Author: Shivaganesh

  • ‘సత్వర పరిష్కారానికి కృషి చేస్తాం’

    హన్మకొండ: హంటర్ రోడ్డు, గాయత్రికాలనీ, వాసవికాలనీలో శుక్రవారం మేయర్ గుండు సుధారాణి, అధికారులతో కలిసి ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి పర్యటించారు. ఈసందర్భంగా ఆయన స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సమన్వయంతో ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

  • ‘బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు’

    ఆదిలాబాద్: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సంగీత పాల్గొని విద్యార్థులతో  మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్నారు. కార్యక్రమంలో డాక్టర్ కే.రమేష్, NSS, NCC ప్రోగ్రాం ఆఫీసర్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

  • ‘జూలై 31లోపు దరఖాస్తులు స్వీకరిస్తాం’

    ఆదిలాబాద్: జిల్లా బాలల పరిరక్షణ అధికారి రాజేంద్రప్రసాద్ శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం అవార్డులకు జూలై 31లోపు దరఖాస్తులు స్వీకరిస్తామని అన్నారు. జిల్లాలో 6 నుంచి 18సం.ల బాలలు దరఖాస్తులకు అర్హులని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 9440555872, 9440289825 నంబర్లను సంప్రదించాలన్నారు.

  • ‘వారిని మాత్రమే ఎంపిక చేయాలి’

    ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలో శుక్రవారం డీఈఓ శ్రీనివాస్ రెడ్డిని పీఆర్టీయూ జిల్లా నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. జిల్లా సైన్స్ అధికారి (డీఎస్ఓ) పోస్ట్ నియామకం కోసం సర్‌ప్లస్ ఉన్న ఉపాధ్యాయులను మాత్రమే ఎంపిక చేయాలని డీఈఓను కోరినట్లు తెలిపారు. పార్ట్ టైం పీటీఐలు మధ్యాహ్నం సమయంలో పని చేయడానికి తగిన ఉత్తర్వులు ఇవ్వాలని కోరామన్నారు.

     

  • వైష్ణవికి పీఆర్టీయూ నాయకుల సన్మానం

    ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణం రామ్‌నగర్లో నివసిస్తున్న కనక పునారం కుమార్తె వైష్ణవి IIT బొంబాయిలో సీటు సాధించింది. శుక్రవారం పీఆర్టీయూ జిల్లా శాఖ నాయకులు వారి ఇంటికి వెళ్లి ఆమెను శాలువతో సన్మానించి, అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. జీవితంలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

  • ‘ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి’

    ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని గడియార్ గర్, ఇంద్రనగర్ కాలనీలో శుక్రవారం ఎమ్మార్పీఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అరెల్లి మల్లేష్ పర్యటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూలై 7న పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ నేతృత్వంలోనే మాదిగ జాతికి మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.

  • ఫలితాల్లో గందరగోళం.. విద్యార్థుల ఆందోళన 

    ఆదిలాబాద్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో గురువారం విడుదలైన డిగ్రీ ఫలితాల్లో గందరగోళం చోటుచేసుకుంది. జిల్లాలోని నలంద డిగ్రీ కళాశాలలో బీకాం (కంప్యూటర్స్) చదువుతున్న 57 మంది విద్యార్థులు థియరీ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ జీఎస్ఈ ల్యాబ్ ప్రయోగ పరీక్ష రాసినా ఫలితాల్లో రాయనట్లుగా ప్రకటించారని శుక్రవారం ఆందోళన చేశారు. ఘటనపై కళాశాల యాజమాన్యం స్పందించి పొరపాటును సరిచేస్తామని పేర్కొంది.

  • సమస్యలు పరిష్కరించాలని వినతి

    మంచిర్యాల: హైదరాబాద్ గాంధీభవన్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్ డాక్టర్ రియాజ్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన జిల్లా పార్ట్ టైం స్వీపర్స్ సీహెచ్ స్వామి, మధుకర్, అరుణ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పార్ట్ టైం స్వీపర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరినట్లు తెలిపారు.

  • వినూత్న రీతిలో వీడ్కోలు

    నిర్మల్: భైంసా ఏరియా హాస్పిటల్‌లో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న చంద్రబాయి శుక్రవారం పదవి విరమణ చేశారు. ఈసందర్భంగా ఆమెకు తోటి కార్మికులు వినూత్న రీతిలో వీడ్కోలు పలికారు. సీనియర్, జూనియర్ కార్మికులంతా కలిసి ఆమెకు పాద పూజ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఆమె శేష జీవితం సంతోషంగా గడపాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ డా.కాశినాథ్, తదితరులు పాల్గొన్నారు.

  • ‘దివ్యాంగులకు ప్రభుత్వం అండగా ఉంటుంది’

    జయశంకర్ భూపాలపల్లి: మహదేవపూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో శుక్రవారం అలీం కో సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు.  ఈసందర్భంగా ఆయన దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, ఇతర ఉపకరణాలు అందజేసి మాట్లాడారు. దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని అన్నారు.  కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ శర్మ, తదితరులు పాల్గొన్నారు.