Author: Shivaganesh

  • విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగ్‌లు

    ఆదిలాబాద్: సత్నాల మండలం జామినీ పాఠశాలలో విద్యార్థులకు శనివారం ఉచితంగా స్కూల్ బ్యగ్‌లు అందజేశారు. సామాజిక కార్యకర్త ముడుపు మౌనీష్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ బ్యాగ్‌లు, బుక్స్ అందజేశారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులను సన్మానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు మంచిగా చదువుకొని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

  • ఓదెల హైస్కూల్‌లో అపూర్వ సమ్మేళనం

    పెద్దపల్లి: ఓదెల మండల కేంద్రంలోని హైస్కూల్‌లో 1999-2000 బ్యాచ్ పూర్వ విద్యార్థులు శనివారం సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా వారు విద్యాబుద్ధులు నేర్చుకున్న పాఠశాలకు కృతజ్ఞతగా రూ.30 వేలు విలువైన యాంప్లిఫైయర్, స్పీకర్ బాక్స్, మైక్ సెట్‌ను బహుకరించారు. కార్యక్రమంలో ఎంఈఓ రమేష్, హెచ్‌ఎం లక్ష్మీనారాయణ, పాఠశాల ఛైర్మన్ వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు, పూర్వవిద్యార్థులు పాల్గొన్నారు.

  • బయ్యారంలో మంత్రి పొంగులేటి పర్యటన

    మహబూబాబాద్: బయ్యారం మండలంలోని పలు గ్రామాల్లో శనివారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ఈసందర్భంగా ఆయన పలువురు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అర్హులందరికి ప్రభుత్వ పథకాలు అందుతాయన్నారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామస్థులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

  • ‘జీవితంలో యోగాను భాగం చేసుకోవాలి’

    పెద్దపల్లి: రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాభ్యాస శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. యోగా శిక్షకుడు గణేష్ నేతృత్వంలో మున్సిపల్, మెప్మా సిబ్బంది యోగాసనాలు చేశారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పి.వి. రామన్ పాల్గొని మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ వారి జీవితంలో యోగాను భాగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

  • ‘యోగాతో మానసిక ఆరోగ్యం’

    పెద్దపల్లి: రామగుండం కార్పొరేషన్ దుర్గానగర్‌లోని ఆర్కే గార్డెన్స్‌లో శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రామగుండం బీజేపీ ఇన్‌ఛార్జి కందుల సంధ్యారాణి హాజరై మాట్లాడారు. యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

  • పేలుడు పదార్థాలు స్వాధీనం..

    వరంగల్: పేలుడు పదార్థాలను శనివారం పోలీసులు పట్టుకున్న ఘటన పర్వతగిరి మండలంలోని గోపనపల్లి గ్రామంలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన రైతు అశోక్ తన వ్యవసాయ పొలంలో బండరాళ్లను పగులగొట్టడానికి ఎలాంటి అనుమతులు లేకుండా పేలుడు పదార్థాలను వినియోగిస్తున్నారనే సమాచారం మేరకు ఎస్సై భోగం ప్రవీణ్ సిబ్బందితో వెళ్లి తనిఖీ చేశారు. 90 జిలెటిన్ స్టిక్స్, 39 డిటోనేటర్‌లు లభ్యమైనట్లు వెల్లడించారు.

  • ఘనంగా యోగా దినోత్సవం

    నిర్మల్: బాసర మండల కేంద్రంలోని హంసవాహిని ప్రైవేటు పాఠశాలలో శనివారం ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ ఓంకార్ మాట్లాడుతూ.. ప్రతిరోజు యోగా చేయడం వల్ల ఏలాంటి ఒత్తిళ్లు లేకుండా ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉంటామని అన్నారు. ప్రతి ఒక్కరూ వారి జీవితంలో యోగాను భాగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు.

  • ‘ఆపరేషన్ కగార్‌ను తక్షణమే నిలిపివేయాలి’

    పెద్దపల్లి: గోదావరిఖని పైలాన్ చౌరస్తాలో శనివారం సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీ రాష్ట్ర సదస్సుకు సంబంధించిన వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈసందర్భంగా పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి నరేష్ మాట్లాడుతూ… ఆపరేషన్ కగార్ పేరుతో జరుగుతున్న హత్యాకాండను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తక్షణమే నిలిపివేయాలన్నారు. ఈనెల 25న వరంగల్‌లో జరగనున్న పార్టీ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

     

  • ఎమ్మెల్యే చిత్రపటానికి క్షీరాభిషేకం 

    కరీంనగర్: రామడుగు మండల కేంద్రంలో శనివారం యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అనుపురం పరుశురాం గౌడ్ ఆధ్వర్యంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్(ATC)ను రామడుగు మండలానికి మంజూరు చేయించిన నేపథ్యంలో ఎమ్మెల్యే చిత్రపటానికి క్షీరాభిషేకం చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

  • వర్షాల కోసం ఆదివాసీ మహిళల పూజలు

    ఆదిలాబాద్: సిరికొండ మండలం కోసుపటేల్‌గూడ గ్రామ ఆదివాసీ మహిళలు శనివారం వర్షాల కోసం వినూత్న పూజలు చేశారు. ఈసందర్భంగా వారు గ్రామంలోని వాగులో పవిత్ర జలాలు సేకరించి, మూడు కిలోమీటర్లు కాలినడకన సుంకిడిలోని శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి స్వామివారికి అభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పంటలు తిరిగి జీవం పోసుకోవాలని కోరుతూ ఐదు రోజుల పాటు ఉపవాసం ఉండనున్నట్లు తెలిపారు.