మంచిర్యాల: జైపూర్ మండలం టేకుమట్ల గ్రామ పంచాయతీని శనివారం జిల్లా పంచాయితీ అధికారి డి.వేంకటేశ్వరరావు సందర్శించారు. ఈసందర్భంగా ఆయన అంతర్జాతీయ యోగా డే సందర్భంగా రైతు వేదిక వద్ద మొక్కలు నాటారు. అనంతరం ఆయన గ్రామంలో నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తడిపొడి చెత్తలను వేరువేరుగా సేకరించాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
Author: Shivaganesh
-
హత్య కేసులో నిందితులు అరెస్ట్
మహబూబాబాద్: సిరోల్ మండలకేంద్రంలో ఈనెల 18న సొంత అన్నను హత్య చేసిన నిందితులను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. సీరోల్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో తొర్రూరు డీఎస్పీ కృష్ణ కిషోర్ వివరాలు వెల్లడించారు. మండలకేంద్రానికి చెందిన వల్లపూ లింగయ్య కుమారులు భూవివాదంలో ఘర్షణపడగా, వారిలో కృష్ణ హత్యకు గురయ్యారు. హత్యకు పాల్పడిన నాలుగురిని అరెస్టు చేయగా, ఒకరు పరారైనట్లు తెలిపారు.
-
బూరుగుపల్లిలో ఘనంగా యోగా దినోత్సవం
కరీంనగర్: గంగాధర మండలం బూరుగుపల్లిలోని ఎల్లమ్మ ఆలయ ప్రాంగణంలో శనివారం ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రిటైర్డ్ సీఐ సాగి సుధాకరరావు పాల్గొని మాట్లాడుతూ.. రోజూ యోగా చేస్తే శారీరక, మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ వారి జీవితంలో యోగాను భాగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కళ్యాణ్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
-
‘ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి’
కొమురం భీమ్: ఆసిఫాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ కె.వి రాజశేఖర్ శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిపో పరిధిలోని ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా విహార యాత్రలకు కల్పిస్తున్న బస్ సౌకర్యాలను సద్వినియోగ చేసుకోవాలని కోరారు. బాలాజీ భీమ్ విహారయాత్రకు ఈనెల 27న ఆర్టీసీ బస్సులను ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 6300489162, 9959226006 నంబర్లను సంప్రదించాలని కోరారు.
-
‘సంపూర్ణ ఆరోగ్యానికి యోగా అవసరం’
కరీంనగర్: గంగాధర మండలం ఒద్యారం ప్రభుత్వ పాఠశాలలో శనివారం ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మండల విద్యాధికారి ఏనుగు ప్రభాకర్ రావు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంపూర్ణ ఆరోగ్యానికి యోగా అవసరమని అన్నారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యంగా ఉండవచ్చని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
-
‘ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలి’
నిర్మల్: కిర్గుల్(బి) గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో శనివారం ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా హెచ్ఎం బలగం నరేష్ మాట్లాడుతూ.. ఆరోగ్యకరమైన సమాజం కోసం ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ప్రధాని మోదీ యోగాను దేశంలోనే కాకుండా ప్రపంచమంతా వ్యాపింపజేసి, యోగా విశిష్టతను చాటారని కొనియాడారు.
-
యోగాతో ఆరోగ్యవంతమైన జీవితం: వీసీ
నిర్మల్: బాసర ఆర్జీయూకేటీలో శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా వీసీ గోవర్ధన్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యోగాను ఆరోగ్యవంతమైన జీవితానికి గొప్ప సాధనంగా అభివర్ణించారు. యోగా మానసిక ఉల్లాసం, ఒత్తిడి నివారణకు తోడ్పడుతుందని వివరించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు, యోగా శిక్షకురాలు శ్రీలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
-
ప్రతి రోజు పాఠశాలకు రావాలి: డీఈఓ
ఆదిలాబాద్: తలమడుగు మండల కేంద్రంతో పాటు సుంకిడి రుయ్యడి పాఠశాలలను శనివారం డీఈఓ శ్రీనివాస్ సందర్శించారు. ఈసందర్భంగా ఆయన 10 వ తరగతి విద్యార్థులతో మాట్లాడి వారికి పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి రోజు పాఠశాలకు రావాలని, ఏరోజు చెప్పిన పాఠ్యాంశాలను ఆ రోజే చదవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓ వెంకట్‌రావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
-
‘యోగాను జీవితంలో భాగం చేసుకోవాలి’
మహబూబాబాద్: సీరోలు మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా స్థానిక తహసీల్దార్ పూర్ణచందర్ పాల్గొని విద్యార్థులు, పాఠశాల సిబ్బందితో కలిసి యోగా చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యోగా శారీరక, మానసిక ఉల్లాసాన్ని కలిస్తుందన్నారు. ప్రతిరోజు యోగా చేయడాన్ని జీవితంతో ఒక భాగంగా చేసుకోవాలన్నారు.
-
‘యోగాతో ఆరోగ్యంగా ఉంటారు’
మహబూబాబాద్: కురవి మండలం రాజోలు ప్రభుత్వ పాఠశాలలో శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల సిబ్బంది, విద్యార్థులతో పిడి కాశీనాథ్ యోగా శిక్షణను నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యోగాతో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. యోగాతో మనిషి జీవితంలో అనేక ప్రయోజనాలు ఉంటాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ వారి జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.