మహబూబాబాద్: జిల్లా కోర్టు సెంటర్లో ఆదివారం డబ్ల్యూజేఐ కన్వీనర్ ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఓ ఛానల్ కార్యా లయంపై జరిగిన దాడికి నిరసన తెలిపారు. అనంతరం జర్నలిస్ట్ స్వేచ్ఛ మృతికి సంతాపం ప్రకటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రశ్నించే గొంతులు ఉంటేనే రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి బలమని అన్నారు. ఛానల్ కార్యాలయంపై జరిగిన దాడిని ముక్తకంఠంతో ఖండించాలన్నారు. కార్యక్రమంలో జర్నలిస్టులు, తదితరులు పాల్గొన్నారు.
Author: Shivaganesh
-
‘హథీరాం బావాజీ జయంతిని ఘనంగా నిర్వహించాలి’
మహబూబాబాద్: జిల్లా కేంద్రంలో ఆదివారం సేవాలాల్ సేనా కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ముఖ్య అతిథిగా సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకన్న నాయక్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బంజారాల ఆరాధ్య దైవం హథీరాం బావాజీ జయంతిని రేపు అన్నితండాల్లో ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. సీత్లా పండుగను పూసల కార్తె తొలి మంగళవారం బంజారా జాతి మొత్తం నిర్వహించి ఐక్యతను చాటాలన్నారు.
-
సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
మహబూబాబాద్: ఈదుల పూసపల్లిలో ఆదివారం ఎమ్మెల్యే మురళి నాయక్ పర్యటించారు. ఈసందర్భంగా ఆయన స్థానికంగా సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పట్టణ అభివృద్ధిలో సీసీ రోడ్ల నిర్మాణాలు మైలురాయి అని అన్నారు. మహబూబాబాద్‌కు నిధులు తీసుకోవచ్చి అభివృద్ధి పనులను నిర్వహిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
-
శ్రీరాములను సన్మానించిన ఎమ్మెల్సీ విఠల్
మంచిర్యాల: తాండూర్ మండల కేంద్రంలోని సురభి గోదాక్షేత్ర ఫంక్షన్ హాల్‌లో ఆదివారం ఉపాధ్యాయుడిగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన మాసాడి శ్రీరాములు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్ పాల్గొని ఆయనను సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులు అంకితభావంతో పనిచేస్తే మంచి గుర్తింపు లభిస్తుందని అన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
-
చికిత్స పొందుతూ ఒకరి మృతి
జయశంకర్ భూపాలపల్లి: చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందిన ఘటన ఆదివారం చిట్యాల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చింతకింది రాజమణి (57) ఈనెల 27న బైక్ పై నుంచి పడి తీవ్రంగా గాయపడ్డారు. ఆమె చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారు జామున మృతి చెందారు. మృతురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రావణ్ కుమార్ తెలిపారు.
-
‘నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి’
హన్మకొండ: బాలసముద్రంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో ఏఐటీయూసి జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ముఖ్యఅతిథిగా పార్టీ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలని, కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.
-
భద్రకాళీ అమ్మవారికి ఒడిబియ్యం..
వరంగల్: జిల్లా కేంద్రంలోని కాపువాడ నుంచి మహిళలు ఆదివారం ఊరేగింపుగా భద్రకాళీ అమ్మవారి ఆలయానికి బయలుదేరి వెళ్లారు. భద్రకాళీ శాకంబరి ఉత్సవాల్లో భాగంగా ఒడిబియ్యం, పట్టువస్త్రాలు సమర్పించేందుకు మహిళలు భక్తిశ్రద్ధలతో మేళతాళాల నడుమ ఆలయానికి వెళ్లారు. అనంతరం అమ్మవారిని దర్శించుకొని ఒడిబియ్యం, పసుపు, కుంకుమ, సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
-
పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
హన్మకొండ: జిల్లా కేంద్రంలోని పలు డివిజన్లలో ఆదివారం ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు పర్యటించారు. ఈసందర్భంగా ఆయన ఆయా డివిజన్ల పరిధిలో రూ.1.95 కోట్లతో సీసీ రోడ్, సైడ్ డ్రైన్, బీటీ రోడ్, శ్మశాన వాటిక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తమది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రజాప్రభుత్వం అని అన్నారు. ప్రజలందరూ ప్రభుత్వానికి, అధికారులకు సహకరించాలని కోరారు.
-
రేషన్ బియ్యం పట్టివేత.. కేసు నమోదు
హన్మకొండ: మడికొండలో భారీగా రేషన్ బియ్యం పట్టుకున్న ఘటన ఆదివారం వెలుగుచూసింది. ఈసందర్భంగా టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ సత్య నారాయణరెడ్డి మాట్లాడుతూ.. విశ్వసనీయ సమాచారం మడికొండలోని ఓ ఇంట్లో రవాణాకు సిద్ధంగా ఉన్న రూ. 1.12 లక్షల విలువైన 37.5 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని, ఒక ఆటోను పట్టుకున్నట్లు తెలిపారు. నిందితులు నర్ర ప్రశాంత్, నర్ర శ్రీధరను అరెస్ట్ చేసి, వారిపై కేసు నమోదు చేశామన్నారు.
-
‘ప్రతి కాలనీ అభివృద్ధి చేస్తాం’
హన్మకొండ: హసన్‌పర్తి మండల కేంద్రంలోని మంత్రపురి కాలనీలో ఆదివారం ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు పర్యటించారు. ఈసందర్భంగా ఆయన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలం నేపథ్యంలో నీరు ఎక్కడ నిల్వకుండా ప్రతి కాలనీ అభివృద్ధి చేస్తామని అన్నారు. వరంగల్ నగరానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపి నిధులు కేటాయిస్తున్నారన్నారు.