Author: Shivaganesh

  • ఐదేళ్ల జైలు శిక్ష.. రూ.25 వేలు జరిమానా

    సంగారెడ్డి: జహీరాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 2019లో 10 కిలోల ఎండు గంజాయి తరలిస్తూ పట్టుబడిన ఇద్దరు నిందితులకు సోమవారం సంగారెడ్డి మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 25 వేలు జరిమానా విధించారు. కేసు విచారణలో పూర్వాపరాలను పరిశీలించి పై విధంగా తీర్పు వెలువరించినట్లు జహీరాబాద్ ప్రోహిబిషన్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ టి. శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.

  • వృద్ధుడు మిస్సింగ్.. కేసు నమోదు

    మెదక్: ఇంటి నుంచి బయటకు వెళ్లిన వృద్ధుడు కనిపించకుండా పోయిన ఘటన సోమవారం నర్సాపూర్‌లో చోటుచేసుకుంది. జగన్నాథరావు కాలనీకి చెందిన ఎర్రోళ్ల మల్లయ్య (75) అనే వృద్ధుడు ఈనెల 27వ తేదీ రాత్రి కుటుంబ సభ్యులతో భోజనం చేసి బయటకు వెళ్లారు. తిరిగి రాలేదు, ఎక్కడ వెతికిన ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  • చోరీ కేసు ఛేదించిన పోలీసులు

    ఆదిలాబాద్: చోరీ కేసును ఛేదించినట్లు సోమవారం పోలీసులు తెలిపారు. ఆదిలాబాద్ టూటౌన్ సీఐ సీహెచ్ కరుణాకర్‌రావు మాట్లాడుతూ.. గంజాయికి అలవాటు పడిన మహ్మద్ మొయిజ్, షేక్ సమీర్, షేక్ అబ్దుల్ ఫయాజ్ రిమ్స్‌ సమీపంలోని మెడికల్ షాపుల్లో నాలుగు మత్తు ఇంజెక్షన్లు, ఒక చరవాణి, పక్కనే ఉన్న కిరాణా దుకాణంలోనూ చోరీ చేశారు.  వారిని గుర్తించి అరెస్ట్ చేశామన్నారు.

     

  • సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

    మెదక్: ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే సునితా లక్ష్మారెడ్డి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. కుల్చారం మండలం వరిగొంతం గ్రామానికి చెందిన పాత్లోత్ అరుణ రూ.13 వేలు, చిన్న ఘనపూర్ గ్రామానికి చెందిన దూదేకుల మౌలానీకి రూ.12,500 సీఎం సహాయనిధి నుంచి మంజూరు అయ్యాయి. ఎమ్మెల్యే బాధిత కుటుంబాలకు ఎల్ఓసీలను అందజేశారు.

     

  • ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ

    నిర్మల్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆర్జీదారుల నుంచి ఎస్పీ జానకి షర్మిల ఫిర్యాదులు స్వీకరించారు. ఈసందర్భంగా ఆమె సకాలంలో ఫిర్యాదులు పరిశీలించి వాటిని పరిష్కరించాలని సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులకు ఫోన్ల ద్వారా ఆదేశించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, బాధితులు పాల్గొన్నారు.

  • ఎంపీడీఓ కార్యాలయం ముందు ఎమ్మెల్యే ధర్నా

    మెదక్: కౌడిపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ముందు సోమవారం ఎమ్మెల్యే సునితారెడ్డి, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ధర్నా నిర్వహించారు. అనంతరం ఎంపీడీఓకి మెమొరాండం అందజేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మండలంలోని ప్రతీ గ్రామంలో గ్రామపంచాయతీ పారిశుద్ధ్యానికి సంబంధించిన శానిటైజర్ నిధులు, పంచాయతీ సిబ్బందికి వేతనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.

  • పాశమైలారం ఘటనపై ఎంపీ దిగ్భ్రాంతి

    సంగారెడ్డి: పటాన్ చెరు మండలం పాశమైలారంలో సిగాచి కెమికల్ కంపెనీలో సోమవారం జరిగిన అగ్నిప్రమాద దుర్ఘటనపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన కాలికి శస్త్ర చికిత్స జరిగి ఆసుపత్రిలో ఉన్న కారణంగా ఘటనా స్థలానికి వెళ్లలేకపోయినట్లు వెల్లడించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వంతో మాట్లాడి నష్టపరిహారం అందజేసే విధంగా చూస్తానని అన్నారు.

  • సీఐని సన్మానించిన కమిటీ సభ్యులు

    సంగారెడ్డి: సదాశివపేట పట్టణ సీఐగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వెంకటేష్‌ను సోమవారం సదాశివపేట సామూహిక ఉత్సవ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా వారు సీఐని శాలువాతో సన్మానించారు. అనంతరం వారు పట్టణంలోని సామూహిక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి సీఐకి వివరించారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

  • చండి హోమంలో పాల్గొన ఎంపీ

    సంగారెడ్డి: న్యాలకల్ మండలం ముంగి గ్రామంలోని ఆదిలక్ష్మి ఆశ్రమంలో సోమవారం శ్రీ వారాహి దేవి నవరాత్రి చండి హోమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎంపీ సురేష్ షెట్కర్, జహీరాబాద్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి చంద్రశేఖర్ పాల్గొని ప్రత్యేక పూజలో చేశారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

  • ఆందోళన చేసిన తండా వాసులు

    సిద్దిపేట: అక్కన్నపేట మండలం పంతులు తండా పరిధిలోని తారాచంద్ తండా ప్రజలు సోమవారం ఆందోళన చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. నీళ్లు లేక గోస పడుతున్నామని వాపోయారు. మండల బిజేపి గిరిజన మోర్చా అధ్యక్షుడు రైనా నాయక్ మాట్లాడుతూ.. వెంటనే సంబధిత అధికారులు స్పందించి నీటి సౌకర్యం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో తండా వాసులు పాల్గొన్నారు.