Author: Shivaganesh

  • ఇసుక లారీలతో ట్రాఫిక్ కష్టాలు

    ములుగు: వెంకటాపురం మండలం గుండా హైదరాబాద్‌కు వెళ్లే ఇసుక లారీలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని మంగళవారం స్థానిక ప్రజలు వాపోయారు. ఈసందర్భంగా పలువురు స్థానికులు మాట్లాడుతూ.. ప్రతిరోజు ఎక్కడో ఒకచోట లారీలు నిలిచిపోయి, ట్రాఫిక్ సమస్యలు ఏర్పడి వాహనదారులు, ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అధికారులు సమస్యను పరిష్కరించాలని కోరారు.

  • సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం

    ములుగు: వెంకటాపురం మండల కేంద్రంలోని ఆర్అండ్ బి అతిథి గృహం ఆవరణంలో మంగళవారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈసందర్భంగా పీఏసీఎస్ అధ్యక్షుడు చిడెం మోహనరావు మాట్లాడుతూ.. రైతు భరోసా నిధులు మంజూరు చేసి సీఎం అన్నదాత గుండెల్లో గూడు కుట్టుకున్నారని అన్నారు. కార్యకరమంలో మండల పార్టీ అధ్యక్షులు సయ్యద్ హుస్సెన్, నాయకులు పాల్గొన్నారు.

  • న్యాయం జరగడం లేదని నిరసన

    వరంగల్: న్యాయం జరగడం లేనిదని ఓ వ్యక్తి వర్ధన్నపేట పోలీసు స్టేషన్ ముందు కూర్చొని నిరసన తెలిపారు. వివరాల్లో వెళ్తే.. భూతగాదాలు, కుటుంబ తగాదాల విషయంలో తనకు న్యాయం జరగడం లేదని కట్ట రాజు అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి పోలీస్ స్టేషన్ ముందు నిరసనకు దిగారు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు.

  • ధర్మపురిలో రైతు భరోసా సంబరాలు

    జగిత్యాల: ధర్మపురిలో మంగళవారం రైతు భరోసా సంబరాలను కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. అనంతరం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగనభట్ల దినేష్ మాట్లాడుతూ.. ఎన్నికల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం కచ్చితంగా అమలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.

  • ఎస్‌బీఐ మంథని బ్రాంచ్‌లో రక్తదాన శిబిరం

    పెద్దపల్లి: మంథనిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) 70వ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈసందర్భంగా చీఫ్ మేనేజర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్ సహకారంతో నిర్వహించిన ఈ శిబిరానికి విశేష స్పందన లభించిందని తెలిపారు. కార్యక్రమంలో రీజినల్ మేనేజర్ రవీందర్ కుమార్, హెచ్ఆర్ మేనేజర్ విజయరావు, రక్తదాతలు పాల్గొన్నారు.

  • రైతు వేదికలో విజయోత్సవాలు..

    మహబూబాబాద్: కురవి మండల కేంద్రంలోని రైతువేదికలో మంగళవారం రైతు భరోసా విజయోత్సవాలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ స్పీకర్ డాక్టర్ రాంచందర్ నాయక్ హాజరై మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. గత ప్రభుత్వం పెత్తందారులకు మేలు చేసింది, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పేదలకు మేలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.

  • నేత్రదాత సంస్మరణ సభ

    పెద్దపల్లి: నేత్రదాత ఎంబాడి చంద్రయ్య సంస్మరణ సభను మంగళవారం గోదావరిఖని పరిధిలోని వారి స్వగృహంలో కుటుంబ సభ్యులు, సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచి ఆకుల మహేందర్ పాల్గొని నేత్రదానం చేయడం ద్వారా ఇద్దరు అంధులకు చూపు ఇచ్చిన కుటుంబ సభ్యులకు జ్ఞాపికలు అందజేశారు. నేత్రదానంపై డాక్టర్ భీష్మాచారి అవగాహన కల్పించారు.

  • ‘ఎన్నికల హామీలకు కట్టుబడి పని చేస్తుంది’

    భద్రాద్రి కొత్తగూడెం: అశ్వాపురం మండల కేంద్రంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఓరుగంటి భిక్షమయ్య ఆధ్వర్యంలో రైతు భరోసా సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలకు కట్టుబడి పనిచేస్తుందని తెలియజేశారు. అనంతరం టపాసులు కాల్చి,  మిఠాయిలు పంచారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.

  • రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

    భద్రాద్రి కొత్తగూడెం: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలైన ఘటన మంగళవారం కరకగూడెం మండలం అనంతారం గ్రామంలో వెలుగుచూసింది. గ్రామ శివారులో ఓ టాటా ఏసీ వాహనం అదుపుతప్పి కల్వర్టును ఢీ కొట్టింది. ప్రమాదంలో ఇద్దరికి స్వల్ప గాయాలు అయినట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రులు వరంగల్ జిల్లా నర్సంపేట మండలం బుధరావుపేట గ్రామానికి చెందిన ఆకుల సందీప్, కట్టుకోజుల వరుణ్‌గా గుర్తించారు.

  • ‘హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చింది’

    పెద్దపల్లి: అంతర్గం మండల కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణుల ఆధ్వర్యంలో టపాసులు పేల్చి స్వీట్లతో రైతుపండుగ నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెండ్యాల మహేష్ పాల్గొని మాట్లాడుతూ.. రైతుల కోసం ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందని అన్నారు. రూ.9 వేల కోట్ల రైతు భరోసా ఇచ్చిన సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.