సంగారెడ్డి: గుమ్మడిదల మండల కేంద్రంతో పాటు కానుకుంట, అన్నారం, గ్రామాల్లో సోమవారం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి కార్యక్రమాలను బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గుమ్మడిదల మండల కేంద్రం ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం వద్ద ఆయనకు మండలం బీజేపీ పార్టీ అధ్యక్షుడు కావలి ఐలేష్ నివాళులర్పించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Author: Shivaganesh
-
భూమి పూజలో పాల్గొన్న కార్పొరేటర్
హన్మకొండ: జిల్లా కేంద్రంలోని వడ్డేపల్లిలో సోమవారం ఇందిరమ్మ ఇండ్లకు పూజ కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా స్థానిక కార్పొరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అర్హులందరికి ఇందిరమ్మ ఇండ్లు వచ్చేలా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో హౌసింగ్ కార్పొరేషన్ ఏ.ఈ నరేందర్, డివిజన్ నాయకులు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
-
‘మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి’
పెద్దపల్లి: గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సెక్రెట్ హార్ట్ స్కూల్‌లో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్ పాల్గొని విద్యార్థులకు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. చదువుతో భవిష్యత్తును మెరుగుపరచాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో పోలీసులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
-
నివాళులు అర్పించిన బీజేపీ నాయకులు
హన్మకొండ: జిల్లాలోని వడ్డేపల్లి కోటగడ్డలో సోమవారం జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో డా.శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా సంతోష్ రెడ్డి పార్టీ నాయకులతో కలిసి ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ సేవలను కొనియడారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు పాల్గొన్నారు.
-
‘మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి’
సిద్దిపేట: హుస్నాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎక్సైజ్ సీఐ పవన్, ఎస్సై రూప ఆధ్వర్యంలో సోమవారం మాదక ద్రవ్యాల నిరోధక వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. మాదకద్రవ్యాలను సరఫరా చేస్తే నేరంగా పరిగణించి కేసునమోదు చేస్తామని హెచ్చరించారు. మత్తుపదార్ధాలకు దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ విజయగిరి బిక్షపతి, అధ్యాపకులు పాల్గొన్నారు.
-
గౌరవెల్లిలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి
సిద్దిపేట: అక్కన్నపేట మండలం గౌరవెల్లి గ్రామంలో సోమవారం జన సంఘ్ పార్టీ వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన చిత్రపటానికి వారు నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ సేవలను కొనియడారు. కార్యక్రమంలో బీజేపీ బూత్ అధ్యక్షుడు కొలకాని వెంకటేష్, జంగపల్లి రాజు, నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.
-
హన్మాజీపేటలో అగ్నిప్రమాదం
రాజన్నసిరిసిల్ల : భారీ అగ్నిప్రమాదంతో స్థానికులు భయాందోళనకు గురైన ఘటన సోమవారం వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట గ్రామంలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గొర్రె రాజవ్వ మైసయ్య ఇంట్లో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించి ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. స్థానికుల సమాచారంతో ఫైర్ ఇంజన్ ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
-
ఏడీఈగా బాధ్యతలు స్వీకరించిన అనిల్ కుమార్
రాజన్న సిరిసిల్ల: వేములవాడ సబ్ డివిజన్ సెస్ ఏడీఈగా చిలుముల అనిల్ కుమార్ సోమవారం కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహించిన డి.శ్రీధర్ తంగళ్ళపల్లి సబ్ డివిజన్‌కు బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో అనిల్ కుమార్ జగిత్యాల నుంచి ఇక్కడికి వచ్చారు. ఈసందర్భంగా ఆయనకు సిబ్బంది స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.
-
శ్రీను బాబుకి స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు
హన్మకొండ: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులై దుద్దిళ్ళ శ్రీను బాబుకు కాజీపేట మండల పరిధిలోని మడికొండ సెంటర్‌లో కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. పార్టీ నాయకులు శ్రీనుబాబుకి శాలువా కప్పి, అందజేసి సన్మానించారు. కార్యక్రమంలో 47వ డివిజన్ నాయకులు విజయ్ కుమార్, మాజీ కార్పొరేటర్ చంద్రయ్య, నాయకులు పాల్గొన్నారు.
-
నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు
కరీంనగర్: భారత మాజీ రాష్ట్రపతి వరాహగిరి వెంకటగిరి, కాంగ్రెస్ జాతీయ నాయకుడు సంజయ్ గాంధీల వర్ధంతి సందర్భంగా గాంధీ భవన్‌లో వారి చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు నివాళులు అర్పించాారు. కార్యక్రమంలో ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, కవ్వంపల్లి సత్యనారాయణ, మేయర్ విజయలక్ష్మి, సీడబ్ల్యుసీ సభ్యులు వంశీ చంద్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.