Author: Shivaganesh

  • నియామకాలు నిలిపివేయాలని వినతి

    భద్రాద్రి కొత్తగూడెం: సింగరేణి కొత్తగూడెం ఏరియా డివైజిఎం పర్సనల్ మోహన్ రావుకు మంగళవారం కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ.. గత నాలుగు రోజులుగా కొత్తగూడెంలో సింగరేణి ఓసిలో ఉద్యోగాల పేరుతో సౌదా కంపెనీ నిర్వహిస్తున్న ఉద్యోగ నియామకాల ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని వినతి అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

  • ‘రుణాలను సద్వినియోగం చేసుకోవాలి’ 

    భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెంలోని పాత డీఆర్‌డీఏ కార్యాలయంలో మంగళవారం మహిళా సంఘాల సభ్యులకు పలు అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఏపీఎం సీహెచ్ అనురాధ పాల్గొని మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల స్వయం సహాయక బృందాల మహిళలు ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అవగాహన కార్యక్రమంలో జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు సుజాత, తదితరులు పాల్గొన్నారు.

  • గంజాయి సీజ్.. ముగ్గిరిపై కేసు నమోదు

    మహబూబాబాద్: గంజాయి తరలిస్తున్న ముగ్గురిని మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. గూడూరు బస్టాండ్ సెంటర్లో పోలీసులు వాహనాలు తనిఖీ నిర్వహిస్తుండగా గంజాయి తరలిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకొని వారి నుంచి మూడు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ సూర్యప్రకాష్ తెలిపారు. నిందితులు నాక డేవిడ్‌రాజ్, మధుగాన్, గూడూరు ఇన్‌తండాకు చెందిన భూక్య సురేష్‌లుగా గుర్తించి వారిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

  • విద్యార్థులకు ఉచితంగా నోట్ బుక్స్ అందజేత

    హన్మకొండ: గ్రేటర్ 46వ డివిజన్ పరిధిలోని రాంపూర్ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం రిటైర్డ్ డీఎస్పీ కొత్త వీరారెడ్డి జ్ఞాపకార్థం వారి కుమార్తెలు డాక్టర్ నిలోహిత, చైతన్యలు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా వారు విద్యార్థులకు నోట్ బుక్స్, న్యూ సైన్స్ కాలేజ్లో లెక్చరర్‌గా పని చేస్తున్న భాగ్యలక్ష్మి స్పోర్ట్స్ డ్రెస్సులను అందజేశారు. కార్యక్రమంలో కాజీపేట ఎంఈఓ మనోజ్ కుమార్, గ్రామపెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

     

  • పాఠశాల ముందు గడ్డిమందుతో నిరసన

    రాజన్న సిరిసిల్ల: దుమాల ఈఎంఆర్‌ఎస్ పాఠశాల ముందు మంగళవారం ఇటీవల తొలగించిన సిబ్బంది ముందు గడ్డిమందు డబ్బాతో నిరసన తెలిపారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. పదిహేనేండ్లుగా పని చేస్తున్న తమను ఎలాంటి బలమైన కారణం లేకుండా తొలగించడం అన్యాయమని వాపోయారు. సమాచారం అందుకున్న ఎస్సై రమాకాంత్ ఆధ్వర్యంలో సిబ్బంది నిరసనకారులకు నచ్చజెప్పారు. నిరసనలో పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

  • ‘విద్యాహక్కు చట్టాన్ని పక్కాగా అమలు చేయాలి’

    జగిత్యాల: కోరుట్ల పట్టణంలోని ప్రజా సంఘాల కార్యాలయంలో మంగళవారం సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు తిరుపతి నాయక్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో విద్యాహక్కు చట్టాన్ని అధికారులు పక్కాగా అమలు చేయాలని అన్నారు. విద్యాహక్కు చట్టాన్ని పలు విద్యాసంస్థల యజమానులు పట్టించుకోవడం లేదన్నారు. వాటిపైన అధికారులు దృష్టిసారించాలన్నారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

  • అనిశాకు పట్టుబడిన ఇద్దరు అధికారులు

    కరీంనగర్: కలెక్టరేట్‌లో మంగళవారం సాయంత్రం ఏసీబీ అధికారుల దాడులు కలకలం రేపాయి. పంచాయతీరాజ్ శాఖలోని విజిలెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ ఇంజినీర్ శరత్, సీనియర్ అసిస్టెంట్ వేణుగోపాల్‌ అద్దె కారు బిల్లు చెల్లింపు కోసం రూ.8వేల లంచం తీసుకుంటూ అనిశా అధికారులకు చిక్కారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితులను పట్టుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

  • మరణించి… వెలుగులు పంచిన యువకుడు

    పెద్దపల్లి: అనారోగ్యంతో గోదావరిఖని ఎల్బీనగర్‌కు చెందిన బొల్లి సతీష్(35) మృతిచెందారు. వారి కుటుంబం దుఃఖంలోనూ మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపాలని నిర్ణయం తీసుకుంది. గోదావరిఖని జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం సతీష్ మరణించారు. సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంక్ సాయంతో సతీష్ నేత్రాలను కుటుంబసభ్యులు దానం చేశారు. వారి నిర్ణయంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.

     

  • మద్యం మత్తులో ఘోరం.. ఏం చేశాడంటే?

    మహబూబాబాద్‌: మద్యం మత్తులో ఓ భర్త తన భార్యను హత్య చేసిన ఘటన మంగళవారం ఆలస్యంగా నెల్లికుదురు మండలంలో వెలుగుచూసింది. మండలంలోని హేమ్లాతండా గ్రామ పంచాయతీ పరిధిలోని ఇస్రా తండాకు చెందిన బానోత్ భద్రు సోమవారం రాత్రి మద్యం మత్తులో తన భార్య బానోత్ రంగమ్మ (55) నిద్రిస్తున్న సమయంలో గొంతు నులిమి హత్య చేశాడు. ఘటనపై తోర్రూరు సీఐ గణేశ్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

  • బాధ్యతలు స్వీకరించిన అశ్విని తానాజీ

    కరీంనగర్: జిల్లాలో అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ కరీంనగర్ బల్దియా కమీషనర్‌గా బదిలీ అయిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో బదిలీ అయిన అశ్విని తానాజీ వాకడే మంగళవారం జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆమె గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్‌గా విధులు నిర్వహించారు. ఈసందర్భంగా ఆమెను పలువురు అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.