వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ నూతన కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన చాహత్ బాజ్ పాయ్ బుధవారం పోలీసు కమిషనర్ సన్ ప్రీత్ సింగ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. అనంతరం ఇరువురు అధికారులు వరంగల్ కార్పొరేషన్, పోలీస్ కమిషనరేట్‌కు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
Author: Shivaganesh
-
వనదేవతల హుండీ లెక్కింపు
ములుగు: తాడ్వాయి మండలం మేడారం వనదేవతల హుండీల లెక్కింపు బుధవారం నిర్వహించారు. దేవాదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో 20 హుండీలను లెక్కించారు. సమ్మక్క హుండీ ఆదాయం రూ.18,36,233, సారలమ్మ హుండీ ఆదాయం రూ.16,59,383, పగిడిద్దరాజు హుండీ ఆదాయం రూ.72,289, గోవిందరాజులు హుండీ ఆదాయం రూ.81,469 వచ్చినట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. వనదేవతల 20 హుండీల మొత్తం ఆదాయం రూ.36,49,368 అని పేర్కొన్నారు.
-
‘భూభారతితో భూసమస్యలు పరిష్కారం’
కరీంనగర్: చిగురుమామిడి మండలంలోని రామంచ గ్రామంలో బుధవారం భూభారతి రెవెన్యూ సదస్సు నిర్వహించారు. సదస్సులో ముఖ్యఅతిథిగా అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతుల భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా భూభారతి రెవెన్యూ అవగాహన సదస్సులను నిర్వహిస్తుందన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆర్డీవో మహేశ్వర్, అధికారులు పాల్గొన్నారు.
-
కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ప్రణవ్
కరీంనగర్: హుజూరాబాద్ మండల పరిధిలోని శాలపల్లి-ఇందిరానగర్ గ్రామంలో బుధవారం బీరన్న కామరాతి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి వొడితల ప్రణవ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.
-
పెద్దపల్లి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన సీపీ
పెద్దపల్లి: పెద్దపల్లి పోలీస్ స్టేషన్‌ను బుధవారం కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన ఫిర్యాదులపై చర్యలు, పెండింగ్ కేసుల పురోగతి, రిసెప్షన్ పనితీరును సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నేరచరిత్ర కలిగినవారిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. వాహన తనిఖీలు, రోడ్డు ప్రమాద నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులతో కలిసి మొక్కను నాటారు.
-
సింగరేణికి జాతీయ గుర్తింపు
పెద్దపల్లి: సింగరేణికి జాతీయ గుర్తింపు వచ్చినట్లు బుధవారం సీఎండీ ఎన్.బలరామ్ తెలిపారు. ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICMAI) ప్రకటించే నేషనల్ అవార్డ్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఇన్ కాస్ట్ మేనేజ్మెంట్–2024 లో మెగా పరిశ్రమల విభాగంలో సింగరేణి సంస్థకు మూడో బహుమతి లభించినట్లు పేర్కొన్నారు. ఈనెల 23న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో అవార్డు ప్రదానం జరగనుందని వెల్లడించారు.
-
బాధిత కుటుంబానికి ప్రమాదబీమా అందజేత
కరీంనగర్: గంగాధర మండలం కురిక్యాల గ్రామానికి చెందిన ఒగ్గురి ప్రశాంత్ ఇటీవల విద్యుదాఘాతంతో మృతి చెందారు. ఆయనకు గంగాధర ఎస్‌బిఐ బ్యాంక్‌లో జనరల్ ఇన్సూరెన్స్ ఉంది. బుధవారం బాధిత కుటుంబలకు ప్రమాదానికి సంబంధించిన ఇన్సూరెన్స్ రూ.20 లక్షల చెక్‌ను రీజనల్ మేనేజర్ వెంకటేశ్, బ్రాంచ్ మేనేజర్ వంశిధర్, అందజేశారు. కార్యక్రమంలో మృతుడి భార్య ఉమ, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
-
ఆర్జీ-1లో యోగా దినోత్సవ వేడుకలు
పెద్దపల్లి: ఆర్జీ-1 జీఎం కార్యాలయంలో బుధవారం యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ముందస్తు యోగా శిబిరంలో పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. జిడికె ఇంక్లైన్‌లు, వర్క్‌షాప్, హాస్పిటల్, సెక్యూరిటీలో యోగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈసందర్భంగా యోగా శిక్షకులు మాట్లాడుతూ.. ఆరోగ్యం, ఏకాగ్రతకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
-
విద్యార్థులకు అవగాహన సదస్సు
కరీంనగర్: గంగాధర మండలం నరేంద్ర విద్యాలయంలో బుధవారం విద్యార్థులకు డ్రగ్స్ నిర్ములన, సైబర్ నేరాలపై ఎస్సై వంశీకృష్ణ అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గంజాయి, డ్రగ్స్‌కు బానిస అయితే అనారోగ్యం బారిన పడుతారని అన్నారు. అనవసర మెసేజ్, లింక్ వంటివి ఓపెన్ చేయవద్దన్నారు. కార్యక్రమంలో ట్రైనీ ఎస్సై స్వాతి, పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
-
ఓదెలలో నేత్రదాత పోచమ్మ సంస్మరణ సభ
పెద్దపల్లి: ఓదెల గ్రామంలో బుధవారం నేత్రదాత రాచర్ల పోచమ్మ సంస్మరణ సభను సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో డా.భీష్మాచారి ముఖ్య అతిథిగా హాజరై నేత్రదానంపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం పోచమ్మ కుటుంబ సభ్యులకు జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొని ఆమె చిత్రపటానికి నివాళులు అర్పించారు.