Author: Shivaganesh

  • తాత్కాలికంగా స్విమ్మింగ్ పూల్ మూసివేత

    ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలోని స్విమ్మింగ్ పూల్‌ను తాత్కాలికంగా మూసి వేస్తున్నట్లు నిర్వాకులు రాష్ట్రపాల్ జబాడే పేర్కొన్నారు. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షంతో స్విమ్మింగ్ పూల్లోని నీరు కలుషితమైందని, జూలై 1 నుంచి 4వ తేదీ వరకు పూల్‌ను తాత్కాలికంగా మూసి వేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని పట్టణ ప్రజలు గమనించి సహకరించాలని సూచించారు.

  • విత్తన లైసెన్సు రద్దు

    ఆదిలాబాద్: ఓ విత్తన షాపు లైసెన్స్ రద్దు చేస్తూ ఆదివారం జిల్లా వ్యవసాయ అధికారి ఉత్తర్వులు జారిచేశారు. నాణ్యతా ప్రమాణాలు లేని విత్తనాలు అమ్మడం, మొలక శాతం సరిగ్గా లేని విత్తనాలు విక్రయిస్తున్నట్లు రాహుల్ ఫర్టిలైజర్ నార్నూర్ షాపుపై అందిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపినట్లు తెలిపారు. విచారణ అనంతరం సదరు షాపు లైసెన్స్ రద్దు చేశామన్నారు.

  • ‘నకిలీ’ ముఠా అరెస్ట్

    ఆదిలాబాద్: ఇచ్చోడ మండలంకు చెందిన ఖలీం, ఫరీద్, గజానంద్‌లను అరెస్టు చేసినట్లు ఏసీపీ కాజల్ సింగ్ తెలిపారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఆర్మీ ఉద్యోగాల కోసం ఫేక్ సర్టిఫికెట్ల సృష్టించిన వారిని అరెస్ట్ చేశామన్నారు. పొరుగు రాష్ట్రాలకు చెందిన 9 మంది నకిలీ ధ్రువీకరణ పత్రాలతో తెలంగాణ కోట నుంచి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఉద్యోగాలు పొందారన్నారు. సమావేశంలో పోలీసు అధికారులు పాల్గొన్నారు.

  • ‘అన్ని వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ కృషి చేస్తుంది’

    ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని ప్రజాభవన్‌లో ఆదివారం డీసీసీబీ ఛైర్మన్ ఆడ్డీ భోజారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుపై బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి జోగురామన్న చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. జోగురామన్న జిల్లాకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.

  • సింగరాజుపల్లిలో హెల్మెట్ల పంపిణీ

    జనగామ: దేవరుప్పుల మండలం సింగరాజుపల్లిలో ఆదివారం మందుగులోజు వినయ్ కుమార్ స్నేహితులు హెల్మెట్లు పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ.. తన స్నేహితుడు జనగామ వెళ్తుండగా డీసీఎం ఢీకొని మృతి చెందినట్లు పేర్కొన్నారు. ప్రమాద సమయంలో హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణాలతో ఉండే వాడని అన్నారు. అందుకే తన జ్ఞాపకార్థంగా హెల్మెట్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

  • ‘అత్యంత హేయమైన చర్య’

    ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలో ఆదివారం సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లేశ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భీంపూర్ మండలంలో బాలిక అక్రమ రవాణా ఘటన వెలుగు చూసిందన్నారు. అమాయక పేద ఆడపిల్లల అక్రమ రవాణా చేస్తూ ఇతర రాష్ట్రాలకు అమ్మడం అత్యంత హేయమైన చర్య అని పేర్కొన్నారు. ఈ ముఠాలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

  • ఘనంగా బోనాల పండుగ

    ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని చించేరవాడ కాలనీలోని మారెమ్మ ఆలయంలో ఆదివారం ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు బోనాలు ఎత్తుకుని డప్పు చప్పుళ్లతో పురవీధుల్లో శోభాయాత్రతో అమ్మవారి ఆలయానికి వెళ్లారు. అనంతరం అమ్మవారికి నైవేద్యం సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాలనీవాసులు పాల్గొన్నారు.

  • మూడు షాపుల్లో చోరీ.. కేసు నమోదు

    ఆదిలాబాద్: మూడు షాపుల్లో చోరీ చేసిన ఘటన ఆదివారం జిల్లా కేంద్రంలో ఆలస్యంగా వెలుగుచూసింది. శనివారం రాత్రి రిమ్స్ సమీపంలోని ఆదిత్య, కోరుట్ల మెడికల్ దుకాణాలతో పాటు శ్రీమహాలక్ష్మి కిరాణ దుకాణంలో గుర్తుతెలియని వ్యక్తులు షాపుల షట్టర్లు పగులగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. షాపుల నిర్వాహకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

  • ఇంద్రవెల్లిలో వనదేవత పూజలు

    ఆదిలాబాద్: ఇంద్రవెల్లి మండలంలోని పోల్లుగూడ, వాల్గొండా గ్రామాలకు చెందిన ఆదివాసీ గిరిజనుల ఆధ్వర్యంలో శుక్రవారం వనంలో వన దేవత (అకాడీ) ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారి సంప్రదాయం ప్రకారం చిన్నాపెద్ద తేడలు లేకుండా వనదేవతలకు మొక్కుకున్నారు. ఈసందర్భంగా పలువురు గిరిజనులు మాట్లాడుతూ.. ఈ పూజలు చేస్తేనే తమ దేవత పాడిపంటలకు రక్షణ కల్పిస్తుందని చెప్పారు.

  • బాలల సంరక్షణ కేంద్రాల తనిఖీ

    హన్మకొండ: జిల్లాలో ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలల సంరక్షణ కేంద్రాలను శుక్రవారం అదనపు కలెక్టర్‌ ఎ.వెంకట్‌రెడ్డి తనిఖీ చేసారు. ఫాతిమానగర్‌‌లోని డివైన్‌ మెర్సీ, ప్రభుత్వ బాలసదనం, స్పందన మానసిక దివ్యాంగుల కేంద్రాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బాలల సంరక్షణ కేంద్రాల భవనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్‌ తప్పనిసరని స్పష్టం చేశారు. తనిఖీలో పలువురు అధికారులు పాల్గొన్నారు.