హన్మకొండ: కలెక్టరేట్‌లో శుక్రవారం పలుశాఖల అధికారులతో కలెక్టర్ స్నేహ శబరీష్ సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా ఆమె మాట్లాడుతూ.. రహదారుల భద్రతా చర్యల్లో భాగంగా ప్రతి 15 రోజులకు ఒకసారి ఆర్‌అండ్‌బి, పోలీస్, జాతీయ రహదారులు, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలో రద్దీ, ప్రమాదకర ప్రాంతాలు, క్రిటికల్ జంక్షన్లను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు.
Author: Shivaganesh
-
చైన్ స్కాచింగ్ కలకలం
హన్మకొండ: కాజీపేట పోలీసు స్టేషన్ పరిధిలో శుక్రవారం చైన్ స్నాచింగ్ ఘటన కలకలం సృష్టించింది. చెన్నారావుపేట్ పాపయపేటలో అలువల కాంతమ్మ (55) ఉదయం వాకింగ్‌కు వెళ్లగా, గుర్తుతెలియని వ్యక్తి ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లాడు. వెంటనే బాధితురాలు కాజీపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
-
పోగొట్టుకున్న బ్యాగును అప్పగించిన పోలీసులు
హన్మకొండ: గోపాలపూర్‌కు చెందిన అహ్మద్ యూసఫ్ అలీ హైదరాబాద్ నుంచి హన్మకొండకు తిరిగి వస్తుండగా, ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద తన బ్యాగ్ పోగొట్టుకున్నారు. బ్యాగ్‌లో రూ.1.50 లక్షల విలువైన కటింగ్ షాప్ ట్రిమ్మర్స్ ఉన్నాయి. వెంటనే బాధితుడు సుబేదారి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీఐ ఎం.రంజిత్ కుమార్ సీసీ కెమెరాల ఆధారంగా బ్యాగ్‌ను గుర్తించి బాధితుడికి అప్పగించారు.
-
తీన్మార్ మల్లన్నకు వినతి
ములుగు: వాడ బలిజల సమస్యలపై శాసన మండలి సమావేశంలో మాట్లాడాని కోరుతూ శుక్రవారం వాడ బలిజ సేవా సంఘం నాయకులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డర్రా దామోదర్ మాట్లాడుతూ.. బీసీ ఉద్యమానికి వాడబలిజ సేవా సంఘం పూర్తి మద్దతు ఇస్తుందని అన్నారు. కార్యక్రమంలో పలువురు సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
-
ఆధార్ సెంటర్ ఏర్పాటు చేయాలని వినతి
నిర్మల్: బాసర తహసీల్దార్ పవన్ చంద్రను శుక్రవారం మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోర్వ శ్యామ్ మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో ఆధార్ కేంద్రం లేకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారని అన్నారు. మండల ప్రజలు ఆధార్ సేవల కోసం ఇతర మండలాలకు వెళ్లాల్సి వస్తుందన్నారు. సమస్యను పరిష్కరించాలని ఎమ్మార్వోను కోరినట్లు తెలిపారు.
-
‘రాజకీయ తరగతులను విజయవంతం చేయాలి’
హన్మకొండ: జిల్లా కేంద్రంలో సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు మురళి నాయక్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 28, 29 తేదీల్లో నిర్వహించనున్న సేవాలాల్ సేన రాజకీయ తరగతులను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సేవాలాల్ సేన నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు పాల్గొన్నారు.
-
బకాయిలను చెల్లించాలని వినతి
హన్మకొండ: జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ గణేశ్‌ను శుక్రవారం దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చుంచు రాజేందర్ మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బెస్ట్ అవైలబుల్ స్కీమ్ పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని ఆర్డీఓను కోరినట్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
-
ఉద్యోగమేళాను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని
హన్మకొండ: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వృతివిద్య జూనియర్ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన ఉద్యోగమేళాను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను కూడా ప్రభుత్వ కళాశాలలోనే చదువుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి కృషి చేస్తోందని పేర్కొన్నారు. కళాశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
-
మహాసభల పోస్టర్ ఆవిష్కరణ
హన్మకొండ: జిల్లా కేంద్రంలోని పబ్లిక్ గార్డెన్లో శుక్రవారం గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం సభ్యుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ముఖ్యఅతిథిగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి లింగయ్య, ఉపాధ్యక్షుడు రమేశ్ పాల్గొన్నారు. ఈసందర్భంగా వారు సంఘం సభ్యులతో కలిసి మూడవ జిల్లా మహాసభ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
-
‘ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశాం’
హన్మకొండ: భద్రకాళి దేవాలయం ఈవో భారతి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. 15 రోజుల పాటు జరిగే శాకాంబరి ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారని తెలిపారు. శాకాంబరి నవరాత్రి మహోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేశామని స్పష్టం చేశారు. భక్తులకు ఉచిత భోజన సౌకర్యంతో పాటు మంచినీటి ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.