Author: Shivaganesh

  • రాజయ్యను సన్మానించిన ఎస్పీ

    కొమురం భీమ్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఎస్సై దుర్గం రాజయ్య పదవి విరమణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్పీ కాంతిలాల్ పాటిల్ పాల్గొని ఆయనను సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాజయ్య తన సర్వీస్ మొత్తంలో ఎలాంటి రిమార్కు లేకుండా సబ్ ఇన్‌స్పెక్టర్ స్థాయికి చేరుకున్నారని అన్నారు. కార్యక్రమంలో జిల్లా పోలీస్ సంఘం అధ్యక్షులు విజయ శంకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

     

  • ‘వారు పోలీసు శాఖలో అంతర్గత భాగం’

    కొమురం భీమ్: జిల్లాలో హోం గార్డుల సంక్షేమానికి డీజీపీ కార్యాలయం నుంచి వచ్చిన ఉలెన్ జాకెట్లు, రెయిన్‌కోట్‌లను సోమవారం ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హోం గార్డులు పోలీసు శాఖలో అంతర్గత భాగమని అన్నారు. వారు క్లిష్ట పరిస్థితుల్లోనూ సమర్థంగా విధులు నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. ఏమైనా సమస్యలు ఉంటే తనను సంప్రదించాలని, క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని సూచించారు.

     

  • ‘యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి’

    కొమురం భీమ్: కాగజ్ నగర్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ పాల్గొని మాట్లాడారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల సమాచారం తెలిస్తే పోలీసులకు అందజేయాలన్నారు. కార్యక్రమంలో పోలీసులు, పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

  • విద్యుత్తు కార్యాలయం ముందు ప్రజల ఆందోళన

    కొమురం భీమ్: కాగజ్ నగర్ పట్టణంలోని విద్యుత్తు కార్యాలయం ముందు సోమవారం చారీగాం, బురుదగూడ, నందిగూడ, మెట్పల్లి, వంజిరి, అంకుశాపూర్, గోంది, నార్లాపూర్, దుబ్బగూడ, మహాజన్గూరడ, సీఆర్ నగర్ గ్రామస్థులు ఆందోళన చేశారు. ఈసందర్భంగా పలువురు ప్రజలు మాట్లాడుతూ.. గత మూడు నెలలుగా రాత్రి సమయంలో విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని వాపోయారు. ఉన్నతాధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు.

  • ‘చదువుతోపాటు క్రమశిక్షణ కీలకం’

    సంగారెడ్డి: పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం డిగ్రీ కళాశాలలో నిర్మించిన అదనపు తరగతి గదులను సోమవారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి చదువుతోపాటు క్రమశిక్షణ నేర్చుకోవడం కీలకమని అన్నారు. జూలై 15 నుంచి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల తరగతులు ప్రారంభం కానున్నట్లు తెలిపారు.

  • ‘ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి’

    సిద్దిపేట: హుస్నాబాద్ మండల కేంద్రంలో సోమవారం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధులు సుద్దాల చంద్రయ్య, మల్లికార్జున్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్‌పై స్థానిక కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేయడం మానుకోని ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. సమావేశంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.

  • పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం

    సిద్దిపేట: తొగుట మండలం గుడికందుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1999-2000 సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు సోమవారం ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. దాదాపు 100 మంది పూర్వ విద్యార్థులు 25 ఏళ్ల తర్వాత ఒక చోట కలుసుకుని, నాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

  • ఎంపీ త్వరగా కోలుకోవాలని పూజలు

    సిద్దిపేట: దుబ్బాక ఉమామహేశ్వర ఆలయంలో సోమవారం బీజేపీ నాయకులు ప్రత్యేక పూజాలు నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఎంపీ రఘునందన్ రావు త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేసినట్లు తెలిపారు. ఆయన అభిమానులు, పార్టీ నాయకులు ఎలాంటి దిగులు చెందవద్దని, అతి త్వరలో ఆయన తిరిగి ప్రజాక్షేత్రంలోకి వస్తారని అన్నారు. కార్యక్రమంలో నాయకులు రమేష్, యాదవరెడ్డి, శ్రీనివాస్, బాలరాజు పాల్గొన్నారు.

  • ‘ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలి’

    సంగారెడ్డి: పాశ మైలారంలోని సిగాచీ కంపెనీలో జరిగిన అగ్నిప్రమాదం బాధాకరమని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ అన్నారు. ఆయన ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు. సహాయక బృందాలు బాగా పనిచేస్తుంటే వారిపై, రాష్ట్రప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. రాజకీయాలు మాట్లాడే సమయం ఇది కాదని అన్నారు.

  • చిన్నచల్మెడలో మంచి నీటి బోరు ప్రారంభం..

    సంగారెడ్డి: మునిపల్లి మండలం చిన్నచల్మెడ గ్రామంలోని కుమ్మరి గడ్డలో సోమవారం మంచినీటి బోరు ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ సుధాకర్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రుద్ర కృష్ణ పాల్గొని బోరును ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నీటి సమస్యతో ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రతి గ్రామంలో మంత్రి ఆదేశాల మేరకు మంచినీటి బోర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.