Author: Shivaganesh

  • ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ

    సంగారెడ్డి: గుమ్మడిదల మండలం కొత్తపల్లి, లక్ష్మాపూర్ గ్రామాల్లో సోమవారం ఆత్మ కమిటీ ఛైర్మన్ కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి, గ్రామ కార్యదర్శి సంతోషితో కలిసి ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సొంత గూడు లేని ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇండ్లు కట్టించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమన్నారు. కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

  • శాశ్వత ఆటో స్టాండ్ ఏర్పాటు

    సంగారెడ్డి: లింగంపల్లి చౌరస్తాలోని నూతన ఫ్లైఓవర్ కింద శాశ్వత ఆటో స్టాండ్ ఏర్పాటు చేయనున్నట్లు సోమవారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఉచిత బస్సుల వల్ల గిరాకీ తగ్గి, ఆటో స్టాండ్ లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న డ్రైవర్ల విజ్ఞప్తి మేరకు, ఎమ్మెల్యే, పోలీసు, NHAI అధికారులతో కలిసి బస్టాండ్ ఏర్పాటు కోసం స్థలాన్ని పరిశీలించారు. వారం రోజుల్లోగా స్టాండ్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

  • మొక్కలు నాటిన పోలీసులు

    సంగారెడ్డి: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో సోమవారం పటాన్‌చెరు పోలీసులు మొక్కలు నాటారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. పర్యావరణ స్పృహను పెంపొందించడంతో పాటు మాదకద్రవ్యాల వాడకంతో కలిగే ప్రమాదాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీఎస్పీ ఎస్.ప్రభాకర్, పటాన్‌చెరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వినాయకరెడ్డి, విశ్వవిద్యాలయం అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.

     

  • ‘సమ్మెను విజయవంతం చేయాలి’

    మెదక్: నర్సాపూర్ అంగన్వాడీ కార్యాలయంలో సోమవారం సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కడారి నాగరాజు సమ్మె నోటీసు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెలో పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేస్తోందని, 29 కార్మిక చట్టాలను రద్దుచేసి, నాలుగు లేబర్ కోడ్‌లను అమలు చేయాలని చూస్తోందని విమర్శించారు.

  • కొత్తగూడలో నివాళులు అర్పించిన బీజేపీ నాయకులు

    మహబూబాబాద్: కొత్తగూడ మండల కేంద్రంలో సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో జన్ సంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు యాదగిరి మురళి పాల్గొని ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కన్న కలలను ప్రధాని నరేంద్ర మోడీ సాకారం చేశారని అన్నారు.

  • సమస్యలు పరిష్కరించాలని వినతి 

    ములుగు: వెంకటాపురం మేజర్ పంచాయితీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సోమవారం బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్‌కు వినతి పత్రం అందజేశారు. అనంతరం పార్టీ మండల అధ్యక్షుడు గంపా రాంబాబు మాట్లాడుతూ..  గ్రామాల్లో వీధి దీపాలు, పారిశుద్ధ్య పనులు, క్లోరినేషన్ చర్యలు లేవని అన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కారించాలని పంచాయతీ కార్యదర్శిని కోరినట్లు తెలిపారు.

  • భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

    హన్మకొండ: నగరంలోని అలంకరణ జంక్షన్ వద్ద సీఎంఏ నిధులతో నిర్మించనున్న ఉమ్మడి జిల్లా మున్నూరుకాపు సంఘ భవన నిర్మాణానికి సోమవారం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజల కోసమే పని చేయలని కృతనిశ్చయంతో ముందుకు వెళ్తున్నానని అన్నారు. నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ సకాలంలో భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

  • 40వ సారి రక్తదానం

    హన్మకొండ: వరంగల్ జిల్లా మనం స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు గోళ్ల రాజేంద్ర ప్రసాద్ సోమవారం హైదరాబాద్ చిరంజీవి బ్లడ్ బ్యాంకులో 40వ సారి రక్తదానం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినీనటుడు చిరంజీవిని ఆదర్శంగా తీసుకొని తాను రక్తదానం చేయడం, బంధుమిత్రులతో కలిసి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం ప్రారంభించినట్లు తెలిపారు.

  • లక్ష్మాపూర్‌లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి వేడుకలు

    మెదక్: రామాయంపేట మండలం లక్ష్మాపూర్‌లో సోమవారం జన్ సంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి కార్యక్రమాన్ని బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు నవీన్ గౌడ్ పాల్గొని ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం నవీన్ గౌడ్ మాట్లాడుతూ.. ఆయన సేవలను కొనియడారు. అనంతరం పార్టీ నాయకులతో కలిసి మొక్కలు నాటారు.

     

  • ప్రైవేటు పాఠశాలలపై కలెక్టర్‌కు ఫిర్యాదు

    సిద్దిపేట: ప్రజావాణిలో కలెక్టర్ కే.హైమావతికి హుస్నాబాద్ పట్టణంలోని ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల కారణంగా విద్యార్థుల పేరెంట్స్ ఎదుర్కొంటున్న సమస్యలపై సోమవారం ఫిర్యాదు చేసిన నియోజకవర్గ బీఎస్పీ ఇన్‌ఛార్జి పచ్ఛిమట్ల రవీందర్ గౌడ్ తెలిపారు. హుస్నాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. సరైన ఆటస్థలం, వసతులు లేని పాఠశాలలపై విచారణ జరిపించాలని కోరినట్లు తెలిపారు.