Author: Shivaganesh

  • ‘ఉన్నతాధికారులు స్పందించాలి’

    సంగారెడ్డి: సదాశివపేట మండలంలోని నగసన్‌పల్లి, పెద్దపూర్ గ్రామ శివారులోని జాతీయ రహదారి పక్కన గ్రామ పరిధి సూచిక బోర్డు ఏర్పాటు చేశారు. ఈ బోర్డును గతంలో కొందరు వ్యక్తులు తొలగించగా, ఛోటా న్యూస్‌లో కథనం రావడంతో దానిని తిరిగి ఏర్పాటు చేశారు. కానీ ప్రస్తుతం మళ్లీ బోర్డును తొలగించడంపై సోమవారం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నత అధికారులు స్పందించాలని వారు కోరారు.

  • ఆర్జీయూకేటీలో అకాడెమిక్ రివ్యూ మీటింగ్

    నిర్మల్: ఆర్జీయూకేటీ బాసరలో 2025-26 విద్యా సంవత్సరానికి సోమవారం అకాడెమిక్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా వీసీ ఏ. గోవర్ధన్ పాల్గొని మాట్లాడారు. తరగతుల నిర్వహణ, హాజరు, డేటా భద్రతపై దృష్టి పెట్టాలని సూచించారు. త్వరలో ఎం.టెక్, పీహెచ్.డి నోటిఫికేషన్ విడుదల చేస్తామని అన్నారు. జూలై 4న ప్రవేశ ఫలితాలు, జూలై 7 – 9న కౌన్సిలింగ్ ఉంటుందని పేర్కొన్నారు.

  • ‘పెండింగ్ జీతాలు చెల్లించాలి’

    ఆదిలాబాద్: కలెక్టరేట్ ముందు సోమవారం తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ మాట్లాడుతూ… గ్రామపంచాయతీ కార్మికుల మూడు నెలల పెండింగ్ వేతనాలు తక్షణమే వారి ఖాతాల్లో వేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ వేతనాలు రాక వారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

  • ఆర్టీసీ బస్సు – ఆటో ఢీ.. ఇద్దరు మృతి

    మెదక్: ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొని ఇద్దరు మృతి చెందిన ఘటన సోమవారం మంగోజుపల్లి శివారులో చోటుచేసుకుంది. మాంగోజుపల్లి గ్రామ శివారులోని నిజాం షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఆర్టీసీ బస్సు ఆటో ఢీకొన్నాయి. ప్రమాదంలో ఆటోలో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

  • ప్రారంభమైన ఫుడ్ ఫెస్టివల్

    హన్మకొండ: భద్రకాళి బండ్‌లో మెప్మా ఆధ్వర్యంలో GWMC సహకారంతో ఆదివారం ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, మేయర్ సుధారాణి, కుడా ఛైర్మన్ వెంకటరామిరెడ్డి, కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ప్రారంభించారు. ఈసందర్భంగా వారు ఫుడ్ ఫెస్టివల్‌లో వివిధ స్టాల్స్‌ను పరిశీలించి, ప్రజలతో మాట్లాడారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

  • పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌ఛార్జుల నియామకం

    ఆదిలాబాద్: కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి వైస్ ప్రెసిడెంట్‌గా ఎంపీ కందూరు రఘువీరారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా టీపీసీసీ జనరల్ సెక్రటరీలు రాంభూపాల్, బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, అచ్యుత్ రమేశ్‌బాబు కూడా ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జులుగా నియమితులైనట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

     

  • ‘రథయాత్రను విజయవంతం చేయాలి’

    మంచిర్యాల: జిల్లా కేంద్రంలో ఆదివారం మాభూమి JAC ఆధ్వర్యంలో కరపత్రాలను విడుదల చేశారు. కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌ఛార్జ్ లక్ష్మణ్ పాల్గొని మాట్లాడుతూ.. డా.విశారదన్ మహారాజ్ చేపట్టిన లక్ష కిలోమీటర్లు మాభూమి రథయాత్రలో జిల్లా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జూలై 4వ వారంలో జిల్లాలో మాభూమి రథయాత్ర జరగనున్నట్లు తెలిపారు.

  • ‘వాటా చెల్లించకపోవడం శోచనీయం’

    మంచిర్యాల: జిల్లా కేంద్రంలోని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) కార్యాలయంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. సమావేశంలో సంఘం రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి రమేష్ పాల్గొని మాట్లాడుతూ.. CPSకు 13నెలలుగా ప్రభుత్వం వాటా చెల్లించకపోవడం శోచనీయమన్నారు. తనిఖీలకు ఉపాధ్యాయులు వెళ్తే పాఠాలు ఎవరు బోధిస్తారని ప్రశ్నించారు. సంబంధిత ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

  • రేపు జాబ్ మేళా

    మంచిర్యాల: జిల్లాలోని మిమ్స్ డిగ్రీ కళాశాలలో సోమవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి రవికృష్ణ తెలిపారు. నిరుద్యోగ యువత ఉదయం 10.30 గంటలకు హాజరుకావాలని సూచించారు. ఫార్మసిస్ట్ 40, ట్రైనీ ఫార్మసిస్ట్ 20, ఫార్మసీ అసిస్టెంట్ 30, రిటైల్ ట్రైనీ అసిస్టెంట్ 10 పోస్టులకు నియామకాలు చేపడుతున్నట్లు చెప్పారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

  • లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక

    మంచిర్యాల: మంచిర్యాల లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. క్లబ్ అధ్యక్షుడిగా కార్కూరి చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శిగా పోటు సుధాకర్ రెడ్డి, కోశాధికారిగా రామస్వామి ఎన్నికయ్యారు. ఈసందర్భంగా నూతన అధ్యక్షుడు చంద్రమౌళి మాట్లాడుతూ.. లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలు యథావిధిగా కొనసాగిస్తామన్నారు. అనంతరం వాకర్స్ అసోసియేషన్ నాయకులు కొత్త కార్యవర్గాన్ని సన్మానించారు.