Author: Shivaganesh

  • సొంత తమ్ముళ్ల చేతిలో అన్న హత్య

    మహబూబాబాద్: అన్నను తమ్ముళ్లు హత్య చేసిన ఘటన బుధవారం సీరోల్‌లో వెలుగుచూసింది. మండల కేంద్రానికి చెందిన వల్లపూ లింగయ్య అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు ముగ్గురు కుమారులు ఉన్నారు. లింగయ్య తనకున్న 16 ఎకరాల భూమిని తన కుమారుల పేరుమీద పట్టా చేయించారు. గెట్టు పంచాయతీలో తమ్ముళ్లు అన్న వల్లపూ కృష్ణ (43)ను హత్య చేశారు. తీవ్రంగా గాయపడిన తండ్రి స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

  • ప్రభుత్వ పాఠశాలలో బడిబాట కార్యక్రమం

    ములుగు: వాజేడు మండలం నాగారంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పాఠశాల హెచ్ఎం సోయం ఆనందరావు మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు పర్యావరణ ప్రాముఖ్యత, మొక్కల పెంపకం ఆవశ్యకత గురించి వివరించారు.  కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

  • ‘యోగా దినోత్సవాన్ని జయప్రదం చేయాలి’

    హన్మకొండ: జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్‌లో బుధవారం ప్రముఖ యోగా గురువు పోశాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సభ్యులు యోగా దినోత్సవానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 20న హైదరాబాద్‌ ఎల్‌బీ స్టేడియంలో ఉదయం 6 నుంచి 7 గంటల వరకు జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీవైసీసీ సభ్యులు పాల్గొన్నారు.

     

  • ‘మహిళ దాడి హేయమైన చర్య’

    నిజామాబాద్: జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్‌లో బుధవారం ఆర్.ఎం.పి,పి, .ఎం.పి ల నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈనెల 16న నిర్వహించిన ర్యాలీలో జరిగిన ఘటన తమకు ఆందోళన కలిగించిందన్నారు. ఆర్ఎంపీ వైద్యుడుగా కొనసాగుతున్న అశోక్‌పై మహిళ దాడి చేయడం హేయమైన చర్యని పేర్కొన్నారు. అశోక్‌కు మద్దతుగా సీపీకి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.

     

  • రేషన్ దుకాణాలను తనిఖీ చేసిన కలెక్టర్

    కామారెడ్డి: బాన్సువాడ మండల కేంద్రంలోని పలు రేషన్ దుకాణాలను బుధవారం కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన రేషన్ దుకాణాల్లో ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యం పంపిణీ తీరును పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బియ్యం పంపిణీని త్వరగా పూర్తి చేయాలని, ప్రజలందరికి సన్న బియ్యం అందేలా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

  • వెల్నెస్ సెంటర్‌ను సందర్శించిన కలెక్టర్

    కామారెడ్డి: నసురుల్లాబాద్ మండలంలోని నెమలి గ్రామంలోని వెల్నెస్ సెంటర్‌ను బుధవారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సబ్ సెంటర్ ద్వారా ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్‌మై, డీఎంహెచ్‌ఓ చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

  • ఏకగ్రీవంగా పీఎంపీ అసోసియేషన్ ఎన్నిక

    నిజామాబాద్: మెండోరా మండల పీఎంపీ నూతన కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షుడిగా k.శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా పి.గోపి, కార్యదర్శిగా టీ.మురళీధరస్వామి ఎన్నికయ్యారు. సంఘం జాయింట్ కార్యదర్శిగా యూ.నరేష్, కోశాధికారిగా జి.ప్రభాకర్, సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం అభివృద్ధికి కృషి చేస్తామని నూతన కమిటీ సభ్యులు తెలిపారు.

  • నిజామాబాద్‌లో బీజేపీ కిసాన్ మోర్చ సమావేశం

    నిజామాబాద్: జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో బుధవారం కిసాన్ మోర్చ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి హాజరై మాట్లాడారు. పసుపు రైతులకు ఎంపీ ధర్మపురి అరవింద్ ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు పసుపు బోర్డు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈనెల చివరిన కేంద్ర హోం మంత్రి అమిత్‌షా దానిని ప్రారంభించనున్నట్లు తెలిపారు.

  • విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్

    కామారెడ్డి: బాన్సువాడ మండలం కొయ్యగుట్టలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను బుధవారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సందర్శించారు. ఈసందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు సృజనాత్మక కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి, తదితరులు పాల్గొన్నారు.

  • ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ

    కామారెడ్డి: నిజాంసాగర్ మండలం సుల్తాన్‌నగర్‌లో బుధవారం ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారుల ఇండ్లకు భూమి పూజ చేశారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ ముఖ్య అతిథిగా పాల్గొని భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అర్హులందరికి ప్రభుత్వ పథకాలు అందుతాయన్నారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.