Author: Shivaganesh

  • పెద్దత్మ తల్లి సేవలో ఆది శ్రీనివాస్

    రాజన్న సిరిసిల్ల: వేములవాడ పట్టణం మహాలక్ష్మీ వీధిలోని పెద్దమ్మ తల్లిని శుక్రవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దర్శించుకున్నారు. అనంతరం నిర్వహించిన బోనాల మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమ్మవారి దీవెనలతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

  • రాజన్నను దర్శించుకున్న శివసేనారెడ్డి

    రాజన్న సిరిసిల్ల: వేములవాడ రాజరాజేశ్వర స్వామివారిని శుక్రవారం రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనా రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయనకు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు, ఆశీర్వచనం అందించారు. వేములవాడలో ఇండోర్ స్టేడియం, మూడపెల్లిలో క్రికెట్ మైదానం, సిరిసిల్లలో మినీ స్టేడియం కోసం స్థలపరిశీలన చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో  ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు.

  • శివాజీ నగర్ మార్కెట్ అభివృద్ధికి రూ.1.20 కోట్లు

    పెద్దపల్లి: గోదావరిఖని శివాజీ నగర్ డైలీ మార్కెట్ అభివృద్ధికి రూ.1.20 కోట్లు మంజూరు అయినట్లు శుక్రవారం రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్. రాజ్ ఠాకూర్ తెలిపారు. ఈసందర్భంగా ఆయన మార్కెట్‌ను పరిశీలించి మాట్లాడారు. మార్కెట్ అభివృద్ధికి టీఈయూఎఫ్‌ఐడీసీ ద్వారా రూ.1.20 కోట్లతో రోడ్లు, డ్రైనేజ్, షేడ్స్ నిర్మాణ పనులు ప్రారంభించామన్నారు. పనుల నిమిత్తం మార్కెట్‌ను తాత్కాలికంగా ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు.

  • మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రం

    జగిత్యాల: ధర్మపురి మున్సిపల్ కమిషనర్‌ను శుక్రవారం బీజేపీ పట్టణ అధ్యక్షుడు గాజు భాస్కర్ ఆధ్వర్యంలో నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. గోదావరి తీరంలోని స్మశానవాటికలో అసౌకర్యాలు తొలగించి మరమ్మతులు చేయాలని మున్సిపల్ కమిషనర్‌ను కోరినట్లు తెలిపారు.  కార్యక్రమంలో బీజేపీ నాయకులు తిర్మందాస్, మాధవ్, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.

  • ‘అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాం’

    పెద్దపల్లి: గోదావరిఖని 13వ డివిజన్ విటల్‌నగర్‌లో గురువారం సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. అభివృద్ధే ధ్యేయంగా, ప్రజల సహకారంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

  • ఇందిరమ్మ రాజ్యంలో అర్హులందరికి ఇండ్లు

    హన్మకొండ: నగరంలోని కాపువాడలో శుక్రవారం సీసీ రోడ్లు, సైడ్‌డ్రైన్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యంలో అర్హులందరికి ఇండ్లు అందేలా చూడటం తమ ప్రభుత్వ ధ్యేయం అని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

  • కాంగ్రెస్ నాయకుడికి ఎమ్మెల్యే పరామర్శ

    హన్మకొండ: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 44వ డివిజన్ భట్టుపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు అంకేశ్వరపు నాగేష్ గురువారం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. స్థానికులు ఆయనను హన్మకొండలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. విషయం తెలుసుకొని శుక్రవారం ఎమ్మెల్యే నాగరాజు ఆస్పత్రికి వెళ్లి నాగేష్‌ను  పరామర్శించారు. వారి కుటుంబానికి ధైర్యం చెప్పి, వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలన్నారు.

  • పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

    పెద్దపల్లి: గోదావరిఖని రామ్‌నగర్‌లో గురువారం రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..  నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో  పలువురు కాంగ్రెస్ నాయకులు, స్థానికులు, తదితరులు పాల్గొన్నారు.

  • సింగరేణి సీఎండీకి వినతి

    పెద్దపల్లి: హైదరాబాద్‌లో శుక్రవారం సింగరేణి సీఎండీ బలరాం నాయక్‌ను ఐఎన్‌టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ నేతృత్వంలోని బృందం మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మారుపేర్ల సమస్య, మెడికల్ బోర్డు లోపాలు, Dismissed కార్మికులకు మరో అవకాశం, హైదరాబాద్‌లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం, తదితర అంశాలపై సీఎండీతో చర్చించినట్లు తెలిపారు. సీఎండీ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

     

     

     

     

     

  • దత్తాత్రేయ స్వామికి కిలో వెండి అందజేత

    నిర్మల్: ఖానాపూర్ మండలం బాదనకుర్తి గ్రామపంచాయతీ పరిధిలోని చింతలపేట దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని గురువారం కోరుట్ల పట్టణం 32 వ వార్డు మాజీ కౌన్సిలర్ జిందం మణి – లక్ష్మీనారాయణ దంపతులు దర్శించుకున్నారు. అనంతరం వారు స్వామివారికి కిలో వెండిని విరాళంగా అందజేశారు. అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో అర్చకుడు రాజశేఖర్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.