వరంగల్: బుద్ధారావుపేటలో గురువారం ఖానాపూర్ పోలీసులు ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నిర్మూలనపై గ్రామస్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఖానాపూర్ ఎస్ఐ రఘుపతి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. అనంతరం గ్రామస్థులతో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు.
Author: Shivaganesh
-
మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు
హన్మకొండ: మామునూరులోని జవహర్ నవోదయ స్కూల్లో గురువారం మాదక ద్రవ్యాల నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.వి.నిర్మలా గీతాంబ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాలకు అలవాటు పడితే మానసిక, శారీరక అనారోగ్యాలు తలెత్తుతాయని అన్నారు. ప్రతి ఒక్కరూ మత్తు పదార్థాలను అరికట్టేందుకు కృషి చేయాలని సూచించారు.
-
‘చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి’
హన్మకొండ: జిల్లా కేంద్రంలోని లాల్ బహదూర్ కళాశాలలో గురువారం అంతర్జాతీయ డ్రగ్స్ నివారణ వ్యతిరేక దినోత్సవంసందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఏసీపీ నందిరాంనాయక్ పాల్గొని మాట్లాడుతూ.. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని అన్నారు. మంచిగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఉండాలన్నారు. కార్య క్రమంలో ప్రిన్సిపాల్ అరుణ డిహెచ్ రావు, తదితరులు పాల్గొన్నారు.
-
‘లెదర్ పార్క్ ఏర్పాటుకు కృషి చేస్తాం’
జనగామ: చిన్న పెండ్యాల, మల్కాపూర్ గ్రామాల్లో గురువారం వరంగల్ ఎంపీ కడియం కావ్య పర్యటించారు. ఈసందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. దేవనూరు గుట్టలను ఎకో టూరిజం పార్కుగా అభివృద్ధి చేయడంతో పాటు ఘన్పూర్ నియోజకవర్గంలో లెదర్ పార్క్ ఏర్పాటుకు కృషి చేస్తామని అన్నారు. జాతీయ రహదారిపై ప్రమాదాలను అరికట్టి ప్రజలకు మెరుగైన సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
-
భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ఇనగాల
హన్మకొండ: భద్రకాళి అమ్మవారిని గురువారం కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(KUDA) ఛైర్మన్ ఇనగాల వెంకటరామిరెడ్డి దర్శించుకున్నారు. ఈసందర్భంగా ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భద్రకాళి శాకాంబరీ నవరాత్రి మహోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా కొత్తగా నియామకమైన ధర్మకర్తల మండలి కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.
-
డిగ్రీ ఫలితాలు విడుదల
హన్మకొండ: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో గురువారం డిగ్రీ ఫలితాలు విడుదల చేశారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలోని డిగ్రీ 5, 6వ సెమిస్టర్ ఫలితాలను విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి కట్ల రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ తిరుమలదేవి విడుదల చేశారు. ఫెయిల్ అయిన విద్యార్ధులు జూలై 11 వరకు రెవల్యూషన్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
-
‘నిరుపేదలకు అందించే విధంగా శ్రమించాలి’
మహబూబాబాద్: మహబూబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను నిరుపేదలకు అందించే విధంగా కార్యకర్తలు, నాయకులు నిరంతరం శ్రమించాలని సూచించారు. తన పేరు చెప్పుకొని దందాలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
-
నకిలీ బాబా అరెస్ట్
ఆదిలాబాద్: ఓ నకిలీ బాబాను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన గురువారం ఇచ్చోడ మండలం కోకస్‌మన్నూరులో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన షేక్ అహ్మద్ ప్రజలకు తాయెత్తులు కడుతూ వ్యాధులు నయం చేస్తానంటూ బురిడీ కొట్టిస్తున్నాడు. ఈ ఘటనపై ఇచ్చోడ పోలీసులు ఫిర్యాదు అందగా కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఇచ్చోడ సీఐ బండారి రాజు తెలిపారు. ఆరోగ్య సమస్యలకు ఆస్పత్రులకు వెళ్లాలన్నారు.
-
విద్యార్థులకు ఎన్‌సీసీ సర్టిఫికెట్లు అందజేత
వరంగల్: కాశీబుగ్గ పరిధిలోని అబ్బనికుంట ప్లాటినం జూబ్లీ ఉన్నత పాఠశాలలో గురువారం ఎన్‌సీసీ సర్టిఫికెట్ ప్రదానోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. విద్యార్థులు ఎన్‌సీసీలో చేరడం వల్ల స్వీయ క్రమశిక్షణ, లీడర్‌షిప్ క్వాలిటీస్ కలిగి ఉంటారని అన్నారు. అనంతరం విద్యార్థులకు ఎన్‌సీసీ సర్టిఫికెట్లు అందించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఉత్తమ్ ఛటర్జీ, ఎన్‌సీసీ ఆఫీసర్ నవీన్‌సన్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
-
రికార్డులను పరిశీలించిన ఎంపీవో
జయశంకర్ భూపాలపల్లి: మహదేవపూర్ మండల పరిధిలోని ఎడపల్లి గ్రామంలో గురువారం ఎంపీవో ప్రసాద్ పర్యటించారు. ఈసందర్భంగా ఆయన జీపీ కార్యాలయంలో నిర్వహిస్తున్న పలు రికార్డులను, రిజిస్టర్లను తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జీపీ రికార్డులను సక్రమంగా నిర్వహించాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. గ్రామంలో పారిశుధ్య పనులు పరిశీలించారు. కార్యక్రమంలో జీపీ కార్యదర్శి మహేశ్, సిబ్బంది పాల్గొన్నారు.