Author: Shivaganesh

  • ‘యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి’

    కామారెడ్డి: బిచ్కుంద డిగ్రీ కళాశాలలో శుక్రవారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కె.అశోక్ పాల్గొని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండి దేశాభివృద్ధిలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

  • రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలు

    కామారెడ్డి: రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలైన ఘటన శుక్రవారం రాత్రి బీర్కూరు మండలం సంబపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. బిర్కూర్ పోతాంగల్ రోడ్డు మీద  ప్రదీప్  అనే యువకుడికి రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే స్థానికులు 108 అంబులెన్స్‌లో బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

  • ‘యోగా దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తి’

    నిజామాబాద్: బోధన్‌లోని టీటీడీ కల్యాణ మండపంలో శనివారం ఉదయం 6 గంటలకు అంతర్జాతీయ యోగా దినోత్సవం జరగనుంది. ఈసందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. కార్యక్రమానికి సబ్ కలెక్టర్ వికాస్, ఏసీపీ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణతో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. యోగా దినోత్సవంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

     

  • ‘రిక్వెస్ట్ బస్ స్టాప్ ఏర్పాటు చేస్తాం’

    కామారెడ్డి: జిల్లాలోని బాన్సువాడ నుంచి గాంధారి మీదుగా కామారెడ్డి వెళ్లే ఎక్స్‌ప్రెస్ బస్సు మేడిపల్లి వద్ద ఆగడం లేదు. ఇటీవల గ్రామస్తులు సమస్యను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన స్పందించి బాన్సువాడ డిపో మేనేజర్‌తో సమస్య గురించి మాట్లాడి పరిష్కరించాలని కోరారు. స్పందించిన మేనేజర్ మేడిపల్లిలో రిక్వెస్ట్ స్టాప్ ఏర్పాటు చేసి బస్సుసేవలు అందిస్తామని హామీ ఇచ్చారు.

  • వాహన తనిఖీలు చేసిన పోలీసులు

    ములుగు: వెంకటాపురం మండల కేంద్రంలో శుక్రవారం పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ప్రొబేషనరీ ఎస్సై తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో సీఆర్పీఎఫ్ సిబ్బంది, సివిల్ పోలీసులు తనిఖీలు చేశారు. ఈసందర్భంగా తిరుపతి రెడ్డి మాట్లాడుతూ.. వాహనదారులు కచ్చితంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ సిబ్బంది, సివిల్ పోలీసులు, తదితరులు పాల్గొన్నారు.

  • ధర్మపురి దేవస్థానం రోజువారి ఆదాయ వివరాలు

    జగిత్యాల: ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి శుక్రవారం రూ. 1,05,146 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణ అధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు. వివిధ కార్యక్రమాల టికెట్లు ద్వారా రూ.49,950 రాగా, ప్రసాదాల ద్వారా రూ.38,620, అన్నదానం ద్వారా రూ.16,576 వచ్చినట్లు పేర్కొన్నారు. ఏర్పాట్లను ఆలయ సిబ్బంది పర్యవేక్షించారు.

  • ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ

    సంగారెడ్డి: గుమ్మడిదల మండలం కొత్తపల్లి, లక్ష్మాపూర్ గ్రామాల్లో శుక్రవారం ఆత్మ కమిటీ ఛైర్మన్ కొత్తపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీడీవో ఉమాదేవితో కలిసి ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ పాలన సాగుతుందని అన్నారు. అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. కార్యక్రమంలో అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

  • రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

    సంగారెడ్డి: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందిన ఘటన శుక్రవారం సదాశివపేట పట్టణంలో వెలుగుచూసింది. సదాశివపేట వైపు నుంచి జహీరాబాద్ వైపు వెళ్తున్న ఓ బైక్‌ను గుర్తు తెలియని వాహనం ఎంఆర్‌ఎఫ్ పరిశ్రమ సమీపంలో ఢీకొనింది. ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. కేసు నమోదు చేసినట్లు పట్టణ పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

  • ఇంటింటి ఫీవర్ సర్వే

    ములుగు: వెంకటాపురం మండల పరిధిలోని చొక్కాల, విఆర్కెపురం, శివాపురం, తిప్పాపురం, ఆలుబాక, వీరభద్రవరం గ్రామాల్లో శుక్రవారం వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఇంటింటి ఫీవర్ సర్వే నిర్వహించారు. ఈసందర్భంగా వైద్య సిబ్బంది మాట్లాడుతూ.. ఇంటింటికి వెళ్లి ఇంట్లో ఎంత మంది కుటుంబ సభ్యులు ఉంటున్నారు, వారిలో ఎవరైన ఫీవర్‌తో బాధ పడుతున్నారా అనే విషయాను అడిగి తెలుసుకున్నాడు. కార్యక్రమంలో వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

  • ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేత

    కరీంనగర్: మానకొండూర్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో శుక్రవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. ప్రారంభోత్సవ అనంతరం ఆయనను బీజేపీ మండల మాజీ  అధ్యక్షుడు రాపాక ప్రవీణ్ మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం ప్రవీణ్ మాట్లాడుతూ.. గ్రామంలో గ్రంథాలయం, ఓపెన్ జిమ్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు.