ఆదిలాబాద్: ఉట్నూర్‌లో ఆదివాసి పెద్దలతో శుక్రవారం మంత్రి జూపల్లి కృష్ణారావు సమావేశమయ్యారు. జీవో 49 ఆదివాసీల అభివృద్ధికి అడ్డుగా ఉందని ఎమ్మెల్యేలు కోవలక్ష్మీ , పాల్వాయి హారిష్ బాబులు అన్నారు. దానికి మంత్రి స్పందించిన మంత్రి జీవో ఇంకా అమలు కాలేదని చీఫ్ కంజర్వెషన్‌తో ఫోన్లో మాట్లాడి ఆదివాసులకు వినిపించారు. సమావేశంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, తదితరులు పాల్గొన్నారు.
Author: Shivaganesh
-
ఆదివాసీ నేతలతో మంత్రి సమావేశం
-
‘కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి’
మహబూబాబాద్: నెల్లికుదురు మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాక విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.
-
పుష్కర ఘాట్లను పరిశీలించిన ఆర్డీఓ
నిర్మల్: బాసర శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనానికి వచ్చి భక్తుల భద్రతకు చర్యలు తీసుకుంటున్నామని భైంసా ఆర్డీఓ కోమల్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన బాసర గోదావరి నది పుష్కర ఘాట్లను పరిశీలించారు. ఘాట్‌ల వద్ద భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ఘాట్‌లకు జాలీలు, వాచ్ టవర్, మైక్ సిస్టమ్‌తో అనౌన్స్మెంట్, గజ ఈతగాళ్లు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
-
‘పారదర్శకంగా ధ్రువపత్రాల పరిశీలన’
నిర్మల్: ఆర్జీయూకేటీ బాసరలో శుక్రవారం మహబూబ్‌నగర్ కేంద్రానికి చెందిన స్పోర్ట్స్, ఎన్‌సీసీ కోటాలో విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించారు. కార్యక్రమంలో వీసీ గోవర్ధన్, ఓఎస్‌డీ ప్రొఫెసర్ మురళీధరన్ స్వయంగా పాల్గొని ప్రక్రియను పర్యవేక్షించారు. ఈసందర్భంగా వీసీ మాట్లాడుతూ.. పూర్తిగా పారదర్శకంగా ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రతిభ ఉన్న విద్యార్థులకు అవకాశం కల్పించడమే విశ్వవిద్యాలయ లక్ష్యమని పేర్కొన్నారు.
-
ఆస్పత్రులను తనిఖీ చేసిన హెల్త్ కమిషనర్
వరంగల్: జిల్లాలోని పలు మెడికల్ కళాశాలలు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను శుక్రవారం రాష్ట్ర హెల్త్ కమిషనర్ సంగీత ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె ఎంజీఎం, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, మెడికల్ కాలేజ్‌ల పరిస్థితులపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రోగులకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలన్నారు. కార్యక్రమంలో పలువురు వైద్య అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
-
డబ్బులు డిమాండ్ చేసిన వ్యక్తి అరెస్ట్: సీఐ
ఆదిలాబాద్: గుడిహత్నూర్‌కు చెందిన ఆరుగుల సంతోష్ గీత కార్మికుడు. ఆయన తాటి కళ్ళు తీస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఈక్రమంలో ఆయనను భూమేష్ అనే వ్యక్తి తనను తాను మీడియా వ్యక్తిగా పరిచయం చేసుకొని, రూ.10వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేకపోతే అధికారులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించారు. సంతోష్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి భూమేష్‌ను అరెస్టు చేసినట్లు సీఐ రాజు తెలిపారు.
-
‘అన్ని ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలి’
హన్మకొండ: న్యూ-శాయంపేట చౌరస్తాలో గురువారం జిల్లా బీజేపీ మాజీ పార్టీ అధ్యక్షురాలు రావు పద్మ పర్యటించారు. ఈసందర్భంగా ఆమె స్థానికంగా ఉన్న ప్రజలకు 11 ఏళ్ల ప్రధాని మోడీ పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని, రాబోయే అన్ని ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను ప్రజలు గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
-
28 మందికి కోర్టు జరిమానా
హన్మకొండ: కాజీపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో 28 మందిపై ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదు చేసినట్లు గురువారం హన్మకొండ సీఐ సీతారెడ్డి తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల నిర్వహించిన డ్రంక్ & డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 18 మందితో పాటు లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన మరో 10 మందికి కోర్టు జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, లేకుంటే జరిమానా తప్పదని హెచ్చరించారు.
-
పొగాకు సీజ్.. ఒకరిపై కేసు నమోదు
వరంగల్: మిల్స్ కాలనీ పరిధిలోని శివనగర్లో గురువారం టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. స్థానికంగా ఉన్న విశ్వనాధం కిరణా షాపులో నిర్వహించిన తనిఖీల్లో రూ.1,61,850 విలువగల పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈసందర్భంగా టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ మాట్లాడుతూ.. నిందితుడిపై కేసు నమోదు చేశామన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిషేధిత పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
-
ఎఫ్ఎస్ఈపీని పరిశీలించిన మేయర్, కమిషనర్
వరంగల్: గ్రేటర్ వరంగల్ 44వ డివిజన్‌లో గురువారం మేయర్ గుండు సుధారాణి, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ పర్యటించారు. ఈసందర్భంగా వారు స్థానికంగా ఉన్న మానవ వ్యర్థాల శుద్ధీకరణ కేంద్రం (ఎఫ్ఎస్ఈపీ)ను పరిశీలించారు. అనంతరం దాని నిర్వహణ తీరుతో పాటు, ఇదే ప్రాంతంలో 150 కేఎల్డీ సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్న ఎఫ్ఎన్టీపీ ప్లాంట్ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.