మెదక్: నర్సాపూర్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు ఆర్.సంధ్యారాణి రైతులకు యూరియా వినియోగంపై పలు సూచనలు చేశారు. ఒక పంట కాలానికి ఎకరానికి రెండు బస్తాల యూరియా మాత్రమే అవసరమని, అంతకంటే ఎక్కువ వాడితే పురుగులు, వ్యాధులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. యూరియా వాడిన తర్వాత నానో యూరియా వాడితే పంట ఆరోగ్యంగా పెరిగి పెట్టుబడి తగ్గి, దిగుబడి పెరుగుతుందని వివరించారు.