Author: Shivaganesh

  • విరిగిపడ్డ చెట్లు.. తొలగించిన పోలీసులు

    జగిత్యాల: బుగ్గారం మండలంలోని మద్దునూరు శివారులో ఆదివారం సాయంత్రం కురిసిన గాలి వానకు రోడ్డుపై చెట్లు విరిగిపడ్డాయి. సమాచారం అందుకున్న బుగ్గారం హెడ్ కానిస్టేబుల్ వెంకటరమణ, కానిస్టేబుళ్లు శేఖర్, మనోహర్ రోడ్డుకు అడ్డంగా ఉన్న చెట్లను తొలగించి, రాకపోకలకు అంతరాయం లేకుండా చేశారు. ఈసందర్భంగా వారిని ధర్మపురి సీఐ రాం నర్సింహారెడ్డి అభినందించారు.

  • బీజేపీలో 40 కుటుంబాలు చేరిక

    ములుగు: వెంకటాపురం మండలం సుడిబాక గ్రామంలో ఆదివారం బీజేపీ మండల అధ్యక్షుడు రామిల్లరాజశేఖర్ ఆధ్వర్యంలో కేంద్రంలో 11 ఏళ్ల సుపరిపాలనను పురస్కరించుకొని రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్టీ అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం ఆయన సమక్షంలో 40 కుటుంబాలు పార్టీలో చేరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.

     

  • ధర్మపురి దేవస్థానం రోజువారి ఆదాయ వివరాలు

    జగిత్యాల: ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి ఆదివారం రూ.2,74,181 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణ అధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు. వివిధ కార్యక్రమాల టికెట్లు ద్వారా రూ.1,24,814 రాగా, ప్రసాదాల ద్వారా రూ.74,995, అన్నదానం ద్వారా రూ.74,372 వచ్చినట్లు పేర్కొన్నారు. ఏర్పాట్లను ఆలయ సిబ్బంది పర్యవేక్షించినట్లు తెలిపారు.

     

  • ‘మానవ సేవే మహోన్నతం’

    పెద్దపల్లి: రామగుండం వీర్లపల్లిలోని ఈశ్వర కృప వృద్ధాశ్రమాన్ని ఆదివారం జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచందర్ సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మానవ సేవే మహోన్నతమని అన్నారు.  ఆశ్రమ అభివృద్ధికి తన వంతు సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం వృద్ధులకు కొత్త వస్త్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఆశ్రమ అధ్యక్షుడు పిటి స్వామి, డైరెక్టర్లు పాల్గొన్నారు.

     

  • ఏకగ్రీవంగా నూతన కమిటీ ఎన్నిక

    మహబూబాబాద్: కొత్తగూడ మండల కేంద్రంలో ఆదివారం శ్రీగుంజేడు ముసలమ్మ ట్రాక్టర్ ఓనర్స్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక నిర్వహించారు. సంఘం అధ్యక్షుడిగా సిద్దబోయిన భద్రయ్య, ఉపాధ్యక్షుడిగా గుమ్మడి సమ్మయ్య, ప్రధాన కార్యదర్శిగా బోడ బిక్షపతి, కోశాధికారిగా శ్రీరామ్ శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈసందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. సంఘం అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.

  • గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరి మృతి

    కరీంనగర్: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన ఆదివారం శంకరపట్నం మండలం తాడికల్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామంలోని మార్కండేయ కాలనీ వద్ద కనకయ్య అనే రిటైర్డ్ సింగరేణి ఉద్యోగిని గుర్తు తెలియని వాహనం ఢీకొనింది. ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి కేసు నమోదు చేసి సీసీకెమెరాల ఆధారంగా విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.

  • రామగుండంలో ఉచిత వైద్య శిబిరం

    పెద్దపల్లి: రామగుండం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈదునూరి హరిప్రసాద్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ఎమ్మెల్యే మక్కా సింగ్ రాజ్ ఠాకూర్ సేవా కార్యక్రమాల ప్రేరణతో శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపారు. శిబిరంలో వైద్య సిబ్బంది పాల్గొని ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు అందజేశారు. కార్యక్రమంలో డా.రాజేంద్రప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.

  • మత్తు పదార్థాల నిర్మూలనపై అవగాహన

    హన్మకొండ: మట్టేవాడ పోలీసుల ఆధ్వర్యంలో ఆదివారం ఎంజీఎం హాస్పిటల్లో మత్తు పదార్థాల నిర్మూలనపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మట్టేవాడ ఇన్‌స్పెక్టర్ గోపి పాల్గొని మాట్లాడుతూ.. మత్తు పదార్థాలకు ఎవరు బానిసలు కావద్దని సూచించారు. మత్తు పదార్థాలతో జీవితం నాశనం చేసుకోవద్దని, వాటికి దూరంగా ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో ప్రజలు, పోలీసు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

  • ప్రజలకు అవగాహన కల్పించిన పోలీసులు

    వరంగల్: నెక్కొండలో ఆదివారం డ్రగ్స్ వ్యతిరేక వారోత్సవాలను పురస్కరించుకొని ఎస్సై మహేందర్ ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రగ్స్ వినియోగం, విక్రయం ద్వారా కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. అనంతరం పోస్టర్లను ఆటోలపై అతికించారు. ఎవరైనా మత్తు పదార్థాలు వినియోగించిన, విక్రయించిన సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో పోలీసులు, ప్రజలు పాల్గొన్నారు.

  • చెట్లను తొలగించిన పోలీసులు

    వరంగల్: రహదారిపై ఇబ్బందికరంగా మారిన చెట్లను ఆదివారం పోలీసులు తొలగించారు. నెక్కొండ  – నర్సంపేట ప్రధాన రోడ్డు మార్గంలో తుమ్మ చెట్లు వాహనదారులకు ఇబ్బందికరంగా మారాయి. వాటి కారణంగా ఇటీవల ఆ మార్గంలో పలు రోడ్డు ప్రమాదాలు కూడా చోటుచేసుకున్నాయి. ఈక్రమంలో నెక్కొండ ఎస్ఐ మహేందర్ స్పందించిన తన సిబ్బందితో కలసి ప్రమాదకంగా మారిన తుమ్మచెట్లను తొలిగించారు.