హన్మకొండ: బల్దియా పరిధిలోని మెట్టుగుట్ట, బట్టుపల్లి, బిఆర్ నగర్ ప్రాంతాల్లో బుధవారం మేయర్ గుండు సుధారాణి పర్యటించారు. ఈసందర్భంగా ఆమె క్షేత్ర స్థాయిలో పర్యటించి శానిటేషన్, టౌన్ ప్లానింగ్ సంబంధిత అంశాలను పరిశీలించారు. అనంతరం సమర్థవంతంగా పనులు చేపట్టడానికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Author: Shivaganesh
-
ఆర్టీసీ ఎండీకి వినతి
మహబూబాబాద్: రాష్ట్ర ఆర్టీసీ కార్పొరేషన్ ఎండీ సజ్జనార్‌ను మంగళవారం కొత్తగూడ మండలం వేలుబేల్లి గ్రామ యువకులు మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని సజ్జనార్‌ను కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ రాములు, భాస్కర్, చందు తదితరులు పాల్గొన్నారు.
-
మంజూరు పత్రాలను అందజేసిన మంత్రి
జగిత్యాల: పెగడపెల్లి మండల కేంద్రంలోని మంగళవారం ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన, కలెక్టర్ సత్యప్రసాద్‌తో కలిసి 375 మంది లబ్ధిదారులకు ఇళ్ల పత్రాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేదవాడి సొంతింటి కలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిందని అన్నారు.
-
రైతు భరోసా సంబరాలు
వరంగల్: అయినవోలు మండల కేంద్రంలో మంగళవారం కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో రైతు భరోసా సంబరాలు నిర్వహించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సమ్మెట మహేందర్ పాల్గొని సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతు భరోసా నిధులు జమ చేసిన సందర్భంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు.
-
జూద శిబిరంపై దాడి.. కేసు నమోదు
హన్మకొండ: జూద స్థావరంపై పోలీసులు దాడి చేసిన ఘటన మంగళవారం ఐనవోలు మండలం సింగారం గ్రామ శివారులో వెలుగుచూసింది. గ్రామ శివారులో ఐదుగురు వ్యక్తులు జూదం ఆడుతుండగా పోలీసులు దాడి చేశారు. వారిలో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేయగా, ముగ్గురు పారిపోయారు. నిందితులపై కేసు నమోదు చేసి, వారి నుంచి రూ.3,100 నగదు, 2 సెల్ ఫోన్లు, స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
-
వాల్‌పోస్టర్లను ఆవిష్కరించిన ఇన్‌స్పెక్టర్
వరంగల్: మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవాల్లో భాగంగా మంగళవారం సుబేదారి ఇన్‌స్పెక్టర్ రంజిత్ కుమార్ వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజం నుంచి మత్తు పదార్థాలను తరిమేయడంలో ప్రజలు సహకరించాలని కోరారు. ముఖ్యంగా విద్యాసంస్థల్లో డ్రగ్స్‌పై అవగాహన కల్పించడంతో పాటు, విక్రయించినా, వినియోగించినా 8712585114 లేదా 871-268-5003 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
-
అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే సూచనలు
మహబూబాబాద్: కురవిలోని శ్రీవీరభద్రస్వామివారి ఆలయాన్ని మంగళవారం డిప్యూటీ స్పీకర్, డాక్టర్ రాంచంద్రు నాయక్ సందర్శించారు. ఈసందర్భంగా ఆయన ఆలయంలో చేపట్టనున్న అభివృద్ధి పనుల ప్రణాళికలను పరిశీలించారు. అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
-
మహిళలకు వైద్య పరీక్షలు
ములుగు: వెంకటాపురం మండల కేంద్రంలోని ఆరోగ్య మహిళ కేంద్రంలో మంగళవారం మహిళలకు డాక్టర్ స్నేహ రెడ్డి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 74 మంది మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించి, మందులను అందజేసినట్లు తెలిపారు. 16 మంది నుంచి రక్త నమూనాలను సేకరించి పరీక్షకోసం ములుగు ఏరియా వైద్యశాలకు తరలించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
-
మాదక ద్రవ్యాల నిర్మూలపై అవగాహన
సిద్దిపేట: కోహెడ మండల మోడల్ స్కూల్, నాగసముద్రంలో మంగళవారం యాంటీ డ్రగ్ అవగాహన వారోత్సవాలు నిర్వహించారు. కార్యక్రమంలో కోహెడ ఎస్‌ఐ పి.అభిలాష్ పాల్గొని మాట్లాడుతూ.. మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే నష్టాలను వివరించారు. యువత మత్తు బారిన పడకుండా ఉండాలని సూచించారు. వాటిని ఎవరైనా విక్రయించినా, సరఫరా చేసినా సమాచారం అందించాలని సూచించారు.
-
కుంటకట్టల మరమ్మతులు ప్రారంభం
సంగారెడ్డి: గుమ్మడిదల మండలం, లక్ష్మాపూర్, నాగిరెడ్డిగూడెం గ్రామాల్లో నేషనల్ ఆగ్రో ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుంటకట్టల మరమ్మతులు మంగళవారం ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో ఆత్మ కమిటీ ఛైర్మన్ కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పుట్టా నర్సింగ్ రావు, ఫౌండేషన్ ప్రతినిధి శ్రీకాంత్ పాల్గొని పనులను ప్రారంభించారు. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. కుంటకట్టల మరమ్మతులతో రైతులకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు.