Author: Shivaganesh

  • 11 వాహనాలు సీజ్..

    జగిత్యాల: గొల్లపల్లిలో నంబర్ ప్లేట్‌లు లేకుండా తిరుగుతున్న వాహనాలపై పోలీసులు దృష్టి సారించారు. గురువారం ఎస్ఐ చిర్ర సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో 11 వాహనాలు సీజ్ చేశారు. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ.. నేరాల నివారణకు ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని పేర్కొన్నారు. అనుమానాస్పద వ్యక్తులపై సమాచారం కోసం డయల్ 100ను సంప్రదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

  • నివాళులు అర్పించిన మాజీ మంత్రి

    జగిత్యాల: వెల్గటూర్ మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మెరుగు అశోక్ మాతృమూర్తి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. గురువారం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ వారి ఇంటికి వెళ్లి ఆమె చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబాన్ని పరామర్శించి, ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు రాంచందర్ గౌడ్, భరత్, తదితరులు పాల్గొన్నారు.

     

  • నూగూరులో అవగాహన సదస్సు

    ములుగు: వెంకటాపురం మండల పరిధిలోని నూగూరు గ్రామంలో గురువారం కాఫెడ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కుల మతాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పంచాయితీ కార్యదర్శి వేణు హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కులానికి, మతానికి ఉన్న తేడాలను వివరించారు. ప్రజలందరూ సమానం అని అన్నారు. కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

  • అట్టహాసంగా క్రిస్టియన్ ఫెలోషిప్ కార్యక్రమం

    హన్మకొండ: కాజీపేట ఆల్ఫా ఒమేగా చర్చి క్రిస్టియన్ ఫెలోషిప్ ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిషప్ డేనియల్ హాజరై మాట్లాడుతూ.. కాజీపేట క్రిస్టియన్ ఫెలోషిప్ ఉన్నత ఆశయాలతో, భావాలతో క్రైస్తవ సమాజానికి, ప్రజలకు గొప్ప సేవలు అందించాలని అన్నారు. కొత్త తరాన్ని నాయకత్వంలోకి తీసుకొని ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో చర్చి కార్యవర్గం పాల్గొన్నారు.

  • 45 పాఠశాలలకు వంట పాత్రలు అందజేత

    ములుగు: వెంకటాపురం మండలంలోని 45 పాఠశాలలకు మధ్యాహ్నం భోజన పథకంలో భాగంగా వంట పాత్రలు మంజూరైయ్యాయి. గురువారం వాటిని పాఠశాల హెచ్ఎంలకు ఎంఈఓ జీవీవీ సతయనారాయణ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వంట పాత్రను జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

  • గ్రామాల్లో దోమల మందు స్ప్రేయింగ్

    ములుగు: వెంకటాపురం మండల పరిధిలోని మల్లపురం, కర్రావానిగూంపు గ్రామాల్లో గురువారం వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో దోమల మందు స్ప్రేయింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా హెల్త్ అసిస్టెంట్ రాఘవులు మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రతి ఇంటికి దోమల మందు స్ప్రేయింగ్ చేయడానికి గ్రామస్థులు సహకరించాలని కోరారు. స్ప్రేయింగ్ కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామాల్లో నిర్వహిస్తారని తెలిపారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.

  • మొక్కలు నాటిన సంధ్యారాణి

    పెద్దపల్లి: రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అడ్డగుంటపల్లిలో గురువారం పర్యావరణ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మొక్కలునాటే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బీజేపీ రామగుండం ఇన్‌ఛార్జి కందుల సంధ్యారాణి పాల్గొని వికసిత్ భారత్ అమృత్ కాల్, మోదీ పాలన 11 ఏండ్లను పురస్కరించుకొని మొక్కలు నాటారు. అనంతరం ప్రజలకు ప్రకృతి పరిరక్షణపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో నాయకులు కళ్యాణ్, రమేష్, అపర్ణ తదితరులు పాల్గొన్నారు.

     

  • ‘దేశవాప్త సమ్మెను విజయవంతం చేయాలి’

    పెద్దపల్లి: రామగుండం ఎన్టీపీసీలోని యూనియన్ కార్యాలయంలో గురువారం ఐఎన్టీయూసీ జాతీయ నాయకులు బాబర్ సలీం పాషా  మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా మోదీ ప్రభుత్వం కేంద్రంలో కార్మిక నిరంకుశ పరిపాలన కొనసాగిస్తుందన్నారు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

  • స్వచ్ఛ పర్యవేక్షణ కార్యక్రమం

    పెద్దపల్లి: రామగుండం కార్పొరేషన్ పరిధిలోని ఎలకలపల్లిగేట్ జీపీలో గురువారం స్వచ్ఛ పర్యవేక్షణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో సానిటేషన్ ఎస్సై రంగు నాగభూషణ్ పాల్గొని ఇంటింటికి వెళ్లి తడి, పొడి చెత్తను వేరుగా స్వచ్ఛ వ్యాన్‌లో వేయాలని ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సూపర్వైజర్ శ్రీనివాస్,  మాజీ కార్పొరేటర్ కందుల సతీష్, పారిశుద్ధ్య కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.

  • బోయిన్‌పేట్‌లో బీజేపీ సంకల్ప సభ

    పెద్దపల్లి: మంథని మున్సిపల్ పరిధి బోయిన్‌పేటలో గురువారం బీజేపీ పట్టణ అధ్యక్షుడు సబ్బాని సంతోష్ ఆధ్వర్యంలో సంకల్ప సభ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కొండపాక సత్య ప్రకాష్, జిల్లా కౌన్సిల్ మెంబర్ బోగోజు శ్రీనివాస్, నాయకులు పాల్గొన్నారు.