Author: Shivaganesh

  • మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన ర్యాలీ

    మంచిర్యాల: తాండూర్ మండల కేంద్రంలో గురువారం మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన ర్యాలీని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత మత్తుకు బానిస కావద్దని పిలుపునిచ్చారు. అనంతరం మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా విద్యార్థులు, యువతతో ప్రతిజ్ఞ చేయించారు. మత్తు పదార్థాలు వినియోగించిన, విక్రయించిన కఠిన చర్యలు తప్పవన్నారు.

  • పాలకుర్తి పీఎస్‌ను తనిఖీ చేసిన సీపీ

    జనగామ: పాలకుర్తి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ను బుధవారం వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన స్టేషన్‌లోని పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం సిబ్బందితో మాట్లాడి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్, వర్ధన్నపేట ఏసీపీ అంబాటి నర్సయ్య, పాలకుర్తి సీఐ జానకిరామ్ రెడ్డి, ఎస్ఐ పవన్ కుమార్ పాల్గొన్నారు.

  • మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన

    మెదక్: రామాయంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం పోలీసు ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్సై బాలరాజు పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలు కావద్దని సూచించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని పిలుపునిచ్చారు.

  • ‘ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి’

    మెదక్: పట్టా పాస్ బుక్ కలిగిన రైతులందరూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని రామాయంపేట ఇన్‌ఛార్జి వ్యవసాయ డివిజన్ అధికారి రాజు నారాయణ సూచించారు. బుధవారం ఆయన రామాయంపేటలో మాట్లాడుతూ.. డివిజన్ వ్యాప్తంగా ఉన్న 45,544  మంది రైతులకు కేవలం 15,690 మంది మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు పొందినందుకు తప్పనిసరి రిజిస్ట్రేషన్ అవసరం అన్నారు.

     

     

  • జిన్నారంలో రైతు భరోసా సంబరాలు

    సంగారెడ్డి: జిన్నారం మండల కేంద్రంలో బుధవారం రైతు భరోసా సంబరాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ పాల్గొని సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులను అన్ని విధాల ఆదుకునే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని కొనియాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.

  • మల్లన్న సాగర్ సాగునీటిపై ఎంపీ, ఎమ్మెల్యే సమీక్ష

    సిద్దిపేట: రంగనాయక సాగర్ వద్ద బుధవారం ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఇరిగేషన్ అధికారులతో సమీక్షించారు. 2022 లో పనులు ప్రారంభమై సాగునీరు ఎందుకు అందడం లేదని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 రోజుల్లోగా నీరు అందించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వచ్చే పంటకాలానికి నీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.

  • పోలీసు స్టేషన్‌ను సందర్శించిన సీపీ

    వరంగల్: వర్ధన్నపేట పోలీస్ స్టేషన్‌ను బుధవారం వరంగల్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సందర్శించారు. ఈసందర్భంగా ఆయన స్టేషన్‌ను, పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతున్న నేరాల గురించి, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ ఆవరణలో సిబ్బందితో కలిసి మొక్కను నాటారు. కార్యక్రమంలో వెస్ట్‌జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏసీపీ నరసయ్య, సిబ్బంది పాల్గొన్నారు.

  • ‘కార్యక్రమాన్ని విజయవంతం చేయండి’

    హన్మకొండ: మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు జయంతిని పురస్కరించుకొని ఈనెల 27 న జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్‌లో సీడీ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు బుధవారం ఆయుర్వేద వైద్యులు పాములపర్తి రామారావు తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్యక్రమంలో పాల్గొనడానికి ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ నుంచి ప్రముఖ గాయకులు వస్తారని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

     

  • ‘మల్లన్న సాగర్ సాగునీటి కోసం రాజీనామాకైనా సిద్ధం’

    సిద్దిపేట: మల్లన్న సాగర్ సాగునీటి కోసం రాజీనామాకైనా సిద్ధమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. బుధవారం తిమ్మాపూర్ వద్ద నిర్వహించిన రైతు సదస్సులో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో 90% పైప్‌లైన్ పనులు పూర్తయ్యాయని, కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు ఇవ్వకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. రైతుల కోసం ఉద్యమిస్తానని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, రైతులు పాల్గొన్నారు.

  • గుంతలను పూడ్చిన అధికారులు

    సిద్దిపేట: 100 రోజుల కార్యక్రమ కార్యచరణలో భాగంగా బుధవారం హుస్నాబాద్‌లో పురపాలక సంఘ కమిషనర్ టి.మల్లికార్జున్ ఆధ్వర్యంలో డ్రైనేజీ సమస్యను పరిష్కరించారు. అనంతరం ఎల్లమ్మ బజార్ రోడ్‌లో పెట్రోల్ పంపు వద్ద రోడ్లపై ఉన్న గుంతలను మట్టితో పూడ్చారు. కార్యక్రమంలో ఇన్‌ఛార్జి మేనేజర్ సంపత్ రావు, సానిటరీ ఇన్‌స్పెక్టర్ బాల ఎల్లం, పర్యావరణ అధికారి రవికుమార్, సిబ్బంది పాల్గొన్నారు.