జగిత్యాల: ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలో శనివారం బీఆర్ఎస్ నాయకుల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పని చేయాలని పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. పార్టీని వదిలిన నాయకులను తిరిగి ఆహ్వానించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
Author: Shivaganesh
-
కుక్కల దాడిలో గొర్రెలు మృతి
కరీంనగర్: కుక్కల దాడిలో గొర్రెలు మృతి చెందిన ఘటన శనివారం హుజూరాబాద్ మండలం ఇప్పలనర్సింగపూర్‌లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పుట్టపాక సమ్మయ్యకు చెందిన గొర్రెల మందపై కుక్కల దాడి చేశారు. కుక్కల దాడిలో ఏడు గొర్రెలు మృతి చెందగా, మరో పది గాయపడినట్లు తెలిపారు. ప్రభుత్వం తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కన్నీటిపర్యంతం అయ్యారు.
-
ధర్మపురి దేవస్థానం రోజువారి ఆదాయ వివరాలు
జగిత్యాల: ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి శనివారం రూ.2,74,520 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణ అధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు. వివిధ కార్యక్రమాల టికెట్లు ద్వారా రూ.1,32,798 రాగా, ప్రసాదాల ద్వారా రూ.1,1,445, అన్నదానం ద్వారా రూ.27,277 వచ్చినట్లు తెలిపారు. ఏర్పాట్లను ఆలయ సిబ్బంది పర్యవేక్షించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
-
ప్రజలకు అవగాహన కార్యక్రమం
పెద్దపల్లి: గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గంగనగర్‌లో శనివారం డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. గంజాయి విక్రయించినా, వినియోగించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో పోలీసులు, ప్రజలు పాల్గొన్నారు.
-
మంత్రికి స్వామివారి ఆశీర్వచనం
జగిత్యాల: హైదరాబాద్ సచివాలయంలో శనివారం ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమశాఖ మంత్రిగా ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఆలయ కార్యనిర్వాహణ అధికారి శ్రీనివాస్, ఛైర్మన్ రవీందర్, కమిటీ సభ్యులు స్వామివారి శేష వస్త్రంతో మంత్రిని సత్కరించి, ప్రసాదం చిత్రపటం అందజేశారు.
-
ధర్మపురిలో ఘనంగా ప్రొ.జయశంకర్ వర్ధంతి
జగిత్యాల: ధర్మపురి పట్టణంలోని నంది చౌరస్తాలో శనివారం తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి కార్యక్రమాన్ని మండల విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా సంఘం నాయకులు ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. తెలంగాణకు ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మండల విశ్వబ్రాహ్మణులు పాల్గొన్నారు.
-
మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన
వరంగల్: వర్ధన్నపేట జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో శనివారం విద్యార్థులకు మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఏసీపీ నరసయ్య పాల్గొని మాట్లాడారు. మాదక ద్రవ్యాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ చందర్, సిబ్బంది పాల్గొన్నారు.
-
బీజేపీ నాయకుల ప్రచారం..
ములుగు: వెంకటాపురం మండల కేంద్రంలోని సున్నం బట్టి వీధిలో శనివారం మండల బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సంక్షేమ కార్యాక్రమాలపై ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు రామెళ్ల రాజశేఖర్ మాట్లాడుతూ.. కేంద్రంలోని మోడి ప్రభుత్వం 11 ఏళ్లపాలనలో చేపట్టిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
-
పైప్ లైన్ పనులు ప్రారంభం
మహబూబాబాద్: గూడూరు మండలం బోడచక్రు తండాలో నీటికొరత సమస్యను పరిష్కరించడానికి స్థానిక మంచినీటి బావి నుంచి భగీరథ వాటర్ ట్యాంక్ వరకు పైపలైన్ నిర్మాణాన్ని శనివారం తండా పెద్దలు, కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రారంభించారు. పల్లేల్లో ఉండే ప్రతి సమస్యను కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పరిష్కరిస్తుందన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, తండా ప్రజలు పాల్గొన్నారు.
-
‘పారిశుద్ధ్య కార్మికులకు మంజూరు చేయాలి’
ములుగు: వెంకటాపురం మండల కేంద్రంలోని ఆర్అండ్‌బి అతిథి గృహం ఆవరణంలో శనివారం ఎంఆర్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ముఖ్యఅతిథిగా పార్టీ జిల్లా ఇన్‌ఛార్జి రమేష్ పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం మొదటి విడతలో ఇందిరమ్మ ఇండ్లను పంచాయితీ పారిశుద్ధ్య కార్మికులకు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పలువురు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.