Author: Shivaganesh

  • విద్యుదాఘాతంతో లైన్‌మెన్‌కు తీవ్రగాయాలు

    వరంగల్: విద్యుదాఘాతంతో లైన్‌మెన్‌కు తీవ్రగాయాలైన ఘటన గురువారం పర్వతగిరి మండలం జమాల్‌పురం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన లైన్‌మెన్ బదవత్ బాలు గ్రామంలో విద్యుత్తు పనులు చేస్తుండగా ప్రమాదశాత్తు కరెంట్ సరఫరా కావడంతో విద్యుదాఘాతానికి గురై తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే ఆయనను 108 అంబులెన్స్‌లో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

  • మురళీధర్‌ను కలిసిన గౌడ సంఘం సభ్యులు

    వరంగల్: పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలో గురువారం జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ సూపరిండెంట్ మురళీధర్ పర్యటించారు. ఈసందర్భంగా ఆయనను స్థానిక గౌడ సంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కల్లెడ గీత సహకార సంఘం భూమిని ఎవరు కబ్జా చేయలేదని, సంఘం సభ్యులు అమ్ముకున్నారని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. పూర్తి వివరాలు మరోసారి వివరిస్తామని తెలిపారు.

  • గోదావరిఖనిలో ట్రాఫిక్ నియమాలపై అవగాహన

    పెద్దపల్లి: గోదావరిఖని ప్రదాన చౌరస్తాలో గురువారం వన్ టౌన్ పోలీసులు రెయిన్ బో పాఠశాల విద్యార్థులతో కలిసి ట్రాఫిక్ నియమాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా వారు ట్రాఫిక్ నియమాలు, హెల్మెట్, డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాలు, రోడ్ సేఫ్టీపై వాహనదారులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాజేశ్వరరావు, ఎస్ఐ హరిశేఖర్, విద్యార్థులు పాల్గొన్నారు.

     

  • పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

    హన్మకొండ: వరంగల పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని 60వ డివిజన్ బ్యాంక్ కాలనీ, టీచర్స్ కాలనీ ఫేస్- 1 లో నూతన కల్వర్ట్ పనులకు గురువారం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పనులు ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ పనులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.

  • ‘సమ్మెను విజయవంతం చేయాలి’

    పెద్దపల్లి: గోదావరిఖనిలో గురువారం సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. జూలై 9న జరిగే అఖిల భారత సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమ్మెలో సంఘటిత, అసంఘటిత కార్మికులు పెద్దఎత్తున పాల్గొనాలని కోరారు. సమావేశంలో సంఘం సభ్యులు పాల్గొన్నారు.

  • ‘రేవంత్ రెడ్డి ఓట్ల రాజకీయం చేస్తున్నారు’

    హన్మకొండ: జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం మాజీ ఎమ్మెల్యే  పెద్ది సుదర్శన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోదావరి బనకచర్ల లింకు ప్రాజెక్టు వల్ల ఉమ్మడి వరంగల్ జిల్లా ఎడారిగా మారనున్నట్లు తెలిపారు. నాట్లకు నాట్లకు మధ్య కేసీఆర్ రైతుబంధు ఇస్తే, రేవంత్ రెడ్డి ఓట్లకు ఓట్లకు మధ్య ఇస్తూ ఓట్ల రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.

  • విద్యార్థులకు ఉచిత బ్యాగులు పంపిణీ

    హన్మకొండ: కాజీపేట మండలం అయోధ్యపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను గురువారం ఫ్రెండ్స్ ఫర్ బీయింగ్ హెల్పింగ్ హ్యాండ్ సర్వీస్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు సందర్శించారు. ఈసందర్భంగా స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు భోగి మహేందర్ సంస్థ ప్రతినిధులు మహేష్, విజయ్, రఫీలతో కలిసి విద్యార్థులకు బ్యాగులు అందజేశారు. వారి మిత్రుడు గోరె మహేష్ ఆర్థిక సాయంతో బ్యాగులు, బాక్సులు అందజేసినట్టు మహేందర్ పేర్కొన్నారు.

  • ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ

    హన్మకొండ: వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 60వ డివిజన్ వడ్డేపల్లి, 58వ డివిజన్ ఎస్సీ కాలనీ,  57వ డివిజన్ సమ్మయ్యనగర్ కాలనీలో గురువారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పాల్గొని భూమిపూజ చేశారు. నియోజకవర్గంలో నిజమైన అర్హులకు ఇండ్లు కేటాయించామని అన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

  • ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

    రాజన్న సిరిసిల్ల: వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్‌లో గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరై కేక్ కట్ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వేములవాడ రాజన్న ఆశీస్సులు వారిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.

  • మినీ జేసీబీని ప్రారంభించిన ఎమ్మెల్యే

    పెద్దపల్లి: రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో రూ.30 లక్షలతో మినీ జేసీబీ చైన్ మిషన్‌ను కొనుగోలు చేసి గురువారం ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ పాల్గొని జేసీబీని ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చే దిశగా ఇది కీలక ముందడుగని చెప్పారు. కార్యక్రమంలో మేయర్, కమిషనర్, కౌన్సిలర్లు, పాల్గొన్నారు.