Author: Shivaganesh

  • ‘విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి’

    ములుగు: విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాద్యాయ అన్నారు. సోమవారం వెంకటాపురం మండలం చిరుతపల్లి బాలికల ఆశ్రమ పాఠశాలలో అభయ మిత్ర కార్యక్రమంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత మత్తు పదార్ధాలకు దూరంగా ఉండాలన్నారు. అనంతరం పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పోలీసులు పాల్గొన్నారు.

  • నివాళులు అర్పించిన ఎమ్మెల్యే

    హన్మకొండ: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 55వ డివిజన్ కోమటిపల్లి గ్రామానికి చెందిన కడారి లక్ష్మయ్య ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. సోమవారం ఆయన దశదిన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబసభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

     

  • ధర్మపురి దేవస్థానం రోజువారి ఆదాయ వివరాలు

    జగిత్యాల: ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి సోమవారం రూ.1,35,226 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణ అధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు. వివిధ కార్యక్రమాల టికెట్లు ద్వారా రూ.62,866 రాగా, ప్రసాదాల ద్వారా రూ.56,775, అన్నదానం ద్వారా రూ.15,585 వచ్చినట్లు తెలిపారు. ఏర్పాట్లను ఆలయ సిబ్బంది పర్యవేక్షించినట్లు తెలిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.

     

  • పురుగు మందు తాగి వృద్ధుడి ఆత్మహత్య

    జగిత్యాల: పురుగుల మందు తాగి వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం వెల్గటూర్ మండలం గోడిషలాపేట గ్రామంలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన గంగాధరి కొమురయ్య (70) అనే వృద్ధుడు అనారోగ్యంతో విసిగి పురుగుల మందు ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యులు గమనించి ఆయనను కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

  • ‘యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి’

    జగిత్యాల: ధర్మపురి మండలం మగ్గిడి మోడల్ పాఠశాలలో సోమవారం మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ధర్మపురి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఏ.రామ్ నర్సింహరెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాల వినియోగం వల్ల విద్యార్థుల భవిష్యత్తు తీవ్రంగా దెబ్బతింటుంది. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

  • మొక్కలు నాటిన బీజేపీ నాయకులు

    సంగారెడ్డి: మొగుడంపల్లి మండలం ధనశ్రీ గ్రామంలో సోమవారం డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంగా బీజేపీ నాయకులు మొక్కలు నాట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ జహీరాబాద్ అసెంబ్లీ కన్వీనర్ నౌబాద్ జగన్నాథ్ హాజరై మొక్కలు నాట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ సేవలను కొనియడారు. కార్యక్రమంలోలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

  • ‘ఆసుపత్రిలో సీటీ స్కాన్ సెంటర్ ఏర్పాటు చేయాలి’

    సంగారెడ్డి: జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్ సెంటర్ ఏర్పాటు చేయాలని డాక్టర్‌కు సోమవారం DYFI పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు దుర్గాప్రసాద్, శ్రీకాంత్‌లు వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆస్పత్రిలో అదనంగా మూడు డయాలసిస్ మిషన్లు అందించాలని, కొత్తగా నిర్మిస్తున్న పిల్లల ఆసుపత్రి నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని కోరినట్లు తెలిపారు. సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

  • ‘రెండు రోజుల్లో జీతాలు ఇవ్వాలి’

    సంగారెడ్డి: జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీధర్‌కు సోమవారం సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.మహిపాల్ వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..  కాంట్రాక్ట్ కార్మికులకు మే నెల జీతాలు ఇంకా అందలేదని, దీంతో వారు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రెండు రోజుల్లో జీతాలు ఇవ్వకుంటే విధులు బహిష్కరిస్తామని హెచ్చరించారు. సూపరింటెండెంట్ రెండు రోజుల్లో చెల్లింపులు చేస్తామని హామీ ఇచ్చారు.

  • ‘శ్రీనివాస్ మరణం తీరని లోటు’

    భద్రాద్రి కొత్తగూడెం: సింగరేణి కొత్తగూడెం ఏరియా సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ వంగాల శ్రీనివాస్ (56) సోమవారం హైదరాబాద్‌లో అనారోగ్యంతో మృతిచెందారువారి ఇంటికి సెక్యూరిటీ ఆఫీసర్ అభిలాష వెళ్లి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఆయన మరణం ఎస్ అండ్ పిసి డిపార్ట్‌మెంట్‌కి తీరని లోటని అన్నారు. శ్రీనివాస్ క్రమశిక్షణకు, నిబద్ధతకు మారుపేరుగా నిలిచారని కొనియాడారు.

  • శ్వేతార్కలో చండీ హవనం

    హన్మకొండ: కాజీపేట స్వయంభు శ్రీశ్వేతార్క ములగణపతి దేవాలయంలో సోమవారం చైత్ర మాస శివరాత్రి సందర్భంగా నిత్య మాసోత్సవ చండీ హవనం వైభవంగా నిర్వహించారు. బ్రహ్మశ్రీ మణిశర్మ, రోహిత్ ఉపాధ్యాయ నేతృత్వంలో హోమం చేశారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు హోమంలో పాల్గొని, ప్రసాదం, అన్నదానం స్వీకరించారు. కార్యక్రమంలో దేవాలయ కార్యకర్తలు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.