Author: Shivaganesh

  • పైప్ లైన్ పనులను ప్రారంభించిన ప్రణవ్

    కరీంనగర్: హుజూరాబాద్ పట్టణ పరిధిలోని దమ్మక్కపేటలో రూ. 20లక్షలతో చేపట్టిన పైప్ లైన్ పనులను ఆదివారం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి వొడితల ప్రణవ్ ప్రారంభించారు.  అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని అన్నారు. ఏళ్లుగా ఎదురుచూస్తున్న ప్రజల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా పరిష్కరిస్తుందని అన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

  • ‘మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి’

    హన్మకొండ: వేలేరు కస్తూర్భ గాంధీ పాఠశాలలో ఆదివారం మాదకద్రవ్యాల నిర్మూలన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్సై అజ్మీర సురేష్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. ఎవరైనా డ్రగ్స్ విక్రయించిన, వినియోగించిన పోలీసులు సమాచారం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో విద్యార్థులు, పోలీసులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

  • కోటిలింగాలలో పురాతన నాణేలు లభ్యం..

    జగిత్యాల: వెల్గటూర్ మండలం కోటిలింగాలలో ఆదివారం పురాతన కాలం నాటి నాణేలు లభ్యమయ్యాయి. గోదావరీనదిలో స్నానాలు చేసేందుకు వచ్చిన ఓ భక్తుడికి 25 పురాతన నాణేలు లభించాయి. కోటేశ్వర స్వామి ఆలయ సమీపంలో కాళేశ్వరం ప్రాజెక్టు లింక్ 2 పనుల్లో భాగంగా గోదావరి సమీపంలో నిల్వ చేసిన మట్టిలో ఈ నాణేలు బయటపడ్డాయి. నాణేలు గోదావరి నదిలో వరదకు కొట్టుకొచ్చినట్టుగా స్థానికులు భావిస్తున్నారు.

  • రాజన్న సన్నిధిలో ఐపీఎస్ పూజలు

    రాజన్న సిరిసిల్ల: వేములవాడ రాజరాజేశ్వర స్వామిని ఆదివారం ఐపీఎస్ నునావత్ ప్రవీణ్ నాయక్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈసందర్భంగా ఆయన స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కోడె మొక్కులు చెల్లించారు. నాగిరెడ్డి మండపంలో ఆలయ అర్చకులు వారికి స్వామివారి ఆశీస్సులు, శేషవస్త్రం, ప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

  • ఇందిరమ్మ ఇంటికి భూమి పూజ

    జగిత్యాల: ధర్మపురి పట్టణంలోని 1వ వార్డులో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు షేక్ ఆర్షియా బేగం ఇంటి నిర్మాణానికి ఆదివారం భూమిపూజ నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దినేష్ పాల్గొన్నారు. ఈసందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ.. మంత్రి లక్ష్మణ్ కుమార్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దినేష్ మాట్లాడుతూ.. అర్హులందరికి ప్రభుత్వ పథకాలు అందుతాయన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

  • ‘వికసిత్ భారత్ దిశగా మోదీ పాలన’

    జగిత్యాల: బుగ్గారం మండలం వెల్గొండ గ్రామంలో ఆదివారం మండల బీజేపీ అధ్యక్షుడు మేడవేణి శ్రీధర్ ఆధ్వర్యంలో “వికసిత్ భారత్ రచ్చ బండ” కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం సహకారంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమైందన్నారు. వికసిత్ భారత్ లక్ష్యం దిశగా ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం 11 ఏళ్లుగా కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.

  • ధర్మపురిలో ఘనంగా పోచమ్మ బోనాలు

    జగిత్యాల: ధర్మపురి పట్టణంలోని న్యూ హరిజన కాలనీ వాసులు ఆదివారం సాయంత్రం పోచమ్మ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. డప్పు చప్పులతో ఊరేగింపు అమ్మవారి ఆలయానికి మహిళలు బోనాలు ఎత్తుకొని వెళ్లారు. అనంతరం పోచమ్మ తల్లి ఆలయానికి వెళ్లి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి భక్తిశ్రద్ధలతో అమ్మవారికి మొక్కులు చెల్లించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొన్నారు.

  • సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత

    మహబూబాబాద్: గూడూరుకు చెందిన చిక్కుల రవళి రాజేష్ అనారోగ్యంతో బాధపడుతూ సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు. ఈక్రమంలో ఆమెకు సీఎంసహాయనిధి నుంచి మంజూరైన రూ. లక్ష ఎల్ఓసీ చెక్కును ఆదివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి కొమ్మలు నాయక్ వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీపాల్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

  • బీఆర్ఎస్ నాయకులతో మాజీ ఎమ్మెల్యే సమావేశం

    మహబూబాబాద్: కురవి మండలం అయ్యగారిపల్లిలో ఆదివారం డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ కురవి, సీరోలు మండలాల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలన్నారు. సమావేశంలో  ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు తోట లాలయ్య, బజ్జూరి పిచ్చిరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

  • నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే

    జగిత్యాల: మల్యాల మండలంలోని పోతారం గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు కొండపలుకుల దామోదర్ రావు ఆదివారం మృతిచెందారు. విషయం తెలుసుకొని వారి ఇంటికి  చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ వెళ్లి ఆయన మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం  ఆయన వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కొండపలుకుల రామ్మోహన్‌రావు, మాజీ ఎంపీపీ ఎడిపల్లి అశోక్, తదితరులు పాల్గొన్నారు.