Author: Shivaganesh

  • ‘మత్తు జీవితాన్ని నాశనం చేస్తుంది’

    సిద్దిపేట: హబ్సిపూర్‌లోని మహాత్మా జ్యోతిబాఫులే రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులకు మంగళవారం దుబ్బాక ఎస్‌ఐ గంగరాజు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన వారికి గంజాయి, డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాల వాడకం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మత్తు జీవితాన్ని నాశనం చేస్తుందని, యువత చెడు మార్గాల వైపు ఆకర్షితులు ఉండాలని సూచించారు.

  • ఆలయ కమిటీ నూతన కార్యవర్గం ఎన్నిక 

    సిద్దిపేట: దుబ్బాక పట్టణంలోని కాశీ విశ్వనాథ స్వామి ఆలయ కమిటీ నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆలయ కమిటీ ఛైర్మన్‌గా వెనిశెట్టి సుభాష్, 15 మంది సభ్యులు ఎన్నికయ్యారు. ఈసందర్భంగా సుభాష్ మాట్లాడుతూ… ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.

  • మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి: సీఐ

    సంగారెడ్డి: బొల్లారంలోని శ్రీ శ్లోక ఇంటర్నేషనల్ పాఠశాలలో మంగళవారం బొల్లారం ఇన్‌స్పెక్టర్ రవీందర్ రెడ్డి విద్యార్థులకు మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత మాదక ద్రవ్యాలకు బానిసలు కాకూడదని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞా చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో పోలీసులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

  • రాళ్లకత్వలో బీఆర్ఎస్ నాయకుల నిరసన

    సంగారెడ్డి: జిన్నారం మండల కేంద్రాన్ని పరిసర గ్రామాలను కలుపుతూ మున్సిపల్‌గా ప్రకటించడం దారుణమని రాళ్లకత్వలో బీఆర్ఎస్ నాయకులు మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. జిన్నారం మున్సిపాలిటీని నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు ఆదిరామకృష్ణ, గ్రామ పార్టీ అధ్యక్షులు దేవేందర్, నాయకులు పాల్గొన్నారు.

  • ‘అన్నదాతలను ప్రభుత్వం ఆదుకుంటుంది’

    భద్రాద్రి కొత్తగూడెం: కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి అని నారాయణపురం సొసైటీ ఛైర్మన్ నిర్మల పుల్లారావు అన్నారు. మంగళవారం నారాయణపురం మండల కేంద్రంలో రైతు భరోసా నిధులు అన్నదాతల ఖాతాల్లో జమ అయిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్నదాతలను ప్రభుత్వం ఎల్లప్పుడూ ఆదుకుంటుందని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

  • ఎమ్మెల్యేను కలిసిన ఎమ్మార్వో

    భద్రాద్రి కొత్తగూడెం: మణుగూరు మండలంలోని ప్రజాభవన్ కార్యాలయంలో మంగళవారం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును అశ్వాపురం తహసీల్దార్ మణిధర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మండల పరిధిలోని ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎమ్మార్వోకు సూచించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

  • నాట్లు వేసిన ఎమ్మెల్యే జారే

    భద్రాద్రి కొత్తగూడెం: దమ్మపేట మండలంలో మంగళవారం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటించి, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ క్రమంలో తిరుగు ప్రయాణం అయిన ఆయన వరి నాట్లు వేస్తున్న మహిళలతో కలసి నాట్లు వేశారు. ఈ సందర్భంగా ఆయన కూలీలు, రైతులతో మాట్లాడి వారి యోగక్షేమాలు, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

  • రైతు భరోసా సంబరాల్లో ఎమ్మెల్యే

    కరీంనగర్: గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మంగళవారం సాయంత్రం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో రైతు భరోసా సంబరాలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన పార్టీ నాయకులతో కలిసి సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 9 రోజుల వ్యవధిలో రూ.9వేల కోట్ల రైతు భరోసానిచ్చిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

  • ‘సీఐటీయూను గెలిపించాలి’

    సంగారెడ్డి: జిన్నారం మండలం కాజిపల్లిలో మంగళవారం టీఐడీసీ ఎన్నికల గేట్ మీటింగ్ నిర్వహించారు. మీటింగ్‌కు ముఖ్య అతిథిగా సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు హాజరై మాట్లాడారు. ఎన్నికల్లో నిత్యం కార్మికులకు అండగా ఉండే సీఐటీయూను గెలిపించాలని, చుక్క గుర్తుకే ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో
    సంఘం జిల్లా అధ్యక్షులు మల్లేష్, నాయకులు పాల్గొన్నారు.

  • పటాన్‌చెరులో దొంగల ముఠా అరెస్ట్

    సంగారెడ్డి: పటాన్‌చెరు పోలీసులు మంగళవారం 8 మంది దొంగల ముఠాను అరెస్ట్ చేశారు. ఈసందర్భంగా డీఎస్పీ ప్రభాకర్ మాట్లాడుతూ.. ఇస్నాపూర్, ముత్తంగి, ఇంద్రకరణ్, కేపీహెచ్‌బీ, బీదర్ జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడిన 8 మంది ముఠాను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితుల్లో ఒకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. సీఐ వినాయక్ రెడ్డి, డీఐ రాజు, పోలీస్ సిబ్బందిని ఎస్పీ పంకజ్ అభినందించారన్నారు.