సిద్దిపేట: భూపరిహారం విషయాన్ని కలెక్టర్‌కు విన్నవించుకుందామని వచ్చిన ఓరైతు గుండె కలెక్టరేట్‌లో ఆగింది. సిద్దిపేట రూరల్ మండలం, వెంకటాపూర్ కు చెందిన బాలకృష్ణయ్య(55) మల్లన్న సాగర్ కెనాల్ నిర్మాణం కోసం 2019లో తన రెండున్నర ఎకరాల భూమిని ఇచ్చారు. అప్పటినుంచి పరిహారం కోసం అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. పరిహారం అందక నిరాశతో ఉన్న ఆయన, కలెక్టరేట్‌లో గుండెపోటుతో కుప్పకూలిపోయి మరణించారు.
Author: Shivaganesh
-
బీజేపీ నాయకుల ముందస్తు అరెస్ట్..
మెదక్: నర్సాపూర్ మండల కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులు మల్లేష్ గౌడ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు చంద్రయ్య, కార్యదర్శి రాజును పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఈసందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ.. మార్వాడి వ్యాపారులను బయటకు పంపడం పద్ధతి కాదని, దేశంలో ఎవరైనా, ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చని అన్నారు. మార్వాడి వ్యతిరేకంగా బంధు పాటించడాన్ని తప్పు పట్టారు.
-
డెంగ్యూతో 20 నెలల చిన్నారి మృతి
జనగామ: డెంగ్యూతో 20 నెలల చిన్నారి మృతి చెందిన ఘటన గురువారం స్టేషన్ ఘన్‌పూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన 20 నెలల చిన్నారి సాత్విక వారం రోజులుగా టైఫాయిడ్ జ్వరానికి చికిత్స పొందుతుంది. తర్వాత చిన్నారికి డెంగ్యూ నిర్ధారణ అయింది. ఈక్రమంలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఉన్న ఒక్కగానోక్క కూతురు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
-
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి
వరంగల్: వరంగల్ తూర్పు నియోజకవర్గంలో గురువారం పలు అభివృద్ధి పనులకు మంత్రి శ్రీమతి కొండా సురేఖ శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడానికి నిరంతరం కృషి చేస్తామన్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలను పాటించాలన్నారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
-
మంచి మనసు చాటుకున్న ట్రాఫిక్ ఎస్సై
పెద్దపల్లి: ఓ ట్రాఫిక్ ఎస్సై తన మంచి మనసును చాటుకున్నారు. పెద్దపల్లి నుంచి మంచిర్యాల వైపు వెళ్తున్న ఆటో నుంచి ఒకరు కిందపడి ప్రాణాపాయ స్థితికి వెళ్లారు. గోదావరిఖని మున్సిపల్ చౌరస్తా వద్ద విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ ఎస్సై జి.హరిశేఖర్ వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో క్షతగాత్రుడి ప్రాణాలు నిలిచాయి. హరిశేఖర్‌ను ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు, ఇన్‌స్పెక్టర్ బి.రాజేశ్వరరావు ప్రశంసించారు.
-
‘యూరియా కొరతపై వదంతులను నమ్మవద్దు’
మెదక్: యూరియా కొరతపై వదంతులను నమ్మవద్దని రైతులకు కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. ఈసందర్భంగా ఆయన రామాయంపేటలో మీడియాతో మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా రైతులకు సరిపడా యూరియా వారం రోజుల్లో అందుబాటులోకి వస్తుందని చెప్పారు. కొంతమంది రైతులు యూరియా నిల్వ చేసుకోవడంతోనే కొరత ఏర్పడుతుందని పేర్కొన్నారు. యూరియాను బ్లాక్ మార్కెట్‌కు తరలించినా, అక్రమంగా నిల్వ చేసిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
-
జిల్లాలో ‘పనుల జాతర-2025’ ప్రారంభం కానుంది..
మెదక్: పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ‘పనుల జాతర-2025’ కార్యక్రమం ప్రారంభం కానుందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. గ్రామీణాభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు ఈనెల 22న అభివృద్ధి పనులను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రారంభోత్సవానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమం ద్వారా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.
-
కలెక్టర్‌ను కలిసిన ఏడీ అనిల్ కుమార్
మెదక్: జిల్లా ఖజానా శాఖ సహాయ సంచాలకులుగా (A.D) అనిల్ కుమార్ మరాటి బాధ్యతలు స్వీకరించారు. గురువారం ఆయన కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి, ట్రెజరీ కార్యకలాపాలను పారదర్శకంగా నిర్వహిస్తానని తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన అనిల్ కుమార్ మరాటికి ట్రెజరీ కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఉప కోశాధికారి ఎస్.వేణుగోపాల్, జూనియర్ అకౌంటెంట్ యాదగిరి, సిబ్బంది పాల్గొన్నారు.
-
నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం
కరీంనగర్: భగత్‌నగర్ నగరంలోని పలు ప్రాంతాలకు శుక్రవారం విద్యుత్తు సరఫరాలో అంతరాయం తలెత్తుందని నగర రెండో ఏడీఈ ఎం.లావణ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు సంతోష్ నగర్, భాగ్యనగర్, సెయింట్ జాన్ పాఠశాల ప్రాంతం, కొత్త లేబర్ అడ్డా, సాయిబాబా దేవాలయం, జ్యోతినగర్, గీతాభవన్ వెనుక భాగం, తదితర ప్రాంతాలకు సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు.
-
నేడు అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు
హన్మకొండ : హన్మకొండ జిల్లా అథ్లెటిక్స్ సంఘం ఆధ్వర్యంలో జిల్లాస్థాయి ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు సంఘం కార్యదర్శి సారంగపాణి ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో అండర్-14, 16, 18, 20 బాలబాలికలకు వివిధ విభాగాల్లో పోటీలు ఉంటాయన్నారు. ఆసక్తి ఉన్న అథ్లెట్లు ఉదయం 10 గంటలకు జేఎన్ స్టేడియంలో రిపోర్టు చేయాలని సూచించారు.