మంచిర్యాల: చెన్నూర్ పట్టణంలో శనివారం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా యోగా గురువు మాట్లాడుతూ.. యోగాతో అనేక ప్రయోజనాలు చేకూరుతాయన్నారు. నిరాశ, నిస్పృహల నుంచి బయటపడటానికి యోగా ఉపకరిస్తుందన్నారు. ప్రతిఒక్కరూ వారి జీవితంలో యోగాను భాగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Author: Shivaganesh
-
‘యోగా గొప్ప సాధనం’
నిర్మల్: బాసర మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి అశోక్ కుమార్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్యవంతమైన జీవనానికి యోగా గొప్ప సాధనం అని అన్నారు. కార్యక్రమంలో ఎంపీఓ గంగాసింగ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
-
బాధిత కుటుంబానికి ఆడే గజేందర్ పరామర్శ
ఆదిలాబాద్: సోనాల మండలం సాకేరా గ్రామానికి చెందిన విశ్రాంత హిందీ ఉపాధ్యాయుడు సకారం ఇటీవల అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకొని శనివారం వారి ఇంటికి బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి ఆడే గజేందర్ వెళ్లి ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
-
అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే
కరీంనగర్: బెజ్జంకి మండలంలోని వడ్లూరు గ్రామంలో నిర్మించిన అంగన్‌వాడీ భవనాన్ని శనివారం మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు. అనంతరం బెజ్జంకి మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధికి నిరంతం కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
-
ట్రెక్కింగ్ చేసిన అధికారులు..
మహబూబాబాద్: గూడూరు డివిజన్ అటవీశాఖ డివిజనల్ అధికారి చంద్రశేఖర్ సమక్షంలో శనివారం అన్ని రేంజ్‌ల సిబ్బందితో ట్రెక్కింగ్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పక్షులు, వన్యప్రాణుల ఆవాసాలు, వివిధ అటవీ వృక్షసంపద, క్షేత్ర స్థాయిలో రక్షణ చర్యలు మొదలైన వాటిని గుర్తించడానికి సిబ్బందికి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎఫ్ఆర్ఓ సురేష్, సిబ్బంది పాల్గొన్నారు.
-
పురుగుల మందుతాగి ఒకరి ఆత్మహత్య
ములుగు: పురుగుల మందుతాగి ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం వెంకటాపురం మండలం ఎదిరలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన కారం పవన్‌కళ్యాణ్ (26) గతకొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. శనివారం మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వాలని కుటుంబసభ్యులతో గొడవపడి, పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
-
ఘనంగా యోగా దినోత్సవం
యాదాద్రి భువనగిరి: గుండాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ గంధం చంద్రకళ మాట్లాడుతూ.. ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాలంటే ప్రతిఒక్కరూ వారి జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని అన్నారు. ఆసనాల ద్వారా ఆరోగ్యంగా జీవించవచ్చాన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
-
రైతుల ఖాతాల్లో రూ.592.55 కోట్లు
నల్గొండ: జిల్లాలో రైతు భరోసా పథకం కింద శనివారం వరకు 4,97,280 మంది రైతులకు రూ. 592.55 కోట్లు జమ చేసినట్లు కలెక్టర్ ఇలాత్రిపాఠి తెలిపారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. నిధులు విడతల వారీగా రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయని పేర్కొన్నారు. వ్యవసాయ సాగుకు పెట్టుబడిగా ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆర్థిక సహాయాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
-
‘యోగాపై ఆసక్తిని పెంచుకోవాలి’
నల్గొండ: ప్రకాష్‌నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథులు విద్యార్థులు సీపీఎం టూటౌన్ కార్యదర్శి భావండ్ల పాండు పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు చిన్నప్పటి నుంచి యోగాపై ఆసక్తిని పెంచుకోవాలని సూచించారు. యోగాతో అనేక ప్రయోజనాలు చేకూరుతాయన్నారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
-
ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
నల్గొండ: మిర్యాలగూడ మండలం యాదగిరిపల్లి జడ్పీహెచ్ఎస్ స్కూల్‌లో శనివారం ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్పెషల్ ఆఫీసర్ జె వెంకటరెడ్డి, ఎంపీడీవో శేషగిరిశర్మలు హాజరయ్యారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. యోగాతో శారీరక, మానసిక ఆనందం కలుగుతుందన్నారు. విద్యార్థులు చిన్నతనం నుంచే యోగాను జీవితంలో ఒక భాగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.