Author: Shivaganesh

  • ‘ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజావాణి’

    మెదక్: ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని రామాయంపేట తహసీల్దార్ రజనీకుమారి తెలిపారు. సోమవారం ఎమ్మార్వో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. గ్రామాల్లో ప్రభుత్వం పంపిణీ చేసిన బీడీ కార్మికుల ప్లాట్లు అక్రమంగా విక్రయాలు చేస్తున్నారని యాదవ సంఘం సభ్యులు ఫిర్యాదు చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

  • జిల్లా వ్యాప్తంగా రేపు కాంగ్రెస్ నాయకుల సంబరాలు

    మెదక్: జిల్లా వ్యాప్తంగా మంగళవారం కాంగ్రెస్ నాయకులు రైతులతో కలిసి సంబరాలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ తెలిపారు. సోమవారం పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా డబ్బులు చెల్లించినట్లు చెప్పారు. ఈసందర్భంగా రైతులతో కలిసి సంబరాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

  • పదాధికారులకు శిక్షణా కార్యక్రమం

    మెదక్: నర్సాపూర్ మహిళా సమాఖ్య కార్యాలయంలో సోమవారం నూతనంగా ఎన్నికైన గ్రామ సంఘాల పదాధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ప్రాజెక్ట్ మేనేజర్ భీమయ్య, ఏపీఎం గౌరీ శంకర్ పాల్గొన్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. అర్హులైన మహిళలందరినీ సంఘాల్లో చేర్చాలని, పదాధికారులు తమ విధులు, బాధ్యతలు తెలుసుకుని గ్రామ సంఘాలను బలోపేతం చేయాలని సూచించారు.

  • మంత్రి ఉత్తమ్‌ను కలిసిన అడ్లూరి

    జగిత్యాల: ధర్మపురి ఎమ్మెల్యే, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సోమవారం బంజారాహిల్స్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా ఇద్దరు మంత్రులు పరస్పర అభినందనలు తెలుపుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో పరస్పర సహకారంతో ముందుకు సాగుతామని సంయూక్త ప్రకటనలో తెలిపారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

  • నిరుపేద విద్యార్థినికి ఆర్థిక సహాయం

    జగిత్యాల: బీర్పూర్‌ మండలానికి చెందిన గుండ నందిని ఐఐటీ బాసరలో ఇంటర్ 2వ సంవత్సరం చదువుతోంది. తల్లిదండ్రులు లేని కారణంగా విద్యార్థిని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని తెలుసుకొని సోమవారం ధర్మపురికి చెందిన ఎన్నారైలు కొరిడే ఈశ్వర్, సాయి ఏడాదికి రూ.15 వేలు చొప్పున 5 ఏళ్లపాటు సాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చారు. సోమవారం ఎంఈఓ సీతాలక్ష్మి చేతుల మీదుగా రూ.15 వేలు అందజేశారు.

  • డిగ్రీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

    మహబూబాబాద్: ఇంటర్ ఉత్తిర్ణులైన విద్యార్థులు డిగ్రీలో ప్రవేశించడానికి ఈనెల 25తో చివరి తేదీ ముగిస్తుందని కేసముద్రం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా.డి.రాజు  తెలిపారు. విద్యార్థులకు అన్ని రకాల సదుపాయలతో కేసముద్రంలో డిగ్రీ కళాశాలను గత ఏడాది ప్రారంభించినట్లు తెలిపారు. B.Com, B.A, B.Sc, B.zc కోర్సులలో సీట్లు అందుబాటులో ఉన్నాయని, దోస్త్‌లో కేసముద్రం కళాశాలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి దరఖాస్తు చేసుకోవాలన్నారు.

     

     

     

  • ‘డీజిల్ లేక ట్రాక్టర్ తీసే పరిస్థితి లేదు’

    మెదక్: మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు, ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డితో కలిసి సోమవారం చిప్పలతుర్తి గ్రామ సచివాలయాన్ని సందర్శించారు. ఈసందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. డీజిల్ లేక గ్రామపంచాయతీ ట్రాక్టర్‌ను 20 రోజుల నుంచి తీసే పరిస్థితి లేదని అన్నారు. కనీసం చెత్త టాక్టర్లలో డీజిల్ పోయాలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని విమర్శించారు. సఫాయి కార్మికుల జీతాలు వెంటనే అందజేయాలని డిమాండ్ చేశారు.

     

  • ‘మనో ధైర్యం కోల్పోవద్దు’

    సిద్దిపేట: హుస్నాబాద్ మండలం కుచనపల్లి గ్రామంలో బాలవికాస ఆధ్వర్యంలో సోమవారం అంతర్జాతీయ వితంతువుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. మహళల ర్యాలీ, ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు ప్రధానం చేశారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ కేడం లింగమూర్తి పాల్గొని మాట్లాడుతూ.. వితంతువులు మనో ధైర్యం కోల్పోవద్దని అన్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు పాల్గొన్నారు.

  • నివాళులు అర్పించిన బీజేపీ నాయకులు

    సిద్దిపేట: హుస్నాబాద్ గాంధీ చౌరస్తాలో సోమవారం బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సంపత్ నాయక్ పాల్గొని ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

  • వెల్దుర్తిలో మొక్కులు నాటిన బీజేపీ నాయకులు

    మెదక్: వెల్దుర్తి మండలంలో సోమవారం డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో  భాగంగా బీజేపీ పార్టీ నాయకులు మొక్కలు నాటారు. అనంతరం పార్టీ మండల మాజీ అధ్యక్షులు శేఖర్ గౌడ్, మండల అధ్యక్షులు నవీన్ పటేల్ మాట్లాడుతూ.. ఆయన సేవలను కొనియడారు. కార్యక్రమంలో పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నాగరాజు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.