Author: Shivaganesh

  • ఆస్పత్రిని సందర్శించిన సాయికుమార్

    వరంగల్: కాకతీయ మెడికల్ కళాశాల ఆవరణలోని కాకతీయ సూపర్ స్పెషాలిటీ హాస్పిట‌ల్‌ను బుధవారం న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సాయికుమార్ సందర్శించారు. ఈసందర్భంగా ఆయన విభాగాల వారీగా రోగులకు అందుతున్న సేవల వివరాలను వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రోగులతో మాట్లాడి అందుతున్న వైద్యసేవల గురించి ఆరా తీశారు. సేవలను మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులకు సూచించారు.

  • ఈతకు వెళ్లి బాలిక మృతి

    మహబూబాబాద్: ఈతకు వెళ్లి బాలిక మృతి చెందిన ఘటన బుధవారం గంగారం మండలం కోమట్లగూడెం గ్రామంలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన మూతి శ్రావణి(12) అనే బాలిక తన స్నేహితులతో కలిసి కోమట్లగూడెం పెద్ద చెరువులో ఈతకు వెళ్లింది. ప్రమాదవశాత్తు ఆమె నీటి గుంతలో ముని మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

  • ధర్మపురిలో కొత్త విద్యుత్తు స్తంభాల ఏర్పాటు

    జగిత్యాల: ధర్మపురి పట్టణం 3వ వార్డులో బుధవారం నూతన విద్యుత్తు స్తంభాలు ఏర్పాటు చేశారు. పట్టణంలోని 15 వార్డుల్లో విద్యుత్తు స్తంభాల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సహకారంతో రూ.26 లక్షలు మంజూరయ్యాయని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ లావణ్య లక్ష్మణ్, దేవస్థాన ఛైర్మన్ రవీందర్, నాయకులు పాల్గొన్నారు.

  • సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

    జగిత్యాల: మెట్‌పల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాలకు చెందిన 41 మందికి సీఎం సహాయనిధి నుంచి మంజూరైన ఎల్ఓసీ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ పాల్గొని చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం సహాయనిధి పేదప్రజలకు గొప్పవరం అని అన్నారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

  • ఇంటి పన్ను తగ్గించాలి బీఆర్ఎస్ నాయకుల వినతి

    జగిత్యాల: ధర్మపురి మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్‌ను బుధవారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. మున్సిపాలిటీ పరిధిలో పెంచిన ఇంటి పన్ను తగ్గించాలని వినతిపత్రం అందజేసినట్లు పేర్కొన్నారు. కొత్తగా పెరిగిన పన్నులతో పేద, మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఛైర్మన్ సత్తమ్మ, తదితరులు పాల్గొన్నారు.

  • ధర్మపురి దేవస్థానం రోజువారి ఆదాయ వివరాలు

    జగిత్యాల: ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి మంగళవారం రూ.1,87,857 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణ అధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు. వివిధ కార్యక్రమాల టికెట్లు ద్వారా రూ.1,18,582 రాగా, ప్రసాదాల ద్వారా రూ.46,080, అన్నదానం ద్వారా రూ.23,195 వచ్చినట్లు తెలిపారు. ఏర్పాట్లను ఆలయ సిబ్బంది పర్యవేక్షించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించుకున్నారు.

     

  • నేర సమీక్ష నిర్వహించిన ఎస్పీ

    నల్గొండ: జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శరత్ చంద్ర పవర్ మంగళవారం పోలీసు అధికారులతో నెలవారి నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెండింగ్ కేసులు లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని అన్నారు. సమావేశంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

  • నాటు సారా సీజ్.. 13 మంది అరెస్ట్

    మహబూబాబాద్: నాటు సారా అమ్మకం కేంద్రాలపై మంగళవారం వరంగల్ ఎన్‌ఫోర్స్‌మెంట్, జిల్లా టాస్క్ ఫోర్స్, గూడూరు ఎక్సైజ్ సిబ్బంది దాడులు చేశారు. ఈసందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ.. గూడూరు మండలం అప్పరాజుపల్లి, దుబ్బగూడం గ్రామాల్లో నిర్వహించిన దాడుల్లో 37 లీటర్ల నాటు సారా,  300 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. 13 మందిని అదుపులోకి తీసుకోని 5 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

  • భూగర్భ జలాలపై కలెక్టర్ సమీక్ష

    జనగామ: కలెక్టరేట్‌లో మంగళవారం కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూగర్భ జల వనరుల పరిరక్షణలో జిల్లా ముందంజలో ఉందని పేర్కొన్నారు. భూగర్భ జలాల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. వాటి స్థాయిలను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ, ప్రజలకు వాటి ప్రాముఖ్యతను వివరించాలన్నారు.

  • ఎంపీఓకు పంచాయతీ కార్మికుల వినతి

    భద్రాద్రి కొత్తగూడెం: జూలూరుపాడు ఎంపీడీఓ కార్యాలయం ముందు మంగళవారం ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్మికులు ధర్నా చేశారు. అనంతరం ఎంపీఓ తులసీరామ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏదులాపురం గోపాలరావు మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ కార్మికుల జీతాలను తక్షణమే అందజేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు రెండు నెలలుగా జీతాలను ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.