Author: Shivaganesh

  • మొక్కలు నాటిన బీజేపీ నాయకులు

    సంగారెడ్డి: ఐడిఏ బొల్లారం మున్సిపల్ పాత బస్తిలో సోమవారం జనసంఘ్ వ్యవస్థపాకుడు డా.శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సమైక్య భారతం కోసం ప్రాణాలను తృణప్రాయంగా త్యజించిన వ్యక్తి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని కొనియాడారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు రవీందర్‌రెడ్డి, మేఘన రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

     

  • ‘ఆత్మగౌరవానికి బలమైన పునాది వేస్తున్నాం’

    హన్మకొండ: వరంగల్ పశ్చిమ నియోజకవర్గం 59వ డివిజన్ రాయపురలో సోమవారం ఇందిరమ్మ ఇండ్లకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇల్లు అనేది ఒక్క నివాసం కాదని అది ఓ కుటుంబానికి గౌరవం, భద్రత, గుర్తింపు అని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఆత్మగౌరవానికి బలమైన పునాది వేస్తున్నమని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

  • కలెక్టర్‌కు సిరిసపల్లి వాసుల వినతి

    కరీంనగర్: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పమేల సత్పతికి హుజూరాబాద్ మండలం సిరిసపల్లికి చెందిన ప్రజలు వినతిపత్రం అందజేశారు.  ఈసందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ బండ శ్రీనివాస్ మాట్లాడుతూ.. సిర్సపల్లి శివారులో ప్రభుత్వం చేపట్టబోతున్న డంపింగ్ యార్డ్, విద్యుత్తు ఉత్పత్తి కర్మగారాలను నిర్మించవద్దని కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్ ఛైర్మన్ కొండారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

  • శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి బీజేపీ నాయకుల నివాళి

    మెదక్: నర్సాపూర్ బీజేపీ పార్టీ కార్యాలయంలో సోమవారం డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, మున్సిపల్ మాజీ ఛైర్మన్ మురళీధర్ యాదవ్ పాల్గొని ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా మురళీధర్ మాట్లాడుతూ.. ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

     

  • మాంసం షాపుల్లో అధికారుల తనిఖీలు

    జనగామ: జనగామ పట్టణంలోని పలు చికెన్ షాపుల్లో ఆదివారం ఫుడ్ సేఫ్టీ, మున్సిపల్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈసందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ.. రైల్వే స్టేషన్ రోడ్డు, నెహ్రూ పార్క్, బస్టాండ్ రోడ్లోని వివిధ మటన్ షాపులు, చికెన్ షాపులను, టిఫిన్ సెంటర్లను తనిఖీ చేసినట్లు తెలిపారు. ఫుడ్ లైసెన్స్, ట్రేడ్ లైసెన్సు తీసుకొని వ్యాపారం చేసుకోవాలని నిర్వాహకులకు సూచించారు.

  • ఓదెల మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు

    పెద్దపల్లి: జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రమైన ఓదెల శ్రీ మల్లికార్జునస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. స్వామివారి జాతర కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారికి పట్నాలు, బోనాలను సమర్పించారు. ఏర్పాట్లను ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు.

  • ఏకగ్రీవంగా రుద్రంగి లయన్స్ క్లబ్

    రాజన్న సిరిసిల్ల: లయన్స్ క్లబ్ రుద్రంగి 2025-28 సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. లయన్స్ క్లబ్ రుద్రంగి అధ్యక్షుడిగా బండి యాదగిరి, సెక్రటరీగా కొమురె శంకర్, కోశాధికారిగా మంచె రాజేశం ప్రమాణ స్వీకారం చేశారు. ఈసందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు యాదగిరి మాట్లాడుతూ.. సమాజ సేవా కార్యక్రమంలో ముందుండి రుద్రంగి పరిసర గ్రామాలకు సేవా కార్యక్రమాలు అందిస్తామని తెలిపారు.

     

  • సమ్మె కరపత్రాలు ఆవిష్కరించిన నాయకులు

    పెద్దపల్లి: ధర్మారం మండలం ఖిలావనపర్తి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద ఆదివారం తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ మండల కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సీపెల్లి రవీందర్ పాల్గొని జులై 9న నిర్వహించనున్న దేశ వ్యాప్త సమ్మె కరపత్రాలు ఆవిష్కరించారు. సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం నాయకులు పాల్గొన్నారు.

  • ‘మాదకద్రవ్యాలను దరిచేరనీయకండి’

    హన్మకొండ: హన్మకొండ బస్టాండ్లో ఆదివారం మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా ఆర్టీసీ ప్రయాణికులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో హన్మకొండ ఇన్‌స్పెక్టర్ శివకుమార్ మాట్లాడుతూ.. యువత మాదకద్రవ్యాలను దరిచేరనీయవద్దని సూచించారు. ఎవరైనా మాదకద్రవ్యాలు విక్రయించిన, వినియోగించిన పోలీసులకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు.

  • ‘అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి’

    హన్మకొండ: జిల్లా కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామంచ ఐలయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కెఆర్ నాగరాజుపై పాడి కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దళితులను టార్గెట్గా చేసి మాట్లాడే కౌశిక్ రెడ్డికి దళితులు సరైన బుద్ధి చెప్తారన్నారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.