Author: Shivaganesh

  • రామగుండంలో బీజేపీ రచ్చబండ కార్యక్రమం

    పెద్దపల్లి: రామగుండం ఓల్డ్ అశోక్ థియేటర్ వద్ద శుక్రవారం బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వ 11 ఏళ్ల విజయోత్సవం సందర్భంగా రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. వికసిత్ భారత్ సంకల్ప సాకార కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన రచ్చబండలో రామగుండం బీజేపీ ఇన్‌ఛార్జి కందుల సంధ్యారాణి పాల్గొని మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ నాల్గొవ అతిపెద్ద ఆర్థికశక్తిగా ఎదిగిందని అన్నారు.

  • ‘రామగుండం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది’

    పెద్దపల్లి: రామగుండం అభివృద్ధి పథంలో వేగంగా దూసుకుపోతుందని ఎమ్మెల్యే ఎంఎస్. రాజ్ ఠాకూర్ తెలిపారు. శుక్రవారం ఆయన రూ.2 కోట్లతో ఎన్‌టీపీసీ హెలిప్యాడ్ ట్యాంక్ నుంచి నర్రశాలపల్లి పాఠశాల వరకు సీసీ రోడ్డు నిర్మాణానికి ఎంపీ గడ్డం వంశీ కృష్ణతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తామన్నారు. కార్మికుల ఫించన్ పెంపు కోసం చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

  • వంట సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు

    జగిత్యాల: ధర్మపురి మండల విద్యా వనరుల కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్న భోజన వంట సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు RBSK మెడికల్ అధికారులు డా.వెంకటేష్, ఉమామహేశ్వరి ఆధ్వర్యంలో సిబ్బంది పరీక్షలు చేశారు. ఈసందర్భంగా ఎంఈఓ సీతాలక్ష్మి మాట్లాడుతూ.. ఆరోగ్య పరీక్షలతో వంట సిబ్బందికి వారి ఆరోగ్యంపై అవగాహన కల్పించామన్నారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

  • ‘పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలి’

    జగిత్యాల: ధర్మపురి పట్టణ కేంద్రంలో శుక్రవారం కలెక్టర్‌ ప్రసాద్‌ పర్యటించారు. ఈసందర్భంగా ఆయన స్థానికంగా ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణ పెండింగ్ పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ధర్మపురి ఇన్‌ఛార్జ్‌ ఎమ్మార్వో సుమన్, ఎంపీడీవో, ఆర్‌ఎంవో, తదితర అధికారులు పాల్గొన్నారు.

  • ప్రభుత్వ హాస్టల్‌ను తనిఖీ చేసిన కమిషనర్

    జగిత్యాల: ధర్మపురి పట్టణంలో 100 రోజుల ప్రణాళికలో భాగంగా శుక్రవారం మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో జ్యోతిరావు ఫులే డిగ్రీ బాయ్స్ హాస్టల్‌‌ను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన హాస్టల్‌లో వినియోగిస్తున్న సరుకులు, కూరగాయల నాణ్యతను పరిశీలించి, శుభ్రతను పాటించాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం పట్టణంలోని పర్యటించి తడిపొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పించారు.

  • వరంగల్‌లో బాంబు బెదిరింపు కాల్

    వరంగల్‌: హనుమకొండ, వరంగల్‌ జిల్లా న్యాయస్థానాలకు బాంబు బెదిరింపు కాల్‌ రావడం శుక్రవారం కలకలం రేపింది. న్యాయస్థానాల్లో బాంబు పెట్టామంటూ గుర్తుతెలియని వ్యక్తి బెదిరింపు కాల్‌ చేశారు. వెంటనే కోర్టు సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన పోలీసులు బాంబు స్క్వాడ్‌ సాయంతో కోర్టు ప్రాంగణాల్లో తనిఖీలు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

  • మెడికల్ కాలేజీకి మృతదేహం

    వరంగల్: తిమ్మాపూర్ బృందావన్ కాలనీకి చెందిన దాచేపల్లి నరేందర్ (75) ఇటీవల అనారోగ్యంతో మరణించారు. వారి కుమార్తె దాచేపల్లి రజిని సమాజహితం కోసం, వైద్యవిద్య నిమిత్తం, కాకతీయ మెడికల్ కాలేజీకి తన తండ్రి మృతదేహాన్ని దానం చేసేందుకు ముందుకు వచ్చారు. అవయవ, శరీర దాతల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆమె తన తండ్రి మృతదేహాన్ని కాలేజీకి అందజేశారు. కార్యక్రమంలో కేఎంసీకి ప్రిన్సిపల్ డా.రాంకుమార్ రెడ్డి పాల్గొన్నారు.

  • ‘ఓపెన్ జిమ్‌లను సద్వినియోగం చేసుకోవాలి’

    జగిత్యాల: మెట్‌పల్లి మండలం వెల్లుల్లలో రూ. ఐదు లక్షలతో నిర్మించిన ఓపెన్ జిమ్‌లను శుక్రవారం కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువత, విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికిలోనై అనారోగ్యం బారిన పడుతున్నారని అన్నారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌లను యువత, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

  • ‘ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోవాలి’

    జగిత్యాల: జిల్లా కేంద్రంలోని లింగంపేట వార్డును శుక్రవారం కలెక్టర్ బీ సత్యప్రసాద్ పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధుల నియంత్రణకు ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాబోయే రెండు నెలల పాటు పారిశుద్ధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఈనెల 25 వరకు జిల్లాలోని అన్ని మండలాల్లో RMO లు సీజనల్ వ్యాధులపై అవగాహన సమావేశాలు నిర్వహించాలన్నారు.

  • ఎమ్మెల్యేకు సీపీఐ నాయకుల వినతి

    హన్మకొండ: హన్మకొండ కనకదుర్గ కాలనీలోని ఎమ్మెల్యే నివాసంలో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని నియోజకవర్గ సీపీఐ నాయకులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్బంగా వారు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో అర్హులైన సీపీఐ కార్యకర్తలకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.