూర్ కేంద్రంలోని శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి మందిరాన్ని సోమవారం బుల్లితెర నటి ప్రీతి నిగం దంపతులు దర్శించుకున్నారు. ఈసందర్భంగా వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారికి ఆలయ అర్చకులు అమ్మవారి ఆశీర్వాదాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు.

  • భూమి పూజ చేసిన ఆత్మ కమిటీ ఛైర్మన్

    సంగారెడ్డి: గుమ్మడిదల మండలం కొత్తపల్లి గ్రామంలో సోమవారం ఆత్మ కమిటీ ఛైర్మన్ కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమన్నారు. కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు, గ్రామ కార్యదర్శి సంతోషి, లబ్ధిదారులు పాల్గొన్నారు.

  • గీతకార్మికులకు శిక్షణా కార్యక్రమం

    సిద్దిపేట: అక్కన్నపేట మండలం జనగాం, అంతకపేట పరిసర గ్రామాలకు చెందిన 80 మంది గీతకార్మికులకు సోమవారం సేఫ్టీ మోకుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.  తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం, బీసీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు, బీసీ వెల్ఫేర్ అధికారి మల్లేశం పాల్గొన్నారు. వర్షాకాల ప్రమాదాల నివారణకు మోకులను ఎలా వాడాలో వారు వివరించారు.

  • కేంద్ర మంత్రికి మాజీ ఎంపీ వినతి

    ఆదిలాబాద్: కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జుయల్ ఓరంను సోమవారం మాజీ ఎంపీ సోయం బాపూరావు మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. ఆదివాసులను అడవుల నుంచి దూరం చేసే జీవో49ని రద్దుచేసి, పోడు భూముల్లో మొక్కలు నాటడం ఆపాలని కేంద్ర మంత్రిని కోరినట్లు తెలిపారు. టైగర్ కన్జర్వేషన్ పేరుతో గిరిజనులను ఇబ్బంది పెట్టకుండా, కాపాడాలని విజ్ఞప్తి చేశామన్నారు.