Author: Shivaganesh

  • కళ్యాణలక్ష్మి చెక్కుల అందజేత

    మహబూబాబాద్: సీరోలు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 19 మంది లబ్ధిదారులకు మంగళవారం కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మహబూబాబాద్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ సుధాకర్ నాయక్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజలకు కళ్యాణలక్ష్మి వరం అని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్వో పూర్ణచందర్, తదితరులు పాల్గొన్నారు.

  • నిర్వాసితులకు చెక్కులు అందజేసిన కలెక్టర్

    రాజన్న సిరిసిల్ల: కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, వేములవాడ ఆర్డీవో రాధాబాయి నిర్వాసితులకు చెక్కులు అందజేశారు. వేములవాడ తిప్పాపూర్ బ్రిడ్జి నుంచి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో భూములు కోల్పోతున్న 150 నిర్వాసితులకు చెక్కులు అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

     

  • తాత్కాలిక బస్ షెల్టర్‌ ప్రారంభం

    పెద్దపల్లి: గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో మంగళవారం కనుకుల ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్ షెల్టర్‌ను ప్రారంభించారు. ఈసందర్భంగా ఛారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు మాట్లాడుతూ.. ప్రయాణికుల ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని దాతలు కె.ముండయ్య, కె.రవిచంద్ర సహకారంతో షెల్టర్ నిర్మించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మహంకాళి స్వామి, గట్ల రమేష్, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.

  • ఉప్పరగూడెంలో సమ్మిళిత విద్యా దినోత్సవం

    మహబూబాబాద్: ఉప్పరగూడెం ఎంపీయూపీఎస్‌లో మంగళవారం బడిబాట కార్యక్రమంలో భాగంగా సమ్మిళిత విద్యా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సీరోలు మండల విద్యాశాఖ అధికారి లచ్చిరాం పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేకావసరాల విద్యార్థులకు అందించాల్సిన విద్యా ప్రమాణాలు, ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను వివరించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

  • ‘అర్హులకు ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తాం’

    జగిత్యాల: ధర్మపురి మండలం నక్కలపేట గ్రామంలో మంగళవారం ఆర్డీఓ మధుసూదన్ పర్యటించారు. ఈసందర్భంగా ఆయన గ్రామంలో 41 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కాపీలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు రాలేదని ఎవరు ఆందోళన చెందవద్దన్నారు. అర్హులందరికి ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

  • నేదునూర్‌లో సంకల్ప సభ

    కరీంనగర్: బీజేపీ పరిపాలనతోనే గ్రామాల్లో అభివృద్ధి సాధ్యమని పార్టీ జిల్లా కార్యదర్శి బింగి కరుణాకర్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ 11 ఏళ్ల సుపరిపాలన సందర్భంగా నేదునూర్ గ్రామంలో మంగళవారం సంకల్ప సభ నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలతో ప్రజలకు ఎటువంటి లాభం జరగటం లేదని విమర్శించారు.

  • రామగుండంలో స్పెషల్ డ్రైవ్

    పెద్దపల్లి: రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మంగళవారం మోటార్ వాహనాల అధికారి సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో విద్యాసంస్థలకు సంబంధించిన బస్సులను తనిఖీ చేసినట్లు తెలిపారు. బస్సులు ఫిట్‌నెస్‌‌గా ఉండాలని, అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలని ఆదేశించారు. నిబంధనలు పాటించని యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

  • ముందస్తు యోగా కార్యక్రమాలు

    పెద్దపల్లి: ఆర్జీ-1 జీఎం కార్యాలయంలో మంగళవారం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ముందస్తు యోగా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జీఎం డి.లలిత్ కుమార్ హాజరై ఉద్యోగులతో కలిసి పలు ఆసనాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యోగాతో ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, ఉద్యోగులు, యోగా శిక్షకులు పాల్గొన్నారు.

  • పాలకుర్తిలో బీజేపీ నాయకుల సమావేశం

    జనగామ: పాలకుర్తి మండల కేంద్రంలోని సోమేశ్వర ఫంక్షన్ హాల్‌లో మంగళవారం బీజేపీ మండల అధ్యక్షుడు మారం రవికుమార్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ సర్కార్ 11 ఏళ్ల పాలనా కాలం పూర్తి అయిన సందర్భంగా చేసిన అభివృద్ధి పనులను వివరించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయాలని పిలుపునిచ్చారు.

  • పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన

    పెద్దపల్లి: రామగుండం నగరపాలక సంస్థ సిబ్బంది మంగళవారం వంద రోజుల ప్రణాళికలో భాగంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. ఈసందర్భంగా డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి మాట్లాడుతూ.. ఐడీఎస్‌ఎంసీ షాపింగ్ కాంప్లెక్స్ వెనుక ప్రజా మరుగుదొడ్లను శుభ్రం చేయించినట్లు తెలిపారు. 23వ డివిజన్‌లో మురుగు కాల్వల పూడిక తీయించినట్లు పేర్కొన్నారు. అనంతరం ప్రజలకు తడిపొడి చెత్తపై అవగాహన కల్పించామన్నారు.