Author: Shivaganesh

  • ‘సమ్మెను జయప్రదం చేయాలి’

    పెద్దపల్లి: మంథని విద్యార్థి యువత కార్యాలయంలో గురువారం సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు బూడిద గణేష్ అధ్యక్షతన కార్మిక సంఘాల జేఏసీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో పలువురు నాయకులు పాల్గొని మాట్లాడుతూ.. జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు ముత్యంరావు, రాజేందర్, ఆకుల వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

     

  • ‘సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి’

    ములుగు: సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారి జ్యోతి అన్నారు. గురువారం వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నూగూరు, కొండాపురం గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించారు. శిబిరంలో వైద్యాధికారి జ్యోతి పాల్గొని గ్రామస్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి, మందులను అందజేశారు. అనంతరం పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు ఆశీష మనోహర్, హెల్త్ సూపర్‌వైజర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

  • ఈనెల 23న జిల్లాకు రానున్న మంత్రి పొంగులేటి

    మహబూబాబాద్: ఈనెల 23న జిల్లాకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రానున్నట్లు ఎమ్మెల్యే మురళీ నాయక్ తెలిపారు. గురువారం ఆయన స్థానిక మెడికల్ కాలేజ్ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను 23న మంత్రి ప్రారంభించనున్నట్లు తెలిపారు. మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

  • వృద్ధాశ్రమంలో అన్నదానం

    హన్మకొండ: యువ నేతాజీ ఫౌండేషన్ వరంగల్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలోని స్వయంకృషి మహిళా సొసైటీ వృద్ధాశ్రమంలో అన్నదానం నిర్వహించారు. ఈసందర్భంగా ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ.. హన్మకొండకు చెందిన కర్నే సాయిప్రత్యూష జ్ఞాపకార్థం ఆమె భర్త రాధాకృష్ణ, కుమార్తె అద్వికల సహకారంతో అన్నదానం నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.

  • రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

    హన్మకొండ: కాంగ్రెస్ అగ్రనాయకులు, ఎంపీ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను గురువారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదానం శిబిరాన్ని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, రాష్ట్ర మీడియా, కమ్యూనికేషన్ ఛైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈసందర్భంగా రక్త దాతలకు సర్టిఫికేట్స్ అందజేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.

  • అమ్మమాట అంగన్‌వాడీ బడిబాట

    పెద్దపల్లి: జనగామ-1 సెంటర్‌లో గురువారం “అమ్మ మాట – అంగన్‌వాడీ బడిబాట” కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సూపర్వైజర్ సరస్వతి పాల్గొని ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. 3 ఏండ్ల వయస్సు వచ్చిన పిల్లలను అంగన్‌వాడీ కేంద్రాలకు పంపాలని సూచించారు. అనంతరం 10 మంది చిన్నారులకు అక్షరాభ్యాసం చేశారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

  • లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు అందజేత

    కరీంనగర్: హుజూరాబాద్ పట్టణ పరిధిలోని 2, 17 వ వార్డులో గురువారం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి వొడితల ప్రణవ్ పర్యటించారు. ఈసందర్భంగా ఆయన పలువురు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అర్హులందరికి ప్రభుత్వ పథకాలు అందుతాయన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

  • ‘ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకోవాలి’

    కరీంనగర్: తిమ్మాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఆధ్వర్యంలో గురువారం రామక్రిష్ణకాలనీలో ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్డుల నమోదు ప్రక్రియ నిర్వహించారు. కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి పాల్గొని మాట్లాడుతూ.. అర్హులైన వారందరు ఆయుష్మాన్ కార్డులను తీసుకోవాలని అన్నారు. వాటితో అనేక ప్రయోజనాలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ సంపత్, ఏఎన్ఎం రాణి, ఆశా కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

  • మంత్రి పొన్నంను కలిసిన లక్ష్మణ్ కుమార్

    జగిత్యాల: మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గురువారం హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా వారు పరస్పర శాఖల కార్యాచరణ, సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధిపై కీలక చర్చలు జరిపారు. అనంతరం మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. ధర్మపురి నియోజకవర్గంలో బస్సు డిపో మంజూరు చెయ్యాలని పొన్నంను కోరారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

  • ‘రెండు నెలలుగా వేతనాలు అందలేదు’

    మహబూబాబాద్: కురవి శ్రీవీరభద్రస్వామి పుణ్యక్షేత్రాన్ని గురువారం రాష్ట్ర అర్చక ఉద్యోగ జేఏసీ కన్వీనర్ డివిఆర్ శర్మ దర్శించుకున్నారు. ముందుగా ఆయన స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన ఆలయ అర్చక ఉద్యోగులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. రెండు నెలలుగా వేతనాలు అందలేదన్నారు, ఒకే శాఖ ఒకే వేతన విధానాన్ని అమలు చేయాలన్నారు.